కర్నూల్

కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 6:పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన కరెన్సీ కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ మొద టి వారం కావడంతో తెల్లవారుజాము నుంచే ప్రజలు ఏటిఎం కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ఏటిఎంలో పెట్టిన డబ్బులు గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారు. బ్యాంకు ల్లో ఖాతాదారులకు రూ. 10వేలు మాత్రమే డ్రా చేసుకోవాలని మేనేజర్లు చెప్పడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. రూ. 10వేలలో ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కూరగాయలు, పాలు, ఇతరాత్ర ఖర్చులు ఎలా సర్దుకోవాలని ప్రజలు వాపోతున్నారు. అది కూడా బ్యాంకుల్లో రూ. 2వేల పెద్ద నోట్లు ఇవ్వడంతో మార్కెట్‌లో చిల్ల దొరక్క మళ్లీ నానా అవస్థలు పడాల్సి వస్తుందని వాపోతున్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం గత నెల 8వ తేదీ రాత్రి రూ. 500, రూ. 1000 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. వీటి స్థానంలో కొత్త రూ. 500, రూ. 2000 నోట్లను చెలామణిలోకి తెచ్చినప్పటికీ డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ప్రజలు అస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం డిజిటల్ పేమెంట్లకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వ శాఖల్లో ఖచ్చితంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మార్కెట్‌లో రూ. 500, రూ. 1000 పెద్ద నోట్లు చెలామణిలో లేకుండా కేవ లం ఖాతాదారులు బ్యాంకుల్లో జమ చేసుకోవాలని, డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు ఇవ్వడంతో నల్లకుబేరుల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నా యి. పాతనోట్లు ఇవ్వాలన్నా.. కొత్త నోట్లు ఇవ్వాలన్నా దాదాపు 30శాతం పర్సెంటేజీలు తీసుకుంటూ పలువురు కమీషన్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. ఇంకా 25 రోజులే వ్యవధి ఉండటంతో మార్కెట్‌లో హడావిడి మరింత ఎక్కువ అవుతోంది. కర్నూలు జిల్లాలో కొత్త రూ. 500 నోటు మార్కెట్‌లోకి వచ్చినట్లు వచ్చి మాయం కావడంతో ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. గత నెల 8వ తేదీ నుంచి పాత పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. 2017 జనవరిలో కొత్త, పాత కరెన్సీ కష్టాలు కొంత తీరవచ్చునని ప్రజలు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.