కర్నూల్

జగన్‌కి జైలు ఖాయం:ఎమ్మెల్యే జయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు,సెప్టెంబర్ 4:మోసపూరిత మాటలతో రైతులను దగా చేస్తున్న వైఎస్.జగన్‌ను ఎవ్వరూ నమ్మరని, జగన్ మళ్లీ జైలుకు పోవడం ఖాయమని ఎమ్మెల్యే బివి.జయనాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మిగనూరులో ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ సిఎం చంద్రబాబు రైతులని మోసం చేస్తున్నారని జగన్ ఆరోపించడం సరికాదని, పదేళ్ల క్రితం జలయజ్ఞం పేర ధన యజ్ఞం చేసి కోట్లు సంపాదించారని, ఆ నాడు సిఎం వైఎస్‌ఆర్‌ను అడ్డం పెట్టుకుని జగన్ కోట్లు దిగమింగాడని అలాంటి వ్యక్తి సిఎం చంద్రబాబును విమర్శిస్తే పుట్టగతులువుండవని హెచ్చరించారు. రెయిన్ గన్స్ అంటేనే తెలియని జగన్‌కు విమర్శలు చేచడం తగదని, రాయలసీమకు చంద్రబాబు న్యాయం చేసుకుంటూ ముందుకు పోతుంటే వాటిపై జగన్ విమర్శిస్తే తగన మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. సాక్షి దినపత్రికను అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి ఆరోపించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఆర్డీ ఎస్ ద్వార నీరు తీసుకోస్తే దానిపై కూడ విమర్శలు చేస్తున్నారని,గురురాఘవేంద్ర కాలువను ఆ నాడు నా తండ్రి మాజీ మంత్రి బివి.మోహన్ రెడ్డి తీసుకోస్తే కూడా విమర్శించారన్నారు. ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎమ్మెల్యేల సమక్షంలో క్షమాపణ కోరితే సస్పెండ్ ఎత్తివేస్తారన్నారు. చంద్రబాబు గురించి జగన్ ఆరోపణలు చేయడం ఇప్పటికైన మానుకోవాన్నారు. కాంగ్రెస్ మేదోమదనంతో ఈ రాష్టన్న్రి సర్వ నాశనం చేశారని, కాంగ్రెస్ కోలుకోవాలంటే 20 ఏళ్లు పడుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, పట్టణ టిడిపి అధ్యక్షుడు అజ్మతుల్లా, నాయకులు రాందాస్ గౌడ్, కల్లీముల్లా, రంగస్వామి గౌడ్, నరసింహులు, శివన్న, సుందర్ రాజు, దాదా సాహేబ్, భాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.