కర్నూల్

అక్రమ కట్టడాలను అరికట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, అక్టోబర్ 9: నగరంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలతో పాటు డ్రైనేజీలపై కట్టుతున్న అక్రమ కట్టడాలను అరికట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు కె.కన్నబాబు ఆదేశించారు. ఆదివారం ఆయన నగరంలోని జోహరాపురం, సోమిశెట్టి నగర్, టెలికాం నగర్, పాత నగరంలోని పెద్దపడఖాన, కమేలా, సంతోష్ నగర్, బాలాజీ నగర్, ప్రకాష్ నగర్‌లలో పర్యటించారు. అనంతరం నగర పాలక సంస్థ సమావేశ భవన్ నందు అన్ని విభాగాలకు చెందిన అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలను మంజూరు చేస్తోందని, అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో ఎక్కడ నాణ్యత లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైన ఉందన్నారు. అభివృద్ధి పనులతో పాటు శానిటేషన్, ఇంజినీరింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేసి ఆయా కాలనీల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను హెచ్చరించారు. ఎక్కడ చూసిన అక్రమ కట్టడాలే కనిపిస్తున్నాయని, అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అలాగే పుట్‌పాత్‌ల ఆక్రమణలు, డ్రైనేజీ కాల్వలపై కట్టిన అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని, అనేక కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించిందని, వెంటనే పేరుక పోయిన చెత్తను తీసి వేసి దోమలు వ్యాప్తి చెందకుండ చూడాలన్నారు. అక్రమ కట్టడాలపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, ఎస్‌ఇ శివరామిరెడ్డి, ఎంహెచ్‌ఓ కళ్యాణ చక్రవర్తి, ఎంఇ రాజశేఖర్, డిఇలు మనోహార్ రెడ్డి, శేషసాయి, రాధాకృష్ణ, ఎఈలు తదితరులు పాల్గొన్నారు.