కర్నూల్

నేతల వౌనముద్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 5:కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో జిల్లాలో క్రమేణా నేతలు వౌనం దాలుస్తున్నారు. నిత్యం ఏదో ఒక ఆరోపణ, ప్రత్యారోపణతో మీడియాలో దర్శనమివ్వాలని తపించే నేతలు ఇపుడు ఎక్కడ ఉన్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రతి రోజు మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేసే నాయకులు ఇపుడు మీడియాకు దూరంగా ఉంటున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నల్ల ధన ప్రకటన, అధికార బంగారు వివరాల వెల్లడికి ప్రభుత్వం అవకాశమివ్వడంతో ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కొందరు, బంగారు వివరాలను వెల్లడించేందుకు మరి కొందరు తమ ఆడిటర్లతో బిజీగా మంతనాలు నిర్వహిస్తున్నారని ఆయా పార్టీల కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. నల్ల ధనం, బంగారం లేని వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించి నాయకుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొనడం ఎందుకని వౌనం వహించినట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టిడిపి, వైకాపాలకు చెందిన అనేక మంది నేతలు సుమారు 20 రోజులుగా గళం విప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడినా నోట్ల రద్దు, నల్ల ధనం విషయంలో మాత్రం ఆచితూచి స్పందించారు. జిల్లాలో ఉన్న రాజకీయ నేతలు 95శాతం మందికి పైగా కోటీశ్వరులు, భారీ వ్యాపారులు ఉన్నారని ప్రజలంటున్నారు. వీరిలో అత్యధికుల వద్ద నల్ల ధనం, బంగారు పెద్ద ఎత్తున ఉంటుందని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారై ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి నల్ల ధనవంతులు నిమగ్నమై ఉంటారని ప్రజలంటున్నారు. ఈ కారణంగానే వారు ప్రజల్లోకి రావడానికి సమయం లభించి ఉండదని పేర్కొంటున్నారు. టిడిపి జన చైతన్యయాత్రలు, గడప గడపకు వైకాపా పేరుతో చేపట్టిన కార్యక్రమాలు తాత్కాలికంగా నిలిపి వేశారు. నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సమయం కేటాయించకపోవడం వల్లే తాత్కాలికంగా వాయిదా వేశామని ఆయా పార్టీల నేతలు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరువాత ఏర్పడిన పరిణామాల దృష్ట్యా ప్రజలు బ్యాంకుల ముందు బారులుతీరారని ఈ సమయంలో తాము వారి వద్దకు ఎలా వెళ్లగలమని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. నల్ల ధనవంతుల్లో గుబులు ఉంటుందని నిత్యం తాము ప్రజల మధ్యలో ఉండే తమకు ఆ భయంలేదని వెల్లడిస్తున్నారు. తమ వద్ద ఉన్నదంతా తెల్ల ధనమేనని వాటికి లెక్కలు ఉన్నాయని చెబుతుండటం విశేషం.
రైతు ఆదాయం రెట్టింపు కావాలి
నంద్యాల, డిసెంబర్ 5:దేశ జనాభాకు సరిపడ ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండించాలన్నా, రాబోవు ఆరేడు సంవత్సరాలలో రైతు ఆదాయం ఏవిధంగా రెట్టింపు చేయగలమో, దానికి కావాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని 46వ రాష్టస్థ్రాయి పరిశోధనా, విస్తరణ మండలి సమావేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డా. ఎన్‌వి నాయుడు అన్నారు. సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో నిర్వహించిన పరిశోధనా విస్తరణ మండలి సమావేశం రెండవ రోజున వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు, శాస్తవ్రేత్తలు భూసారాన్ని ఎలా కాపాడుకోవాలి, భవిష్యతరాలకు భూమిని ఎలా అప్పగించాలి, జనాభకు తగిన రీతిలో ఆహార ధాన్యాలను ఎలా ఉత్పత్తి చేయాలి, ఉత్పత్తిని ఎలా పెంచాలి, రైతు ఆదాయాన్ని ఏవిధంగా రెట్టింపు చేయగలరో వివరించారు. ఈ సమావేశంలో విశ్రాంత విస్తరణ సంచాకులు డా. ఆలపాటి సత్యనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ పప్పు దినుసుల సంవత్సరం 2016గా నిర్ణయించారని, పప్పు దినుసుల సాగులో పరిశోధనలు ఏదిశలో సాగించాలో, వరి ఆధారిత పప్పు దినుసుల సాగును ఏవిధంగా ప్రోత్సహించాలో కూలంకశంగా వివరించారు. అనంతరం వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి డా.పద్మరాజు మాట్లాడుతూ రైతు ఆదాయాన్ని పెంచే విధంగా వ్యవసాయ పరిశోదనలు సృజనాత్మకతతో ముందుకు పోవాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ డీన్ డా.రాఘవులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నీరు చాలా విలువైనదని, వ్యవసాయంలో రైతులు నీటి ప్రాధాన్యతను గుర్తించాలని, అందుకు తగిన విధంగా శాస్తవ్రేత్తలు కూడా నీటి యాజమాన్య పద్దతులను రైతులకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి ఎస్ ఎస్ డిసి ఎండి బాలకృష్ణ మాట్లాడుతూ విత్తన ఉత్పత్తిలో బ్రీడర్, ఫౌండేషన్ సీడ్ చైన్ సరైన క్రమంలో నిర్వహించాలని కోరారు. వరిలో విత్తనం కొరకు పండించే రైతులకు మేలైన యంత్ర పరికరాలను అభివృద్ధి చేయాలని, తద్వారా నాణ్యమైన విత్తనాలు పొందవచ్చన్నారు. విత్తనం నిల్వ ఉంచే పరికరాలపై పరిశోధనలు చేయాలని అన్నారు. రెఫరల్ సర్ట్ఫికేషన్ ల్యాబ్ దక్షణ భారతదేశంలోని మన రాష్ట్రంలో నెలకొల్పేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డా.రాజారెడ్డి, స్పెషల్ ఆఫీసర్ డా.గిరిదర్ కృష్ణ, డా.వీరభద్రారావు, డా.రత్నప్రసాద్, పాలక మండలి సభ్యులు మేక లక్ష్మినారాయణ, దామోదర నాయుడు, గణపతి రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఇ-బ్యాంకింగ్‌ను వినియోగంలోకి తేవాలి
కర్నూలు, డిసెంబర్ 5:ప్రతి అధికారి డిజిటల్ నగదుకు మార్పు చెంది కిందిస్థాయి సిబ్బందిని మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు అలవాటు చేసి తప్పని సరిగా వినియోగంలోకి తీసుకరావాలని కలెక్టర్ విజయమోహన్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సహిస్తూ ప్రతి అధికారి తాను డివిజన్ కరెన్సీకి మార్పు చెంది క్రిందిస్థాయి సిబ్బంది, తన పరిధిలోని స్టేక్‌హోల్టర్స్‌ను మొబైల్, ఇంటర్నెట్ బ్యాంగింగ్‌కు మార్పు చెందేలా శిక్షణ నివ్వాలన్నారు. చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్‌ను వినియోగించుకుని సమయంతో నిమిత్తం లేకుండ ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వ్యాలెట్ ద్వారా అవతలి వారికి డబ్బులు పంపుకోవచ్చని, తీసుకోవచ్చన్నారు. కాన్పరెన్స్ హాలులో సమావేశం జరుగుతుండగానే కలెక్టర్ తన స్మార్ట్ఫోన్ నుండి ఎస్‌బిఐ బుడ్డీ ద్వారా జిల్లా పరిషత్ సిఇఓకు క్షణాల్లో రూ.100 పంపి ప్రాక్టికల్‌గా నిర్దారించారు. అలాగే జాయింట్ కలెక్టరట్ హరికిరణ్, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్‌లు వ్యాలెట్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు రూ.100 పంపి నిరూపించారు. వచ్చే వారంలోగా ప్రతి ఒక్కరు అధికారిని ప్రాక్టికల్‌గా పరీక్షిస్తానని అందరూ సిద్దంగా ఉండటంతో పాటు కింద స్థాయి సిబ్బందికి, తన పరిధిలోని చివరి స్థాయి సిబ్బంది వరకు మార్పు చెందాలన్నారు. ముందు తమ మారి ఇతరుల మార్పుకు సమాయత్తమై ప్రజల్లోకి ఉద్యమంగా తీసుకెళ్లాన్నారు. జిల్లాలో 40 లక్షల మందికి బ్యాంకుల్లో ఖాతాలున్నాయని ప్రతి ఒక్కరిని నగదు రహిత లావాదేవీలకు అలవాట చేయాలన్నారు. ప్రతి షాపుకు ఈ పాస్ యంత్రాన్ని తప్పని సరి చేస్తున్నామని ఇందకు కమర్షియల్ ట్యాక్స్, కార్మికశాఖ, వ్యవసాయ, మునిసిపల్ అధికారులు ప్రత్యేక వ్రద్ద తీసుకొని దరఖాస్తులు రాబట్టాలన్నారు. ప్రతిశాఖలో ఆర్థిక ప్రయోజనం పొందుతున్న లబ్దిదారలందరికి వ్యాలెట్ ద్వారా మనీ ట్రాన్స్‌క్షన్ అలవాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆర్‌టిసిలో దూరపు ప్రాంతాలకు వెళ్లే బస్సులకు ఈపాస్ యంత్రాల ఏర్పాటుకు దరఖాస్తులు ఇవ్వాని ఆర్‌టిసి ఆర్‌యంలను ఆదేశించారు. మండల స్థాయిలో నోడల్ అధికారి ప్రతి బ్యాంక్ బ్రాంచికి అధికారి నియమించి ప్రజలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించడంతోపాటు ఖాతాలు ప్రారంభించంలో బ్యాంకర్లకు సహకరించాలన్నారు. మంగళవారం నుండి సిబ్బంది అందరూ క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి ఖాతాలు లేని వారికి ఖాతాలు ప్రారంభించడం, రూపే కార్డులు యాక్టివేట్ చేయించడం, మోబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగుకు అలవాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అదికారి కింది స్థాయి సిబ్బంది వరకు మొబైల్ నెంబర్లతో సహా విరాలను బుధవారంలోగా అందచేయ్యాలన్నారు. యంపి ల్యాండ్స్, నియోజకఅభివృద్ధి నిధులు, ప్రత్యేక అభివృద్ధికి ప్యాకేజి, ఇతర అభివృద్ధి నిధుల ఇంట్రెస్ట్ఫ్‌ండ్ ఇవరాలను సోమవారంలోగా కలెక్టరేట్ పంపాలన్నారు. ఇలాగే వివిధ పథకాల కింద బ్యాంకులో జమ చేసిన మొత్తాలను కూడ వెల్లడించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని శాఖలకు కేటాయించిన మొత్తాల జాబితాను సిద్దం చేసి అధికారులందరికి పంపాలని కలెక్టర్ డిఆర్‌ఓను ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి హరికిరణ్, 2వ జెసి రామస్వామి, డిఆర్‌ఓ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.