కర్నూల్

టమోటా కిలో రూపాయి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తికొండ, ఆగస్టు 31: టమోటా పంట దిగుబడి అధికంగా కావడంతో మార్కెట్‌కు విపరీతంగా టమోటాలను రైతులు తీసుకురావడంతో కిలో రూ. 1కి పడిపోయింది. మంగళవారం హోల్ సేల్ వ్యాపారులు రైతుల నుండి 25 కిలోల టమోటా గంపను రూ. 20లకు కొనుగోలు చేయడంతో రైతులు లబోదిబో అన్నారు. మంగళవాం హోల్‌సేల్ వ్యాపారుల వద్దకు టమోటాలు లారీ సరుకు వచ్చింది. దీంతో వ్యాపారులు వేలం పాట నిర్వహించి 25కిలోల గంప రూ.20 చొప్పున రెండు గంపలు రూ. 40లతో కొనుగోలు చేశారు. ధర లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు పై మార్కెట్లలో టమోటా ధర లేనందున అధిక ధరలకు కొనుగోలు చేయలేమని స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు వచ్చిన ధరకు టమోటాలు అమ్ముకున్నారు. ప్రభుత్వం టమోటా పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని పత్తికొండ, నలకదొడ్డి, దూదెకొండ, దేవనబండ, చక్రాళ్ల, సందోళి గ్రామాల రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.