కర్నూల్

పోతిరెడ్డిపాడును సందర్శించిన కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, ఆగస్టు 30: మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ప్రాజెక్టును మంగళవారం సాయంత్రం కేంద్ర జలవనరుల శాఖ ప్రతినిధులు సమీర్‌చటర్జీ, సిహెచ్ ఇంతి నాగపూరి, పవన్‌బాలన్, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో నీటి వాడకం విషయంలో వివాదాలు నెలకొని వున్నాయని, రాష్ట్రాల నీటి వాడకం అంశంపై ఢిల్లీలో జూన్ 21, 22తేదీల్లో సమావేశం జరిగిందని తెలిపారు. అయితే ఆ సమావేశంలో ఏ రాష్ట్రం ఏ మేరకు నీటిని వాడుతుందన్న విషయం భయటపడటం లేదని అందువల్ల ఇక మీదట ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా వుండేందుకే ప్రత్యేకంగా ప్రాజెక్టులను పరిశీలించి నీటి వాడకంపై స్పష్టమైన సమాచారం సేకరిస్తున్నామన్నారు. అలాగే ప్రతి ప్రాజెక్టు వద్ద టెలిమీటర్ ఏర్పాటు చేస్తునట్లు వారు తెలిపారు. వారి వెంట ఎస్‌ఇ శ్రావణ్, ప్రాజెక్టు సిఇ సునీల్, ఇఇ రవీందర్, నాగరాజు, తదితరులు ఉన్నారు.