కర్నూల్

నల్లమలలో కూంబింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగలమర్రి, ఏప్రిల్ 22: నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలకై పోలీసులు కూంబింగ్ ప్రారంభించారు. జిల్లా టాస్క్ఫోర్స్ డీఎస్పీ దేవదానం ఆధ్వర్యంలో ఈ కూంబింగ్ శుక్రవారం జరిగింది. మండలంలోని చిన్నవంగలి రేకుల వంతెన నుండి అహోబిలం వరకు నల్లమల అటవిలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహించినట్లు డిఎస్పీ తెలిపారు. టాస్క్ఫోర్స్ పోలీసులు, స్పెషల్ పోలీసులు ఈ కూంబింగ్‌లో పాల్గొన్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా అరికట్టే వరకు కూంబింగ్ కొనసాగిస్తామన్నారు. నల్లమలలో తమిళ ఎర్రచందనం కూలీలకై తీవ్రంగా గాలిస్తున్నామని ఆయన వివరించారు.

ఎండిన రాజులకాలం నాటి బావి
చాగలమర్రి, ఏప్రిల్ 22: భూగర్భ జలాలు ఇంకిపోవడం, ఎండలు తీవ్రంగా ఉండడంతో ఎన్నడూ ఎండిపోని బావులు కూడా ప్రస్తుతం ఎండిపోతున్నాయి. మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో రాజులకాలం నాటి బావి కూడా చుక్కనీరు లేకుండ ఎండిపోయింది. గత 20 సంవత్సరాల నుంచి ఈ బావి ఎండిపోలేదని గ్రామస్థులు తెలిపారు. విచ్చల విడిగా బోర్లు వేయడంతో భూ గర్భ జలాలు ఇంకిపోయి ఈ బావి ఎండిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామమంతటికి రాజులకాలం నాటి బావి దాహం తీర్చేది. కాని ఆనాటి బావి ఎండిపోవడంతో గ్రామస్థులకు మంచినీటి సమస్య తప్పడం లేదు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఆలూరు, ఏప్రిల్ 22: మండల పరిధిలోని కురవల్లి గ్రామ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హరిజన వెంకటేష్ (23), హరిజన మల్లయ్య (58) ఇద్దరు కలిసి శుక్రవారం ద్విచక్రవాహనంపై వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆలూరు పట్టణానికి వచ్చారు. పెళ్లి వేడుక అయిపోగానే తిరిగి వెళ్తుండగా కురవల్లి గ్రామం దాటగానే మలుపు వద్ద మంత్రాలయం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఈ ఘటనలో మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా వెనుక నుంచి వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వెంకటేష్ మీదుగా వెళ్లడంతో అతను కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ ధనుంజయ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగా హరిజన వెంకటేష్‌ది కర్నాటకలోని కంప్లి గ్రామం అని, హరిజన మల్లయ్యది కమ్మరచేడు గ్రామం అని పోలీసులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.