కర్నూల్

రాఘవేంద్రుని సేవలో తరించిన భద్రగజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంత్రాలయం,డిసెంబర్ 4:పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం గజలక్ష్మికి మఠం అధికారులు బరువెక్కిన హృదయాలతో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆదివారం మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కుకు తరలించారు. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు గజరాజుకు ప్రత్యేక పూజలు చేసి మఠం ప్రాకారంలో ఘనంగా ఊరేగించారు. అనంతరం గజలక్ష్మికి ఇష్టమైన రాగి ముద్దలు, చెరకు, వివిద రకాల పళ్లను సమర్పించారు. ప్రస్తుత పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థుల పూర్వాస్రమ తాతగారు, పూర్వ పీఠాధిపతులు శ్రీ సుజరుూంద్రతీర్థుల కాలంలో గజలక్ష్మికి మైసూరు అడవుల నుంచి శ్రీ మఠానికి తీసుకువచ్చారు. దాదాపు 30 సంవత్సరాలకు పైగా గజలక్ష్మికి మఠంలో ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాదరాయల సేవలో తరించింది. గజలక్ష్మి వెళ్లిపోతుండటంతో పీఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థులు, మఠం అధికారులు, కొన్ని సంవత్సరాలగా ఆలనాపాలనా చూసిన మఠం సిబ్బంది, గ్రామస్తులు నేడు కన్నీరు మున్నీరయ్యారు. ఈసందర్బంగా మఠం మేనేజర్ శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఇన్ని సంవత్సరాలుగా శ్రీ రాఘవేంద్రస్వామి మఠానికి సేవలందించిన గజరాజుకు వయసు మళ్లడంతో చక్కటి సంరక్షణ అందించాలనే ఉద్దేశంతోనే సహాయ జంతు సంరక్షణ అధికారి ఎం శల్వకుమార్, డాక్టర్ త్వైబాసింగ్ నేతృత్వంలో తిరుపతిలోని ఎస్‌వి జులాజికల్ పార్క్‌కు తరలిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పండిత కేసరి, రాష్టప్రతి అవార్డుగ్రహీత రాజాఎస్ గిరియాచార్యులు, మఠం జోనల్ మేనేజర్ శ్రీపతాచార్, తదితర మఠం అధికారులు పాల్గొన్నారు.

వెంగళాంపల్లెలో విషాదం

డోన్, డిసెంబర్ 4:ప్యాపిలి మండలంలోని రంగాపురం వద్ద ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడి అక్కడే మృతి చెందగా మరో 8 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డోన్ మండలంలోని కొచ్చెరువు గ్రామంలో వ్యవసాయపనుల నిమిత్తం ప్రతి రోజు వెంగళాంపల్లె గ్రామానికి చెందిన మహిళలు కూలీ పనులకు వెళ్లేవారు. దినచర్యలో భాగంగా ఆదివారం కొచ్చెరువు గ్రామానికి చెందిన ఆటోలో మహిళలు వెళ్తుండగా రంగాపురం వద్దకు రాగానే అరుణాచలం ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ ఢీకొంది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న జ్యోతి (18), మాసుంబీ (35), పెద్దక్క (65) అనే మహిళలు అక్కడి అక్కడే మృతి చెందారు. శ్రీవాణి, మల్లేశ్వరీ, రంగమ్మ, సరళ, దస్తగిరమ్మ, మహేశ్వరీ, సుంకులమ్మ, లక్ష్మీదేవిలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరిని చికిత్సనిమిత్తం డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాదితులంత ప్యాపిలి మండలం వెంగళాంపల్లె గ్రామస్తులు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లె ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న డోన్ డిఎస్పీ బాబాపకృద్దీన్, సిఐ ప్రసాద్‌లతోపాటు, టిడిపి జిల్లా కార్యదర్శి వై నాగేశ్వరరావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్యాపిలి పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.
పిఆర్‌ఓ కారు ధ్వంసం
అరుణాచల ట్రాన్స్‌పోర్టుకు చెందిన లారీ ఢీకొనడం వల్లె ముగ్గురు మృతి వాతపడ్డారని టిడిపి జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ప్యాపిలి మాజీ ఎంపిపి శ్రీనివాసుల ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనలకు దిగారు. బాధితులకు న్యాయం జరిగేవరకు మృతదేహాలను కదలనీయమని తేల్చి చెప్పారు. దీంతో ట్రాన్స్‌పోర్టు పిఆర్‌ఓల బాల సుబ్రమాణ్యం రంగంలోకి దిగారు. గ్రామస్తులకు నచ్చచెపేందుకు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు పిఆర్‌ఓ కారును ధ్వంసం చేశారు. దీంతో సంఘటనాస్థలంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని నాగేశ్వరరావు, శ్రీనివాసులు పేర్కొన్నారు. బాదితుల రోదనలు గ్రామస్తుల ఆందోళనలతో సంఘటనాస్థలం హోరెత్తిపోయింది.
రైతుకంట కన్నీరు కరవుకు సూచన
నంద్యాల, డిసెంబర్ 4: సమాజం బాగుండాలంటే రైతు బాగుపడాలని, రైతు కన్నీరుపెడితే కరువు తాండవిస్తుందని, రైతుకు కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్తవ్రేత్తలు, విస్తరణ అధికారులపైనే ఉందని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. ఆదివారం మహానంది వ్యవసాయ కళాశాలలో రజతోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈయనతో పాటు బనగానపల్లె ఎమ్మెల్యే, బోర్డు మెంబర్ బిసి జనార్ధన్‌రెడ్డి, విజయనగరం ఎమ్మెల్యే, బోర్డు సభ్యురాలు మీసాల గీత, రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి, ఆచార్య ఎన్‌జి రంగా విశ్వవిద్యాలయం పరిశోధనా డీన్ ఆఫ్ అగ్రికల్చర్ రమేశ్‌బాబు, వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు రాజారెడ్డి, పరిశోధనా సంచాలకులు ఎన్‌వి నాయుడు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, మహానంది వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ బాలగురువయ్య, కళాశాల పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, మాజీ ఉపకులపతి పద్మరాజు, తదితరులు పాల్గొన్న సమావేశంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ వ్యవసాయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సింది వ్యవసాయ విద్యార్థులు, శాస్తవ్రేత్తలే అన్నారు. దేశాన్ని సైనికుడు ఏవిధంగా కాపాడుతున్నారో రైతులకు వ్యవసాయ విద్యార్థులు సైనికుల వలె పనిచేసి కాపాడుకోవాలన్నారు. వ్యవసాయ విద్యార్థులు సృజనాత్మక ధోరణిలో ముందుకు సాగాలన్నారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళికలు రూపొందించడం, పంటలను కాపాడుకునేందుకు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన బాధ్యత వ్యవసాయ విద్యార్థులదే అన్నారు. ప్రస్తుత తరం శాస్తవ్రేత్తలు సృజనాత్మకత ధోరణిలతో పరిశోధనలు ఆవిష్కరించి రైతులు లాభదాయక పంటలతో వర్ధిల్లేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అంది పుచ్చుకుని డ్రోన్‌ల ద్వారా పంట పొలాలను పరిశీలించి క్రిమికీటకాల స్థితిగతులను తెలుసుకుని మందులు కూడా డ్రోన్‌ల ద్వారా వెదజల్లే అవకాశాలను వెలికితీయాలన్నారు. రైతులు పండించే పంటలలో ఉత్పత్తులు పెరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత శాస్తవ్రేత్తలదే అన్నారు. వ్యవసాయంలో హరితవిప్లవం, వైట్, ఎల్లో, బ్లూ రివెల్యూషన్స్ వచ్చాయని, ప్రస్తుత తరం యువత విప్లవాత్మంగా ఆలోచించి వ్యవసాయాన్ని కాపాడుకోవడం వల్ల దేశ జిడిపి పెరగడంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. దేశ జిడిపి వ్యవసాయ ఉత్పత్తులపైనే ఆధారపడి ఉంటుందని మనదేశంలో 65శాతం పైగా జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని వీరి కోసం వ్యవసాయ విద్యార్థులు అంతా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఈసమావేశంలో బిఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ కోర్సుకు సంబంధించిన కొత్త సిలబస్ పుస్తకాన్ని, సావనీర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మహానంది వ్యవసాయ కళాశాల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈసమావేశంలో బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్ధన్‌రెడ్డి, విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత పాలకమండలి సభ్యులు మాట్లాడుతూ వ్యవసాయాభివృద్ధికి చేయాల్సింది ఎంతో ఉందని రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా నిధులు కేటాయించేందుకు సిఫార్సు చేస్తామని, వ్యవసాయ కళాశాలల్లో వౌళిక సదుపాయాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఏ గ్రేడ్ రావడం ఈ ప్రాంత ప్రజలు హర్షించదగ్గ విషయమని అన్నారు.

దేశ పురోభివృద్ధిలో రైతుదే ప్రధాన పాత్ర
* వ్యవసాయ శాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి

నంద్యాల, డిసెంబర్ 4:దేశ పురోభివృద్ధిలో రైతుదే ప్రధానపాత్ర అని, 65శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడుతున్న దేశంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యవసాయ శాఖ డైరెక్టర్, ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి తెలిపారు. ఆదివారం నంద్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానంలో 46వ రాష్టస్థ్రాయి పరిశోధనా, విస్తరణ సలహా మండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు ఎన్‌వి నాయుడు, విస్తరణ సంచాలకులు డాక్టర్ రాజారెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే, పాలకమండలి సభ్యులు బిసి జనార్ధన్‌రెడ్డి, నాగేశ్వరరావు, మురళీనాధరెడ్డి, మేకల లక్ష్మీనారాయణల ఆధ్వర్యంలో పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం ప్రారంభించారు. రాష్ట్రంలోని 6 ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల పరిధిలోని ప్రాంతాలలో 2016-17 సంవత్సరాలలో పంటల ప్రణాళిక, పరిశోధన సిఫార్సులపై నిర్ణయం తీసుకునే రెండు రోజుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయ ప్రగతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు లేదన్నారు. ఎపిలో జిడిపిలో 26శాతం ప్రగతి వ్యవసాయం వల్లనే చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో పంటల ప్రణాళికల విషయంలో పరిశోధనలు ఏవిధంగా చేపట్టాలి విస్తరణ లోపాలను ఎలా సరిచేయాలి, ఏయే పంటలపై దృష్టి సారించాలి, ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, సాధించాల్సిన లక్ష్యాలను నిర్ధేశించుకుని ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు. పరిశోధనా స్థానాల పరిధిలో పనిచేస్తున్న డాక్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేసి రైతులకు, శాస్తవ్రేత్తలకు మధ్య అవగాహన కలిగేలా విస్తరణ అధికారులు పనిచేయాలన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో యాంత్రీకరణ ప్రాధాన్యత పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలపై సిఫార్సు చేయాలన్నారు. ముఖ్యంగా వేరుశనగ, శనగ, కొర్ర పంటలు తక్కువ కాలంలో చేతికి వచ్చే నూతన వంగడాల ఆవిష్కరణలకు శాస్తవ్రేత్తలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాయలసీమ ప్రాంతంలో నీటి పొదుపుకు తీసుకోవాల్సిన చర్యలపై సిఫార్సు చేయాలన్నారు. పరిశోధనా స్థానాలలో, కెవికె, డాక్ సెంటర్లలో శాస్తవ్రేత్తలకు వౌళిక సదుపాయాలు కల్పించి తద్వారా రైతులకు శిక్షణ ఇవ్వాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ శాఖ సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలను రాబట్టాలన్నారు. ప్రస్తుతం విస్తరణాధికారులు గ్రామాలలో తిరగకుండా, రైతులకు దగ్గర కాకుండా దూరం పెంచుతున్నారని ఈవైఖరి మారాలన్నారు. రైతుకు ఏ పద్ధతిలో వ్యవసాయం చేస్తే లాభం వస్తుందో ఆ పద్ధతిని చేపట్టడానికి ప్రభుత్వం బాధ్యత వహించడంతో పాటు విస్తరణ అధికారి ద్వారా రైతుకు లాభదాయక పంటలు సాగుచేసే విధానాలను ప్రవేశపెట్టాలన్నారు. ముందస్తు వాతావరణ సూచనల ప్రకారం జిల్లా యూనిట్‌గా తీసుకుని రైతులకు మొబైల్ ఫోన్ ద్వారా ముందస్తు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతులకు శాస్తవ్రేత్తలు, అధికారులపై నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాల్సిన బాధ్యత శాస్తవ్రేత్తలు, విస్తరణాధికారులపై ఉందన్నారు. రాష్ట్రంలోని 67లక్షల మంది రైతులకు సంబంధించిన డాటాను ఇప్పటికే సేకరించారని, ఆ డాటా సమాచార నిధితో ముందస్తు వాతావరణ సూచనలు అందజేయాలన్నారు. రైతులకు వాతావరణ సూచనలు ముందుగా తెలిస్తే తమ పంటలను కాపాడుకొనే అవకాశం కలుగుతుందన్నారు. ఈసమావేశంలో 6ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానాలకు సంబంధించి ఔత్సాహిక రైతులు, శాస్తవ్రేత్తలు, విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో అల్పాహారం స్టాల్ ప్రారంభం
శ్రీశైలం, డిసెంబర్ 4:శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానం వారు రాయితీ ధరలతో కూడిన అల్పాహారాన్ని అందించేందుకు గౌరిసదన్ ప్రాంగణంలో అల్పాహార కౌంటర్‌ను ఆదివారం ఉదయం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్ గుప్త ప్రారంభించారు. ఈకౌంటర్ ప్రతిరోజు ఉదయం 6గంటల నుంచి తెరిచి ఉంచుతామన్నారు. ఇందులో ఇడ్లీ, ఉప్మా అందుబాటులో ఉంటుంది. రెండు ఇడ్లీలు రూ.4లు, 150గ్రా ఉప్మా రూ.4లుగా నిర్ణయించారు. ఈ అల్పాహార తయారీలో శుచి శుభ్రతతో పాటు నాణ్యతను పాటించేందుకు అన్నదాన భవన్‌లో తయారు చేయించి భక్తులకు అందిస్తున్నారు. ఈకార్యక్రమం వల్ల పెద్దనోట్ల రద్దుతో ఇబ్బంది పడే భక్తులకు సామాన్య, మధ్యతరగతి భక్తులు అధిక డబ్బులు వెచ్చించి హోటళ్ళల్లో తినలేరు కాబట్టి ఈకౌంటర్ల వద్ద భక్తులు అల్పాహారాన్ని భుజించి తక్కువ ఖర్చుతో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు సామాన్య భక్తులకు దేవస్థానం వారే మేలు చేసినట్లవుతుందని భక్తులు అంటున్నారు. ఈకార్యక్రమంలో ఇఓ భరత్‌గుప్త, అన్నదానం ఎఇఓ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

పుట్టాలమ్మకు ప్రత్యేక పూజలు
ఆళ్లగడ్డ,డిసెంబర్ 4:మండలంలోని శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో ఆదివారం పుట్టాలమ్మ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అమ్మవారికి సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన మహిళాభక్తులు చీరను వుంచి, పుట్టలో పాలు పోసి నైవేద్యాన్ని సమర్పించి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువు దీరిన శ్రీవల్లి, దేవసేన సహిత శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామిని, త్రేతాయుగంలో పరశురాముడు స్వయంగా ప్రతీష్ఠించిన పరశురామేశ్వరస్వామి, పార్వతీదేవి అమ్మవారిని, కొండపైన వెలసిన శ్రీ నరసింహస్వామి, లక్ష్మిదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామిని దర్శించుకునేందుకు వందలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయం ధ్వజస్తంభంవద్ద, అరుబయలులో మహిళలు దీపాలు వెలిగించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగుకుండా ఈఓ సుబ్బారెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు దేవస్ధానం ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కాశిరెడ్డినాయన 21వ ఆరాధన మహోత్సవాలు
అవుకు, డిసెంబర్ 4: అవధూత కాశిరెడ్డినాయన 21వ ఆరాధన మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కర్నూలు జిల్లా అవుకు మం డలం సీతారామపురం గ్రామంలోని అవధూత ఆశ్రమంలో మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ వ్య వస్థాపకులు గణపతి నాయన తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉద యం స్వామివారికి అ భిషేకం, అర్చనలు నిర్వహిస్తామన్నారు. ఆశ్రమంలో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నట్లు గణపతి నాయన తెలిపారు. రాత్రి ఏసుపుల్లయ్య ఆధ్వర్యంలో సాంస్కతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తుల సౌకర్యార్థం తాడిపత్రి ఆర్టీసీ డిపో వారు యాడికి నుంచి ప్రత్యేక బస్సు నడుపుతున్నారు.
కళాశాల అనుభవాలు మరుపురానివి
మహానంది, డిసెంబర్ 4:మహానంది వ్యవసాయ కళాశాలలో చదువుకున్న ప్రతి విద్యార్థి తన అనుభవాలు మరుపురానివన్నారు. మహానంది వ్య వసాయ కళాశాల 1991లో ప్రారంభించి నేటికి 25సంవత్సరాలు పూర్తికావడంతో సిల్వర్ జూబ్లి వేడుకలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈకళాశాలలో చదివిన విద్యార్థులు ఈకార్యక్రమంలో పాల్గొని తమ అనుభవాలను చర్చించుకున్నారు. ఈకళాశాలలో దా దాపు 200మంది పూర్వ విద్యార్థులు కలియ తిరుగుతూ స్నేహితులను ఆప్యాయతగా పలకరించుకుంటూ అప్పటి తమ అనుభవాలను నెమరువేసుకున్నారు. ఆదివారం సాయంత్రం కళాశాల ఆవరణంలో విద్యార్థుల సమ్మేళన సమావేశాన్ని డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ రమేశ్‌బాబు, అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురువయ్యల అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా తమ పూర్వ వైభవాలను కళాశాల, కళాశాల అనుభవాలను, వారి కష్టాలను తెలియజేశారు. 1991సంవత్సరం బ్యాచ్ అనిల్ కంటతడిపెడుతూ తాము ఎలా చదివింది, ఇప్పుడు తాను సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు. మహానంది వ్యవసాయ కళాశాల నుంచి మొట్టమొదటి యూనివర్శిటీ గోల్డ్‌మెడలిస్టుగా తనకే దక్కిందని ఆనందం వె లిబుచ్చారు. వ్యవసాయంలో మొదటి రూపాయి చివరి రూపాయి రైతుకే దక్కుతుందని, రైతు భవిష్యత్తులో ఉంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సంతోషంగా ఉంటేనే అందరమూ సంతోషంగా ఉంటామని, విత్తనోత్పత్తిలో ఉద్యమం రావాలన్నారు. వ్యవసాయం బాగుపడకుంటే ఎన్ని పరిశోధనలు చేసినా వ్యర్థమే అన్నారు. విద్య విత్తనంలో రైతులకు కృషి చేయాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. మిగతా విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల ప్రారంభంలో ఇక్కడ ఎటువంటి వసతులు లేవని కేవ లం కళాశాల భవనం మాత్రమే ఉం దని వర్షాకాలం వస్తే ఇక్కడ పాలేరువంక పొంగి పొర్లేదన్నారు. ఈవాగు నుంచి అడవి నుంచి పాములు, జం తువులు వచ్చేవన్నారు. భయభ్రాంతులతోనే చదువుకున్నామని ఆకష్ట్ఫలితమే నేడు మంచి ఉద్యోగాలు తెచ్చిపెట్టాయన్నారు. సరైన విద్యుత్ వసతి కూడా లేకపోవడంతో బుక్కాపురం సబ్‌స్టేషన్‌కు వెళ్లి అక్కడి విద్యుత్ కాంతుల్లో చదువుకునే వారమని దా యాదుల పోరైన ఇండియా, పాకిస్తాన్‌కు క్రికెట్ ఆడితే మహానందికి వెళ్లి అక్కడి ఒక హోటల్‌లో వీక్షించి ఆనందపడే వారమన్నారు. ఇక్కడ కేవలం దూరదర్శన్ మాత్రమే వచ్చేదని, ఎలాంటి ఫోన్ సౌకర్యం లేక ఇబ్బందులు పడేవామన్నారు. నేడు ఈకళాశాల వాతావరణాన్ని చూస్తే ఆనందదాయకంగా ఉందని, అన్ని వసతుల కల్పనతో పాటు అత్యాధునిక పరికరాలతో ల్యాబ్‌లు ఉండడం ఆనందించదగ్గ విషయమన్నారు. అనంతరం కళాశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేసి సాంస్కృతిక ప్రదర్శనలతో ఆనంద డోళికలతో చిందులు వేస్తూ సంబరాలను జరుపుకున్నారు. ః

పంది దాడిలో చిన్నారికి గాయాలు
ఆదోనిటౌన్,డిసెంబర్ 4:పట్టణంలోని నారాయణ గుంత ప్రాంతంలో ఆడుకుంటున్న మూడు సంవత్సరాల చిన్నారి రమణను అక్కడే ఉన్న పంది పిల్లవాడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కాలనీకి చెందిన శంకర్ కుమారుడు రమణ తోటి చిన్నారులతో కలిసి బయట ఆడుకుంటుండగా పంది ఆకస్మత్తుగా దాడి చేసి ముఖంపై, నడుముకింద దాడి చేసింది. తీవ్రంగా గాయపరిచింది. వెంటనే చికిత్స నిమ్తితం ఏరియా ఆసుపత్రికి తరలించగా పంది కాటుకు గురైన వారికి ఇచ్చే ఇంజన్లు తమ వద్ద లేవని మెరుగైన చికిత్స కోసం కర్నూలకు తరలించాలని వైద్యులు సూచించారు. ఆదోని పట్టణంలో పందులు భారీ సంఖ్యలో ఉన్నాయని వాటిని అదుపు చేయాలని ఎన్నిసార్లు కోరిన పట్టించుకోవడం లేదని ఆయా కాలనీవాసులు పేర్కొన్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోని పందులను పట్టణ శివారులకు తరలించాలని కోరారు.
తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు
ఆదోనిటౌన్,డిసెంబర్ 4:చిప్పగిరి మండలం బెల్డోణ గ్రామానికి చెందిన భీమలింగప్ప హత్య కేసులో తనయుడు ఉరుకుందును అరెస్టు చేసినట్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం డిఎస్పీ బంగ్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ క్షణికావేశంతో ఈసంఘటన జరిగిందని అన్నారు. మద్యం సేవించి ప్రతి రోజు తన తల్లిని వేదిస్తున్న తండ్రి భీమలింగప్పను వారించే ప్రయత్నంలో ఈ హత్య జరిగిందని నిందితులు పేర్కొన్నారు. ఆలూరు సిఐ శంకరయ్య, చిప్పగిరి ఎస్‌ఐలు పేర్కొన్నారు.

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోనిటౌన్, డిసెంబర్ 4:ఆదోని పట్టణానికి చెందిన విజయభాస్కర్‌రెడ్డి నగర్ నివాసి కె.ఎస్‌పాల్ అనే యువకుడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఫకృద్ధీన్ ఆదివారం పేర్కొన్నారు. గుత్తిలో జరిగే ప్రార్థలనకు వెళ్ళుతున్నట్లు ఇంట్లో చెప్పి వెళ్ళిన కెఎస్‌పాల్ రైలు ప్రమాదంలో మృతి చెందాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని తండ్రి సామేల్ గుర్తించడం జరిగందన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.