కర్నూల్

ప్రజా సమస్యల పరిష్కారంలో మోదీ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 6:ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రధా ని నరేంద్రమోదీ ఘోరంగా విఫలం చెందారని ఏపి వ్యవసాయ కార్మిక సంఘం(వ్య.కా.స) రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల శేఖర్ విమర్శించారు. ముఖ్యంగా పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యులను వేధించటం తగదన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు మంచి రోజులు వస్తాయని నమ్మించి అధికారంలోకి వచ్చిన మోదీ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. ప్రధానంగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకు దేశ వ్యాప్తంగా దళితులు, గిరిజనులు, మైనార్టీలపై పెద్దఎత్తున భౌతిక దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చివరకు వారు తినే తిండి, ఆచార సంప్రదాయ, సంస్కృతులను కించపరుస్తూ భయానక వాతావరణం సృష్టించి అభద్రతాభావాన్ని పెంచి పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనాన్ని నెల రోజుల్లో వెలికితీసి విదేశాల నుంచి రప్పిస్తానన్న మోదీ పెద్దనోట్లు రద్దు చేయడంతో సాధారణ మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇక బడా కార్పొరేట్ వ్యాపారులకు వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేసి అన్ని రకాల రాయితీలను ఇచ్చి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను అమలు చేయకుండా ప్రతిభ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టిస్తూ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సిఎం చంద్రబాబు మోదీకి వంతపాడుతూ వౌనం పాటిస్తూ ఆయన విధానాలను అమలు పరుస్తున్నారని దుయ్యబట్టారు. ఇకనైనా మోదీ, చంద్రబాబు తమ వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ఆయా ప్రభుత్వాల పతనం తప్పదని హెచ్చరించారు. ధర్నాలో ఏపి వ్య.కా.స రాష్ట్ర కార్యదర్శి భీమలింగప్ప, ఏపి గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పి.గోవిందు, సిపిఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెనిన్‌బాబు, ఏపి వ్య.కా.స జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి శెట్టి, రాధాకృష్ణ, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రంగనాయుడు, సహాయ కార్యదర్శి మునెప్ప పాల్గొన్నారు.