కర్నూల్

బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 30 : జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాలను సెప్టెంబర్ 30వ తేదీ లోపు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్ విజయమోహన్ అధికారులను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మా ణం, బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దే’ అంశాలపై మంగళవారం నగరంలోని సునయన ఆడిటోరియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి పురస్కరించుకుని బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలను డిక్లేర్ చేయడం, ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డిప్యూటీ సిఎం, జిల్లా ఇన్‌చార్జి మంత్రులను ఆహ్వానించి ఓడిఎఫ్ గ్రామాల కోసం ప్రత్యేక కృషి చేసిన సిఆర్‌పిలకు ప్రకటించిన రూ. 5వేల నగదు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. కృష్ణా పుష్కరాల్లో సమష్టిగా కృషి చేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలిపారని, అదే స్ఫూర్తితో ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఈ నెల రోజుల్లో పెండింగ్‌లో వున్న మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయడం, వర్క్‌ఆర్డర్ ఇవ్వాల్సిన లబ్ధిదారులకు ఇవ్వడం, వంటివి పూర్తి చేసి గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. అవసరం మేరకు అదనంగా సిఆర్‌పిలను కేటాయిస్తామన్నారు. బిల్లుల చెల్లింపులు, వర్క్ ఆర్డర్ ఇవ్వడంలో సమస్యలుంటే వారం లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మొట్టమొదట ఓడిఎఫ్ గ్రామంగా బిజినవేముల గ్రామాన్ని గుర్తించామన్నారు. సమావేశంలో డ్వామా పిడి పుల్లారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.