కర్నూల్

తగ్గిన వరి సాగు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 26:వర్షాభావ పరిస్థితులు, నిండని జలాశయాల కారణంగా జిల్లాలో వరిసాగు గణనీయంగా తగ్గింది. ఈ ప్రభావం వరి దిగుబడిపై పడి ఈ ఏడాది బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వర్షం కురవకపోవడంతో మెట్ట భూముల్లో పంటల సాగు సైతం పూర్తిస్థాయిలో రైతులు చేపట్టకపోవడం గమనార్హం. జిల్లాలో ఆగస్టులో కురవాల్సిన 135 మిల్లీమీటర్ల సగటు వర్షపాతానికి గాను కేవలం 25.4 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. సగటు వర్షపాతం కంటే ఇంకా 81శాతం వర్షం కురవాల్సి ఉందని అధికారిక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక జిల్లాకు ప్రాణాధారమైన శ్రీశైలం జలాశయం కూడా పూర్తిస్థాయిలో నిండకపోవడంతో కాలువలకు నీటి విడుదల సాధ్యపడలేదు. మరోవైపు తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు నీరు రాకపోవడంతో సుంకేసుల జలాశయం నుంచి కెసి కాలువ ద్వారా నీటి విడుదలను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. అంతేగాక తుంగభద్ర దిగువ కాలువకు కూడా నీటి సరఫరా అంతంత మాత్రంగానే ఉంది. దీని కారణంగా జిల్లాలో వరి పంట సాగు కేవలం 18.2 శాతానికి పరిమితమైంది. వరి పంట సగటు సాగు విస్తీర్ణం 79,018 హెక్టార్లకు గాను ఈ ఏడాది కేవలం 1612 హెక్టార్లలో మాత్రమే సాగులో ఉంది. ఈ పంట సాగు కూడా ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో వరి పంట అత్యధికంగా సాగయ్యే కెసి కాలువ, తెలుగుగంగ శాఖ కాలువలకు నీరు విడుదల కాకపోవడంతో రైతులు వేసిన వరి నారుమళ్లు ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. శ్రీశైలం జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం 872 అడుగులు, నీటి నిల్వ 150 టిఎంసిలు మాత్రమే ఉండటంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 3,800క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఈ నీటిని వెలుగోడు జలాశయం, ఎస్‌ఆర్‌బిసిలకు తరలిస్తున్నారు. హంద్రీ-నీవా ద్వారా ప్రస్తుతం నీటి సరఫరాను నిలిపివేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అవసరమైన సమయంలో మళ్లీ నీటిని విడుదల చేస్తామని వారంటున్నారు. సుంకేసుల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 1.2 టిఎంసిలు కాగా ఒక టిఎంసిని నిర్వహిస్తూ అంతకు మించి నీరు వస్తే కాలువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా కూడా కేవలం 200 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. దీంతో వరి పంట సాగుకు అవరోధాలు ఎదురవుతున్నాయి. కాగా బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం బియ్యం ధర క్వింటాల్‌కు రూ. 5,800 వరకూ ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం, పది రోజుల నుంచి సుమారు రూ. 700 పెరిగిందని స్పష్టం చేస్తున్నారు. వాతావరణ పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న అతి కొద్ది రోజుల్లోనే బియ్యం ధర ఆకాశాన్నంటే పరిస్థితి లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. దీంతో బియ్యం ధరపై ప్రజల్లో ఆందోళన నెలకొని ఉంది.