కర్నూల్

రూ. 879 కోట్లతో చెరువులకు నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తికొండ,డిసెంబర్ 6:పత్తికొండ నియోజకవర్గంలో ఉన్న 106 చెరువులకు నీళ్లు నింపడానికి రూ. 879 కోట్ల తో ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి స్పష్టం చేశారు. పత్తికొండలో మంగళవారం అధికారులు, పార్టీ కా ర్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులలో అందరు కలిసి పని చేయాలని కోరారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో అనేక మార్పులు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఈపాస్ పుస్తకాలు కూడా అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గం ఇన్‌ఛార్జి కెయి శ్యాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివారెడ్డి, నాయకులు జయ్యన్న, ఎంపిపిలు గురుస్వామి, లక్ష్మీ, జడ్పీటిసి సభ్యులు పురుషోత్తంచౌదరి, అశోక్‌కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరాముడు, నాయకులు శ్రీరాములు, వెంకటేశ్వర్లు, విజయమోహన్‌రెడ్డి, ధనంజయగౌడ్, లేలీన్‌బాబు, ఉచ్చిరప్ప, లోక్‌నాథ్, తిప్పప్ప, ఈశ్వరప్ప, రంగన్నతోపాటు జిల్లాలోని ప్రభుత్వ అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
* మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు
మంత్రాలయం,డిసెంబర్ 6:పరిసర ప్రాంతాలలో వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మఠం పీఠాధి పతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు పేర్కొన్నారు. మంగళవారం మంత్రాలయం మఠం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో స్వచ్ఛ్భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మఠం అధికారులుతో సహ కర్ణాటకలోని బళ్ళారికు చెందిన దాదాపు 500మంది భక్తులతో స్వచ్ఛ్భారత్ అభియాన్ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా పీఠాధిపతి శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ప్రాకారంలోని వెండి, కొయ్య రథాలను, యోగీంద్ర కళామండపాలలోని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం కర్ణాటక భక్తులు గ్రామంలోని బస్టాండు, తదితర పురవీధులలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలను చేపట్టారు. కార్యమ్రంలో మఠం మేనేజర్ శ్రీనివసరావు, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి, శ్రీపతాచార్, తదితర మఠం అధికారులు పాల్గొన్నారు.