కర్నూల్

నగరంలో వేగంగా అభివృద్ధి పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, సెప్టెంబర్ 23:నగరంలో అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తవుతాయని రాజ్యసభ సభ్యులు టిజి.వెంకటేష్ తెలిపారు. రాయలసీమ యూనివర్శిటీకి నీరందించేందుకు నగరంలోని టెలికాంనగర్‌లో రూ. 1.8 లక్షలతో చేపట్టిన తాగునీటి సరఫరా లైన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన, రైతు రుణమాఫీ, పింఛన్ల మొత్తం పెంపు, కరవు, తుపాన్లు, తదితర కారణాలతో సిఎం చంద్రబాబు గత రెండేళ్లలో నగరాభివృద్ధికి సక్రమంగా నిధులు విడుదల చేయలేకపోయారన్నారు. అయితే ప్రస్తుతం నిధుల కొరత లేదని, 24 గంటల పాటు పని చేసే సిబ్బంది కావాలన్నారు. రాబోయే మూడేళ్లలో నగరంలో ఏ కాలనీలో సిసి రోడ్డు లేదు అనే సమస్య ఉండదన్నారు. కల్లూరు కాలనీల అభివృద్ధికి కూడా పుష్కలంగా నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే ప్రస్తుతం వానలు ముసురు కున్నాయని దీంతో మలేరియా, డెంగ్యూ లాంటి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులను మెరుగుపరచి మురికినీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మురికి కాలువల్లో దోమల గుడ్లను నాశనం చేసి, తద్వారా దోమలు వ్యాప్తి చెందకుండా చేయటానికి ఉచితంగా హైపో ద్రావణం పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు తక్కువగా ఉండడంతో మురికినీటి కాలువలను సరిగా శుభ్రం చేయకపోవడంతో చాలా కాలనీల్లో పందుల బెడద ఎక్కువగా ఉందని, దీంతో దోమలు వ్యాప్తి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. కల్లూరు కాలనీల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ, మున్సిపల్ ఇంజినీర్ రాజశేఖర్, డిఇ నబిరసూల్, టిడిపి నాయకులు పెరుగు పురుషోత్తం రెడ్డి, మల్లెల పుల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.