కర్నూల్

దిగువ కాలువ నీటి సాధనకై ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, ఆగష్టు 17: తుంగభద్ర దిగువ కాలువల జలాల సాధనకై ఉద్యమిస్తామని మాజీ కేంద్ర మంత్రి కోట్లసూర్యప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం కోడుమూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు దేశం ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా ఇంత వరకు కోడుమూరు సబ్ డివిజన్‌లో దిగువ కాలువలకు సాగు నీటి విడుదల కాలేదన్నారు. అంతేగాక కోడుమూరు నియోజకవర్గంలో ప్రజల దాహర్తికై ఏర్పాటు చేసిన మంచి నీటి పథకాలు అన్ని చోట్ల నిర్వీర్యం అయ్యాయని ఆరోపించారు. దీంతో గ్రామాల్లో మంచి నీటి ఇబ్బందులు తీవ్ర తరం అయ్యాయని, జిల్లాలో ఉన్న మంత్రులు రైతుల సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఇక్కడ ఉన్న మంత్రులు అభివృద్ధి మరిచారని, అమరావతి పేరుతో రైతుల గోడును పట్టించుకోలేదన్నారు. గత రెండేళ్ల టిడిపి పాలనలో అన్నీ రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. అంతే గాక పేదలకు ఇళ్ల నిర్మాణాలు కూడా ఎక్కడా లేవని, ఇళ్ల నిర్మాణాల కోసం లబ్ధిదారులు అధికారుల చుట్టూ తిరిగినా ఇంతవరకు ఎక్కడా ఇళ్లు మంజూరు కాలేదన్నారు. టిడిపి ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టి అంతటా అభివృద్ధి కుంటూ పడుతోంద, పథకాల పేరుతో చేపట్టిన పథకాలు అన్ని విఫలమయ్యాయన్నారు. కోడుమూరు సబ్‌డివిజన్‌లో ఉన్న ఆయకట్టుకు సాగు నీరు అందించ లేక పక్కన ఉన్న గాజులదినే్న ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. రాయలసీమ జిల్లాలను ఎడారిగా మార్చేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో తప్పని సరిగా 850 అడుగుల నీటిని నిల్వ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పోరు బాట సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సిబి లత, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.