కర్నూల్

హోదాతోనే స్వర్ణాంధ్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఆగస్టు 30:వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ఖచ్చితంగా 854 అడుగుల వరకూ స్థిరీకరించాలని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం డిసిసి అధ్యక్షుడు లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించగా కోట్లతో పాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి, ఎమ్మెల్సీ ఎం.సుధాకర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ముఖ్యంగా సిఎం చంద్రబాబు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు సిద్ధేశ్వరం అలుగు, గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఇక పట్టిసీమ ద్వారా సీమకు 45 టిఎంసిల నీరిచ్చి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పినా ఇంతవరకూ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల వల్ల ఎండిపోయిన పంటను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 854 అడుగుల వరకూ స్థిరీకరించాలని డిమాండ్ చేస్తూ త్వరలో పోతిరెడ్డిపాడు నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే సీమాంధ్ర స్వర్ణాంధ్ర అవుతుందని, దానివల్ల రాష్ట్రానికి రూ. 5 లక్షల కోట్లతో పాటు వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు. అయితే ప్రత్యేక హోదా బిజెపి ప్రభుత్వం వల్ల సాధ్యం కాదని, అది కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందన్నారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పార్టీని మరింత పటిష్ట పరిచేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలిపి వారిని చైతన్యపరిచేందుకు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇక 1937 శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసి, హైకోర్టును గుంటూరులో ఏర్పాటు చేయాలని పెద్దమనుషుల ఒప్పందంలో తీర్మానం చేశారని గుర్తుచేశారు. అయితే ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సీమ ప్రాంతానికి సిఎం చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నా ప్రతిపక్ష నేత జగన్ నోరు మెదపటం లేదన్నారు. కావున సీమకు ద్రోహం చేస్తున్న వారిద్దరినీ ప్రజలు సీమ ద్రోహులుగా పరిగణించాలన్నారు. హోదా విషయంలో చంద్రబాబు, జగన్ వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి, ప్రత్యేక హోదా వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలిపి ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రణాళికాబద్దంగా ప్రజా క్షేత్రంలోకి వెళ్తామన్నారు. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతికార్యకర్త సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పిసిసి రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పిసిసి కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, అశోకరత్నం, పెద్దారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.