కర్నూల్

మరుగుదొడ్డి వినియోగంపై చైతన్యం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 13:మరుగుదొడ్డి నిర్మించుకోవడంతో పాటు వినియోగించుకునేలా మహిళల్లో చైత న్యం తేవాలని కలెక్టర్ విజయమోహన్ సిఆర్‌పిలకు సూచించారు. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దటంలో భాగంగా కొత్తగా చేరిన వారికి గురువారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో కలెక్టర్ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సిఆర్‌పిలు సక్రమంగా విధులు నిర్వర్తించి 54 గ్రామాలను ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దారని అభినందించారు. వారి కృషిని అభినందిస్తూ అక్టోబర్ 2వ తేదీ ప్రశంసాపత్రం, రూ. 5వేలు పారితోషికంతో సత్కరించామన్నారు. నవంబర్ 14వ తేదీ నాటికి వంద గ్రామాలను లక్ష్యంగా నిర్ణయించి ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు తదుపరి సిఆర్‌పిలను గ్రామాలకు పంపుతామని, వీరు ముందువారిని స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి సేవలందించాలన్నారు. స్వచ్ఛ్భారత్ మిషన్ కింద 50 గ్రామాలు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద 50 గ్రామాలుగా నిర్ణయించామన్నారు. ఓడిఎఫ్ గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాల ప్రజలకు రుణా ల మంజూరులో ప్రాధాన్యత ఇస్తామని అవసరం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 50శాతం సబ్బిడీ అందజేస్తామన్నారు. వితంతువులు, భర్త వదిలేసిన వారు, ఎస్సీ వర్గాల వారు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే ఎస్సీ కార్పొరేషన్ కింద మంజూ రు చేయిస్తామన్నారు. 3 గ్రామాలను ఓడిఎఫ్ చేసిన వారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే వారికి అదనంగా మార్కులు ఇచ్చి పోస్టులు ఇస్తామన్నారు. గ్రామాల్లో మహిళలు మరుగుదొడ్డి నిర్మించుకునేలా అవగాహన ర్యాలీలు, గ్రామీణ క్రీడలు, ముగ్గుల పోటీలు, ఇతరత్రా గ్రామీణ ఆట పోటీలు నిర్వహించాలన్నారు. అందు కు సంబంధించి ఫొటోలను వాట్స్‌ప్ ద్వారా తనకు పంపాలని, అందుకు అనుగుణంగా నిధులు సర్దుబాటు చేస్తామన్నారు. గ్రామాల్లో సర్వే చేసి మరుగుదొడ్డి లేని వారిని గుర్తించి, ఆ కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకునేలా చైతన్యపరచాలన్నారు. ఆయా కుటుంబాలకు డబ్బు సమస్య వుంటే గ్రామ సర్పంచ్ నుంచి కానీ సంఘం నుంచి కానీ రుణం ఇప్పించుట, లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా సహాయం అందించేలా మండ ల స్థాయి అధికారులు, సిఆర్‌పిలు చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లుల చెల్లింపు, ఇతరత్రా ఇబ్బందులు ఉంటే సిఆర్‌పిలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. సిఆర్‌పిలకు గ్రామా ల్లో వౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ, డ్వామా పిడిలు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డ్వామా పిడి పుల్లారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ హరిబాబు, సిఆర్‌పిలు, కో ఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.