కర్నూల్

ఇక ‘మీ సేవ’లో స్వైపింగ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 6: నగదు రహిత లావాదేవీలను ఖచ్చితంగా నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడటంతో ప్రభుత్వం మీ సేవా కేంద్రాల్లో కూడా స్వైపింగ్ యంత్రాలను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని పేర్కొంది. ప్రతి మీ సేవా కేంద్రం నిర్వాహకుడు తమ బ్యాంకుకు వెళ్లి స్వైపింగ్ యంత్రం తీసుకోవాలని సూచించింది. బ్యాంకుల నుంచి ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సంబంధిత అధికారులను కలిసి వివరించాలని ప్రభుత్వం ఆదేశాల్లో వెల్లడించింది. మొదట పట్టణ ప్రాంతాల్లోని అన్ని మీ సేవా కేంద్రాల్లో స్వైపింగ్ యంత్రాలు తప్పనసరిగా ఏర్పాటు చేయాలని గ్రామీణ ప్రాంతాల్లో కాస్త సమయం ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు వెల్లడవుతోంది. ఆదేశాలు పాటించని మీ సేవా నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని అధికారులకు ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పటికే మీ సేవా కేంద్రాలకు పంపామని అధికారులు వెల్లడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే ఆర్టీసీ రిజర్వేషన్ కౌంటర్లు, రేషన్ దుకాణాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలతో పాటు పలు చోట్ల నగదు రహిత సేవలను తప్పనిసరి చేయగా మరో వైపు పింఛన్ల పంపిణీ, ఉపాధి కూలీలకు చెల్లింపులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తోంది. బ్యాంకు ఖాతా లేని వారికి ఖాతా తెరిపించి ఎటిఎం కార్డులు ఇచ్చేలా చూడాలని అధికారులను సూచించిన విషయం విదితమే. కేవలం నడవ లేని వృద్ధులు, వికలాంగులకు మాత్రమే నగదు పంపిణీ చేయాలని పేర్కొంది. నగదు రహిత సేవలకు ప్రాధాన్యం పెంచిన ప్రభుత్వం తాజాగా మీ సేవలో కూడా స్వైపింగ్ యంత్రాలు తప్పనిసరి చేసింది. కాగా రానున్న కొద్ది రోజుల్లో అన్ని శాఖల్లో నగదు రహిత సేవలను తప్పనిసరి చేసేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. మద్యం దుకాణాలు, వ్యాపార సంస్థల్లో కూడా నగదు రహిత సేవల అమలును వేగవంతం చేయాలని వాణిజ్య పన్నుల శాఖ అధికారులను ఆదేశించింది. అంతేగాక రూ. 5వేలకు మించిన చెల్లింపులు, వసూళ్లు ఖచ్చితంగా బ్యాంకుల ద్వారానే జరుగాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.