కర్నూల్

కాల్షియం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, డిసెంబర్ 6:కాయలను మాగపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు, కడప జిల్లాల జోనల్ ఫుడ్ కంట్రోలర్ శ్రీనాథ్‌రెడ్డి వ్యాపారులను హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం స్థానిక సి.క్యాంప్ సెంటర్‌లో ఉన్న పండ్ల దుకాణాలపై ఆయన దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్లను మాగపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడితే ప్రజల ఆరోగ్యాలకు హాని జరుగుతుందన్నారు. అంతేకాకుండా పండ్లు ఆకర్శణీయంగా కనపడటానికి ఇలాంటి రసాయనాలను వాడుతున్నారని, ప్రజలు వాటినే కొనుగోలు చేసి రోగాల బారిన పడుతున్నారని వెల్లడించారు. ఏ వ్యాపారి అయినా పండ్లను మాగపెట్టడానికి కాల్షియం కార్బైడ్ వాడటం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే కొన్ని పండ్లను తీసుకుని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపుతామని వాటిలో రసాయనాలు వాడినట్లు రుజువైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయనతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కళ్యాణచక్రవర్తి, జిల్లా ఫుడ్ ఇన్స్‌పెక్టర్ శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.
8 నుంచి పోలీసు కానిస్టేబుళ్ల
దేహదారుఢ్య పరీక్షలు
* 12న మహిళలకు.. : ఎస్పీ రవికృష్ణ
కర్నూలు, డిసెంబర్ 6: పోలీసు కానిస్టేబుల్ నియామకాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఈ నెల 8 నుంచి 20వ తేదీ వరకూ నగరంలోని ఏపిఎస్పీ 2వ బెటాలియన్ మైదానంలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ రవికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 5 నుంచి సాయంత్రం 4గంటల వరకూ అభ్యర్థులకు క్రీడా మైదానంలో ఈవెంట్స్ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 12వ తేదీ మహిళలు హాజరుకావాలన్నారు. కర్నూలు జిల్లా నుంచి మొత్తం 11,762 మంది అభ్యర్థులు ఈ దేహాదారుఢ్య పరీక్షలకు హాజరవుతున్నారని ఎస్పీ తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు కేటాయించిన సమయంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈవెంట్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. అలాగే ఒరిజినల్ సర్ట్ఫికెట్లు, ఒకసెట్ జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించుకుని రావాలన్నారు. వీటితో పాటు క్రిమిలేయర్ సర్ట్ఫికెట్ తీసుకురావాలన్నారు.