కర్నూల్

టెలిమీటర్ల ఏర్పాటుతో జల వివాదాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందికొట్కూరు, ఆగస్టు 30:రాష్ట్రాల మధ్య జల వివాదాలకు చెక్ పెట్టాలంటే ప్రాజెక్టుల వద్ద టెలిమీటర్ల ఏర్పాటే సరైన మార్గమని కృష్ణా యాజమాన్య బోర్డు పేర్కొంది. మండల పరిధిలోని మల్యాల గ్రామ సమీపంలో వున్న హంద్రీనీవా సుజల స్రవంతి మొదటి ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం కృష్ణా యాజమాన్య బోర్డు కార్యదర్శి సమీర్‌చటర్జీ, సభ్యులు పవన్‌బాలన్, చీఫ్ ఇంజినీర్ నాగ్‌పూరి, నాగార్జునసాగర్ చీఫ్ ఇంజినీర్ సునీల్, ఎస్‌ఇలు శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రామచంద్రయ్య, రవీంద్రారెడ్డి పరిశీలించారు. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ హంద్రీనీవా ప్రాజెక్టు వద్దకు ఏవిధంగా చేరుకుంటుందనే విషయంపై వారు చర్చించారు. శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 835 అడుగులకు చేరగానే హంద్రీనీవాకు నీరు విడుదల చేసుకోవచ్చని ప్రాజెక్టు ఎస్‌ఇ నారాయణస్వామి, ఇఇ పాండురంగయ్య వారికి వివరించారు. ఈ సందర్భంగా బోర్డు కార్యదర్శి సమీర్‌చటర్జీ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి వాడకంపై ఇటీవల కాలంలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయన్నా. నీటి తరలింపు విషయంలో కూడా ఇరు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో నీటి వాడకంపై ఏపి, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల వద్ద టెలిమీటర్ ఏర్పాటు చేస్తే ఎవరు ఎంత నీరు వాడుకున్నది వెంటనే తెలుస్తుందన్నారు. వీటికి శాటిలైట్‌ను అనుసంధానం చేస్తే ఎక్కడున్నా ఏ ప్రాజెక్టు నుంచి ఏ రాష్ట్రం ఎంత నీరు వినియోగించుకుంటుందనేది బహిర్గతం కావడంతో వివాదాలకు తావు వుండదన్నారు. నీటి వాడకం ఎంత అనేది తెలిస్తే అవసరాన్ని బట్టి మాత్రమే నీరు వాడుకుంటారని, నీటి వృథాను కూడా ఈ పద్ధతిలో అరికట్టవచ్చన్నారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, నాగార్జునసాగర్, తెలంగాణలోని జూరాలతో పాటు అన్ని ప్రాజెక్టుల్లో టెలిమీటర్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. వారి వెంట ఏఇ సోమన్న ఉన్నారు.