కర్నూల్

బక్రీద్, గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 11:బక్రీద్, గణేశ్ నిమజ్జనోత్సవం ఒకే రోజు కావడంతో నగరంలోని హిందూ, ముస్లింలు పరస్పర సహకారంతో ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని కలెక్టర్ సిహెచ్.విజయమోహన్ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ భవన్‌లో ఆదివారం ముస్లిం మత పెద్దలు, గణేశ్ నిమజ్జన ఉత్సవ కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లౌకిక దేశంగా పేరొందిన మన దేశంలో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచి ఈ నెల 13వ తేదీ బక్రీద్, గణేశ్ నిమజ్జన ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఇరు మతాల వారు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలన్నారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా మసీదుల సమీపంలో ప్రార్థన సమయాల్లో ఎక్కువ శబ్ధం చేయకుండా వెళ్లాలన్నారు. ఎస్పీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ గత ఏడాది కూడా బక్రీద్, వినాయక నిమజ్జనోత్సవం ఒకే రోజు వచ్చాయని, ఆ పర్వదినాన నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇరువర్గాల వారు సహకరించారని వెల్లడించారు. అదేరీతిలో ఈ నెల 13వ తేదీ నిర్వహించే గణేశ్ నిమజ్జనం, బక్రీద్ వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. నిమజ్జనం సందర్భంగా నగరంలో 1,355 మంది పోలీసు అధికారులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఊరేగింపులో యువకులు మద్యం తాగకుంగా కట్టుదిట్టం చేస్తామన్నారు. అంతేకాకుండా ముఖ్యమైన కూడళ్లలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్ కెమెరాలతో వీడియో తీస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. 200 మంది పోలీసులను మఫ్టీలో ఏర్పాటు చేస్తామని, అనుమానిత వ్యక్తులు, అసాంఘిక సంఘటనలు, మద్యం అక్రమ రవాణా వంటి అంశాలు తమ దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోవధను నిషేధించామని ముస్లింలు సహకరించాలన్నారు. సమావేశంలో డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, ఆర్డీఓ రఘుబాబు, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మస్తాన్‌వలి పాల్గొన్నారు.