కర్నూల్

హోంగార్డుల సేవలు అమోఘం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 6: హోంగార్డుల సేవలు అమోఘమని ఎస్పీ రవికృష్ణ కొనియాడారు. హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని నగరంలోని పోలీసు పరేడ్ మైదానంలో మంగళవారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసుశాఖలో చేరినప్పటి నుంచి హోంగార్డుల కుటుంబాను చాలా దగ్గర నుంచి చూశామన్నారు. చాలా తక్కువ జీతంతో కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. హోంగార్డుల సమస్యలను అవకాశం ఉన్న ప్రతి చోట పై అధికారులకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. హోంగార్డులు పోలీసు వ్యవస్థలో దాదాపు 30 ఏళ్లు పని చేసి రిటైర్డ్ అవుతున్నా వారికి ఎలాంటి నగదు బెనిఫిట్స్ లేకపోవడం బాధాకరమన్నారు. హోంగార్డు కుటుంబాలు పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు. ఇక బందోబస్తులకు వెళ్లిన సమయంలో హోంగార్డుల టిఏ, డిఏ అలవెన్సు సమస్యల గురించి హోంగార్డు కుమాండెంట్ ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో హోంగార్డు సదరన్ రీజియన్ కమాండెంట్ చంద్రవౌళి, డీఎస్పీలు బాబుప్రసాద్, కృష్ణమోహన్, ఆర్‌ఐ రంగముని, ఆర్‌ఎస్‌ఐ రంగనాథబాబు, రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, అసోసియేషన్ అధ్యక్షుడు విజయరత్నం, కోశాధికారి మహమ్మద్ రఫీ, సభ్యులు రాజేష్, రఘు, సురేష్, బాలకృష్ణ, రామయ్య, మునిస్వామి, నాగవేణి పాల్గొన్నారు.