కర్నూల్

కుదిరిన సయోధ్య..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, నవంబర్ 22: నిన్నటి వరకు కత్తులు దూసిన నంద్యాల టిడిపి నేతలు నేడు చేతులు కలిపారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను వేడెక్కించిన ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి, మాజీ మంత్రులు ఎన్‌ఎండి ఫరూక్, శిల్పామోహన్‌రెడ్డి హైకమాండ్ ఆదేశాలతో వెనక్కు తగ్గారు. నంద్యాల టిడిపి నేతల మధ్య నెల కొన్న విభేదాలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడును ఆదేశించడంతో ఆయన సోమవారం కర్నూలులో మంతనాలు జరిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో టిడిపిలో గ్రూపు తగాదాలు ఉన్నా యని, జన చైతన్య యాత్రల సందర్భంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న విషయాన్ని అధిష్టానం సీరియస్‌గా పరిగణిస్తోందని చెప్పిన ట్లు సమాచారం. విభేదాలు పక్కనపెట్టి అంతా కలసిమెలసి పనిచేయాలని సిఎం మాటగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏమైనా ఉంటే సిఎం సమక్షంలో పరిష్కరించుకోవాలని మంత్రి సూచిం చినట్లు సమాచారం. దీంతో నేతలు ఓ అడుగు వెనక్కు తగ్గి సరే అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద మంత్రి సమక్షంలో జరిగిన చర్చల వల్ల ఇరువర్గాల మధ్య కొంతమేరకు మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మంగళవారం నంద్యాల పట్టణంలో నిర్వహించిన జనచైతన్యయాత్రల్లో పాల్గొన్న మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ఎక్కడ కూడా భూమానాగిరెడ్డిపేరుఎత్తలేదు. వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండడమేగాక టిడిపి అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.
కాగా కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గంలో టిడిపి నేతలు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య ఇదేవిధంగా వర్గపోరు ఉండగా అక్కడి ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒకే వేదికపై నుండి ఇద్దరు నేతలు కలసి మాట్లాడడం, కలసి విందుకు వెళ్లడం తెలిసిందే. నంద్యాలలో కూడా అదేవిధంగా జరిగితే బాగుంటుందని టిడిపి శ్రేణులు భావిస్తున్నాయి. ముగ్గురు నేతలున్న నంద్యాల పట్టణంలో తలో వర్గంగా విడిపోతే టిడిపి ప్రతిష్ట దిగజారి పోతుందని, ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఇన్‌చార్జి మంత్రి రెండు వర్గాల నేతలకు హితబోధ చేసినట్లు తెలిసింది. ఇద్దరి మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో మరోసారి భేటీ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి అధినేత ఇద్దరి మధ్య రాజీ కుదిరిస్తే, ఇద్దరు కలసి ఒకే వేదిక నుండి జన చైతన్యయాత్ర నిర్వహిస్తే టిడిపికి నంద్యాలలో పోటీ ఉండదని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్న ఆశాభావంతో టిడిపి శ్రేణులు ఉన్నాయి.