కర్నూల్

ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా బాబు పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలుసిటీ, డిసెంబర్ 9:గత కాంగ్రెస్ పదేళ్ల పాలనలో పతనమైన ప్రజారోగ్య వ్యవస్థను పట్టాలెక్కించి ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించటమే లక్ష్యంగా సిఎం చంద్రబాబు పాలన కొనసాగిస్తున్నారని టిడిపి జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమిశెట్టి శుక్రవారం తన ఛాంబర్‌లో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్ చంద్రబాబు ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శలు చేయడం తగదన్నారు. తన తండ్రి వైఎస్ హయాంలో ప్రజారోగ్యాన్ని వ్యాపారంగా మార్చి కార్పొరేట్ ఆసుపత్రులకు కొమ్ముకాసి ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో అమలు చేసిన ప్రాణదానం పథకాన్ని పేరు మార్చి వైఎస్ 2007 మార్చిలో ఆరోగ్యశ్రీగా పేరు పెట్టారని విమర్శించారు. ఆ సమయంలో వైఎస్ 23 జిల్లాలకు కలిపి రూ. 1,361 కోట్లు ఖర్చు చేస్తే, సిఎం చంద్రబాబు ఆ పథకాన్ని ఎన్‌టిఆర్ వైద్య సేవ అని మార్చి అనతి కాలంలోనే 13 జిల్లాల్లో రూ. 1,861 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. వైఎస్ హయాంలో రోగులు కార్పొరేట్ ఆసుపత్రులు వెళ్తే అవసరం లేకపోయినా ఆపరేషన్లు చేసి సొమ్ము చేసుకున్న సంఘటనలు కోకొల్లలు అన్నారు. అలాగే అప్పుడు టెండర్లతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ సేవలను ఒక కంపెనీకి మాత్రమే అప్పజెప్పి కోట్లు దండుకున్నారని దుయ్యబట్టారు. ఆయా సంఘటనలపై ప్రతిపక్ష పార్టీలు గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశాయని గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం ఎలాంటి పరీక్షలకైనా ఫీజలు చెల్లించే అవసరం లేదని, అయితే పరీక్షల పేరుతో రకరకాలుగా డబ్బులు దండుకున్నారని, ప్రస్తుతం 63 పరీక్షలను ఉచితంగా చేయిస్తున్నామన్నారు. గతంలో 938 వ్యాధులకు మాత్రమే ఆరోగ్యశ్రీ ఉంటే, నేడు 1044 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామన్నారు. వైఎస్ హయాంలో ఆరోగ్యశ్రీ కింద రూ. 2లక్షల వరకూ పరిమితి ఉండేదని, ప్రస్తుతం రూ. 2.5 లక్షలకు పెంచామని, ఇప్పటికే దాదాపు 4 కోట్ల మంది ఎన్‌టి ఆర్ వైద్య సేవా పథకం కింద ప్రయోజం పొందారని వివరించారు. ముఖ్యంగా నాడు ప్రజారోగ్యానికి 2శాతం నిధులు కేటాయించగా ప్రస్తుతం 5శాతం కేటాయించామన్నారు. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తూ అభివృద్ధి పనులకు అడ్డుపడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చేస్తున్నాడని మండిపడ్డారు. ఇకనైనా జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేయటం మానుకుని రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని అప్పుడే ప్రజలు హర్షిస్తారని హితవు పలికారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్, నాయకులు మహేష్‌గౌడ్, నాగేంద్ర, రవికుమార్‌చౌదరి, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలి
* వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంప్రసాద్
కర్నూలు, డిసెంబర్ 9:ప్రపంచంలో ప్రతి వంద మందిలో 3 నుంచి 10 మంది వరకూ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని, ఈ తరుణంలో క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. రాంప్రసాద్ సూచించారు. సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని వృక్షశాస్త్ర విభాగంలో శుక్రవారం ‘క్యాన్సర్-బయాలజీ’ అంశంపై జాతీయ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ మనిషిని 3 రకాలుగా వేధిస్తుందని, వాటి గురించి వివరించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వం క్యాన్సర్ ఆసుపత్రిని మంజూరు చేసిందని తెలిపారు. కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివిన విద్యార్థులు దేశంలో ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్టులుగా రాణిస్తున్నారన్నారు. అనంతరం శాస్తవ్రేత్త డా. శ్రీ్ధరరావు రచించిన క్యాన్సర్ పరిశోధన పత్రాల సంపుటిని ఆవిష్కరించారు. సెమినార్‌లో ఫింగర్ ప్రింట్ స్పెషలిస్టు డా. మురళీధరన్‌భాస్యం, సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్లు బ్రహ్మానందం, డా. నరేష్, సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. అబ్దుల్‌ఖాధర్, సెమినార్ కార్యవర్గ కార్యదర్శి డా. జాన్సన్ సాటురస్, డా. మైఖేల్‌డేవిడ్, విజయకుమార్, వెంకట్వేరరావు, మాధవీలత, ఉమాదేవి, లలితకుమారి, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.