కర్నూల్

పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, ఆగస్టు 6:మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు వద్ద సూమారు రూ. 202 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్‌ఆర్‌ఎంసి కాలువకు వెయ్యి క్యూసెక్యుల నీటిని శనివారం సాయంత్రం నీటి పారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం మహారాష్టల్రో భారీ వర్షాల కారణంగా శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరింది. పోతిరెడ్డిపాడు ఎగువ ప్రాంతాల్లో వున్న సాగు, తాగు నీటి అవసరాలను దృష్టిలో వుంచుకుని నీటి పారుదలశాఖ అధికారి ఎస్‌ఇ రామచంద్రయ్య, ఇఇ శ్రీనివాసురెడ్డి, డిఇ రమేష్ ఆధ్వర్యంలో 3వ గేట్ నుంచి 8వ గేట్ వరకూ ట్రయల్ రన్ ద్వారా నీరు విడుదల చేశారు. అలాగే పాత హెడ్ రెగ్యులేటర్ అయిన 2,3 గేట్ల ద్వారా నీరు విడుదల చేశారు.