కర్నూల్

నల్లకుబేరులపై ఐటి శాఖ దాడులకు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 12:రద్దు చేసిన రూ. 1000, రూ. 500నోట్లను బ్యాంకుల్లో జమ చేసేందుకు మరో 17 రోజుల్లో గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో వెలుగుచూస్తున్న అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు ఆదాయ పన్ను శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అధిక లావాదేవీలు, డిపాజిట్లపైనే కాకుండా, కొత్త కరెన్సీ సమకూర్చుకున్న వారిపై దాడులు తీవ్రతరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆదాయ పన్నుశాఖ నుంచి రాష్ట్రంలోని ఆదాయపన్నుశాఖ ముఖ్య అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దర్యాప్తు ముమ్మరం చేసేందుకు ఐటి శాఖలోని ఇన్విస్టిగేషన్ విభాగానికి ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై సిబ్బందిని నియమిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు కర్నూలు జిల్లాలో బాడాబాబులపై దాడులు, సోదాలు తీవ్రతరం చేయన్నుట్లు తెలుస్తోంది. గత నెల 10వ తేదీ తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేసిన సొమ్ములో సరైన జమా లెక్కలు లేని వాటిని గుర్తించడం కోసం ఒక సాఫ్ట్‌వేర్‌ను ఆదాయ పన్నుశాఖ తయారు చేసింది. దీనివల్ల అధికంగా జరిగిన బ్యాంకు లావాదేవీలను సాఫ్ట్‌వేర్ సాయంతో గుర్తించి అనుమానం ఉన్న ఖాతాదారులకు నోటీసులు ఇస్తున్నారు. ఈ నోటీసుల్లోనే పెనాల్టీ, చెల్లించాల్సిన పన్ను వివరాలను పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను వచ్చే ఏడాది మార్చి వరకూ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకకాలంలో దాడులు చేసేందుకు సిబ్బంది కొరత ఉన్నట్లు ఐటి శాఖ అధికారులు తెలుపుతున్నారు.
గడువులోగా సభ్యత్వ నమోదు
లక్ష్యం చేరుకుంటాం
* టిడిపి జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి
కర్నూలు సిటీ, డిసెంబర్ 12 : జిల్లా లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, గడువులోపు నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకుంటామని టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నాగేశ్వరరావుయాదవ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ రెండేళ్లకోసారి చేపట్టే సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా 2014లో దాదాపు 3,10,770 మంది సభ్యత్వం స్వీకరించారన్నారు. ఈమారు 4.4 లక్షల మందితో సభ్యత్వాలు చేయించాలని లక్ష్యాన్ని నిర్ధేశించుకోగా పెద్ద నోట్ల రద్దు వల్ల కాస్త ఆలస్యం అవుతుందని వెల్లడించారు. అప్పుడు 60 రోజుల్లో 3లక్షలకు పైగా సభ్యత్వాలు చేయించామని, కాని ఈసారి తక్కువ సమయంలోనే ఎక్కువ సభ్యత్వాలు చేయించామన్నారు. సిఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై చాలా మంది పార్టీ సభ్యత్వం స్వీకరించడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఖచ్చితంగా 2014 కంటే ఈ సారి 30శాతం సభ్యత్వాలను అధికంగా చేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబు గత ప్రభుత్వం కంటే ఆరోగ్యశ్రీ పథకానికి ఎక్కువ నిధులు కేటాయించి పకడ్బందీగా నిర్వహిస్తుండగా ప్రతిపక్ష నేత జగన్ ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని విమర్శించడం తగదన్నారు. జగన్ ఎక్కడికెళ్తే అక్కడ చంద్రబాబు మీ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని అక్కడి ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి ప్రభుత్వం రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అహర్నిషలు కృషి చేస్తుందని వెల్లడించారు. అయితే జగన్ వారిని కూడా రెచ్చగొడుతూ పక్కదారి పట్టిస్తున్నారని రైతులు జగన్ మాటలు వినవద్దని సూచించారు. సమావేశంలో నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ ఎం.మల్లికార్జునరెడ్డి, మహేష్‌గౌడ్, హనుమంతరాయచౌదరి, అయ్యపురెడ్డి, సుశీలమ్మ, సుభాషిణి, తదితరులు పాల్గొన్నారు.
అన్నమయ్య చిత్రం
జీవితంలో మరువలేనిది
* సినీనటుడు సుమన్..
* డోన్‌లో సత్యగ్యాంగ్ సినిమా షూటింగ్
డోన్, డిసింబర్ 12:అన్నమయ్య సినిమా తన జీవితంలో మరువలేనిదని ప్రముఖ సినీ నటుడు సుమన్ పేర్కొన్నారు. సిద్దయోగి క్రియేషన్స్ ఆధ్వర్యంలో డోన్ పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త మహేష్ కన్న నిర్మాతగా నిర్మిస్తున్న ‘సత్యగ్యాంగ్’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను సోమవారం పట్టణంలో చిత్రీకరించారు. షూటింగ్ అనంతరం కన్న స్వగృహంలో సినీనటుడు సుమన్ విలేఖరులతో మాట్లాడారు. 1970లో తమిళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేశానన్నారు. అయితే తెలుగులోనే తనకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయని గుర్తుచేశారు. అన్నమయ్య సినిమాను రాష్టప్రతితో కలిసి తిలకించడం తన జీవితంలో మధురానుభూతిగా మిగిలి పోయిందన్నారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులకు తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. కాగా సినిమా షూటింగ్‌లో భాగంగా డోన్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో సుమన్ ఏసిపి పాత్రలో పలు సన్నివేశాలను చిత్రీకరించారు. పోలీస్‌స్టేషన్‌తో పాటు నవ్య ఆసుపత్రిలో సుమన్‌తో పాటు సత్యగ్యాంగ్ హీరో సాత్విక్‌పై పలు సన్నివేశాలను తీశారు. డోన్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తుండడంతో పట్టణ వాసులు షూటింగ్ సన్నివేశాలను తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీస్‌స్టేషన్ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. డోన్ పట్టణానికి చెందిన పారిశ్రామికవేత్త మహేష్ కన్న నిర్మాత కావడంతో సత్యగ్యాంగ్ షూటింగ్ సన్నివేశాలు ఈ ప్రాంతంలోనే అధికంగా షూటింగ్ చేస్తామని సినీ నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో కెమెరామెన్ అడిశువెళ్లి విజయకుమార్, దర్శకుడు ప్రభాస్, తదితరులు పాల్గొన్నారు.
వాహనం ఢీకొని దుప్పి మృతి
మహానంది, డిసెంబర్ 12: మహానంది సమీపంలోని జీనశంకర తపోవనం ఆశ్రమం సమీపంలో ఓ అడవి దుప్పి మృతి చెందినట్లు డిఆర్‌ఓ రఘుశంకర్ తెలిపారు. సోమవారం ఆయన తెలిపిన వివరాల మేరకు ఆదివారం రాత్రి సమయంలో అడవి నుంచి దుప్పి రోడ్డు తాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అడవి దుప్పి మృతి చెందడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించామని, వారి ఆదేశాల మేరకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేసినట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అడవిలో వెళ్లే వాహనదారులు వన్య మృగాలు తిరుగుతుంటాయని, వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, జాగ్రత్తగా వాహనాలు నడుపుతూ పరిమిత వేగంలో వెళ్లాలని తెలిపారు.
తల్లిదండ్రులను ఆదరించాలి:డీఎస్పీ
నంద్యాల, డిసెంబర్ 12: కన్నకొడుకులు తల్లిదండ్రులను ఆదరించాలని, వృద్ధాప్యం వచ్చిందని వారిని గాలికి వదిలేస్తే సీనియర్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్టు కింద శిక్షించే అవకాశం ఉంద ని డిఎస్పీ హరినాథ్‌రెడ్డి తెలిపారు. సోమవారం డిఎస్పీ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. పట్టణంలోని నూనెపల్లె ప్రాం తానికి చెందిన మాదిరాజు సత్యనారాయణ దంపతులు తమ కొడుకులు తమను చూడడం లేదని, బతుకు భారంగా మారిందని, మా ఆస్తి కావాలంటూ వేధిస్తున్నారని, తమను కాపాడాలని డిఎస్పీని వేడుకున్నారు. మాదిరాజు సత్యనారాయణకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయినప్పటికి వృద్ధాప్యంలో మాదిరాజు దంపతులు తమ సొంత ఇంట్లో కష్టాల నడుమ గడుపుతున్నామని, అనారోగ్యం పాలైన తమకు మందులు ఇచ్చే దిక్కు లేరని, కొడుకులు, కూతు ర్లు తమ ఆస్తి కావాలని వేధిస్తున్నట్లు డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. నూనెపల్లె ప్రాంతంలో మెయిన్‌రోడ్డులో ఆరున్న ర సెంట్ల స్థలంలో పాత ఇల్లు ఉందని, ఆ స్థలం రూ. కోటి విలువ చేస్తుందని డిఎస్పీకి తెలిపారు. తన కొడుకులను, కూతుర్లను పిలిపించి తమ సంరక్షణ బాధ్యత ఎవరో ఒకరు తీసుకొనేలా అప్పగించాలని, వారికి తన ఆస్తి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు తెలిపారు. స్పందించిన డిఎస్పీ మాట్లాడుతూ ఇటీవల సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు కొడుకులు తల్లిదండ్రులను విస్మరిస్తే చట్ట ప్రకారం శిక్షించడంతోపాటు తల్లిదండ్రుల ఆస్తిలో చిల్లిగవ్వ కొడుకులకు ఇవ్వాల్సిన పనిలేదని తీర్పు వచ్చిందని, కన్నకొడుకులు తమ తల్లిదండ్రులను గౌరవ ప్రదంగా చూసుకోవాలని, వృద్ధాప్యంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత కొడుకులపైనే ఉందన్నారు. మాదిరాజు సత్యనారాయణ కొడుకులను పిలిచి కౌనె్సలింగ్ నిర్వహించి వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
శాంతి దూత మహ్మద్ ప్రవక్త
* రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్
కర్నూలు సిటీ, డిసెంబర్ 12: మహ్మద్ ప్రవక్త శాంతిదూతగా, విశ్వకారుణ్యమూర్తిగా ఈ లోకానికి వచ్చారని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ పేర్కొన్నారు. మహ్మద్ ప్రవక్త జన్మదినం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా నగరంలో మిలాద్ ఉన్ నబి వేడుకలను సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అజరత్ లతీఫ్‌లౌబాలి దర్గా లాల్ మసీదు రోడ్డు నుంచి మిలాద్ చౌక్ రాజ్‌విహార్ సెంటర్ వరకూ మిలాద్ ఉన్ నబి జులుస్(ఉరేగింపు) నిర్వహించారు. ఊరేగింపులో పాల్గొన్న టిజి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త మానవాళికి మంచి చేయడానికి లోకానికి వచ్చాడన్నారు. ఎంపి బుట్టా రేణుక మాట్లాడు తూ మహ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి, మహిళాభివృద్ధి కోసం కృషి చేశారన్నా రు. ఎమ్మెల్యే ఎస్పీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ కర్నూలు నగరం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. హిం దూ, ముస్లింలు సోదర భావంతో కలి సి మెలిసి ఉండి రంజాన్, వినాయక చవితి, తదితర పండుగలను ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా జరుపుకోవడం హర్షణీయమన్నారు. మహ్మద్ ప్రవక్త మానవాళికే కాకుండా సకల జీవరాసులకు మూలం అన్నారు. ప్రవక్తను తలుచుకుంటూ ప్రతి ముస్లిం 5 పూటల నమాజు చేస్తారని, ఒక్కో నమాజుకు ఒక ప్రత్యేకత ఉందని వెల్లడించారు. వైకాపా నేత హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మహ్మద్ ప్రవక్త బోధనలను ఆచరించి, సన్మార్గంలో నడవాలన్నారు. అనంతరం ముస్లింలు సోదర భావం తో నాలుకలకు సూది గుచ్చుకుని ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలలో లతీఫ్ లౌబా లి దర్గా ముతవల్లి హజరత్ సయ్యద్ షా అబ్దుల్లా హుస్సేన్ బాద్‌షా ఖాద్రీ, మిలాద్ కమిటీ సభ్యులు సయ్యద్ షఫీపాష ఖాద్రీ, జమాత్ పాల్గొన్నారు.
చౌడేశ్వరీమాత సేవలో
పోస్టుమాస్టర్ జనరల్
బనగానపల్లె, డిసెంబర్ 12:మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీమాతను సోమవారం కర్నూలు ప్రాంతీయ పోస్టుమాస్టర్ జనరల్ సంజీవ్‌రంజిత్ దర్శించుకున్నారు. తొలుత ఆయన తపాలాశాఖ అధికారుల బృందంతో కలిసి నందవరం అమ్మవారి ఆలయం వద్దకు చేరుకోగా ఇఓ రామానుజన్, వేదపండితులు సుబ్బారావు, రామకృష్ణ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అనంతరం చౌడేశ్వరీమాతను దర్శించుకున్నారు. అలాగే అమ్మవారి మూలవిరాట్, శ్రీ చక్రానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట జిల్లెల్ల పోస్టుమాస్టర్ భాస్కరశర్మ, పలువురు, అధికారులు వున్నారు.
ఘనంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం
కోసిగి, డిసెంబర్ 12 : మండల పరిధిలోని సజ్జలగుడ్డ గ్రామం శివారులో వెలసిన మార్లబండ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో సోమవారం ఘనంగా ప్రభోత్సవం నిర్వహించారు. ఉదయం నుండి ఆంజనేయస్వామికి ఆలయ అర్చకులు శ్రీరాములు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సాయం త్రం ఆంజనేయస్వామిని ప్రభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విశ్వనాథ్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, విరుపాక్షి, హనుమంతు, నరసింహులు, మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ మఠంలో రాయచూర్
న్యాయమూర్తి
మంత్రాలయం, డిసెంబర్ 12: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం సోమవారం కర్నాటక రాయచూరు జిల్లా న్యాయవాది మంజుళ కుటుంబ సమేతంగా వచ్చారు. వారికి మఠం అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుని, శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల మంత్రాక్షితలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మఠం సిబ్బంది వ్యాసరాజాచార్ తదితరులు పాల్గొన్నారు.

బ్రాహ్మణులకు వరం ప్రభుత్వ
వశిష్ట పథకం
ఆదోనిటౌన్, డిసెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వశిష్ట పథకం ఎన్నో విధాలుగా ఆదుకుంటుందని, దీనిని బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకోవాలని బ్రాహ్మణ కార్పొరేషన్ ఆదోని కోర్డినేటర్ గరుడాద్రి దత్తాత్రేయశర్మ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్, కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకును ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణరావు ఎంతో కృషి చేశారన్నారు. ఆయన కృషి వల్ల రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. బ్రాహ్మణ కో ఆపరేటివ్ సొసైటీ బ్యాంకులు రాష్ట్రంలోని 13 జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే ప్రారంభిస్తారని, ఇందులో ప్రతి బ్రాహ్మణుడు సభ్యులుగా చేరాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా వశిష్ట పథకం ద్వారా పేద విద్యార్థులకు సివిల్స్ సర్వీసు పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తూ శిక్షణ ఇవ్వడమే కాకుండా భృతిని కూడా కార్పొరేషన్ ద్వారా అందిస్తారన్నారు. ప్రతి బ్రాహ్మన విద్యార్థి దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదోని ప్రాంతలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అన్ని విధాలుగా అర్హులకు సంక్షేమ పథకాలు అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
మహానందిలో కొనసాగుతున్న
భక్తుల రద్దీ
మహానంది, డిసెంబర్ 12: మహానంది పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత మూడు రోజులుగా ప్రభుత్వం సెలవుదినాలు ఉండడంతో క్షేత్రాలకు భక్తులు వేలాదిగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం మహానంది క్షేత్రం ఉదయం నుండి భక్తుల రద్దీ ఉంది. ఆలయంలోని పుష్కరిణిలలో పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు శ్రీ కామేశ్వరిసమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు.
శబరిమలైకు అయ్యప్ప భక్తులు: మహానంది పుణ్యక్షేత్రంలోని అయ్యప్ప భక్తులు శబరిమలై యాత్రకు బయలుదేరారు. గురుస్వామి కృష్ణమూర్తిబాబు ఆధ్వర్యంలో భక్తులు శబరిమలై యాత్రకు ఇరుముడులు కట్టుకొని బయలుదేరి వెళ్లారు. వారికి బంధువులు మేళతాళాలతో సాగనంపారు.
ఘనంగా తిరుమంగై
ఆళ్వార్ తిరునక్షత్ర వేడుకలు
ఆళ్లగడ్డ, డిసెంబర్ 12: వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో సోమవారం తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ అర్చక బృందం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో పాటు అమృతవల్లి అమ్మవార్ల, తిరుమంగై ఆళ్వార్ ఉత్సవమూర్తికి నవకలశ అభిషేకం నిర్వహించారు. అహోబిల క్షేత్రంపై తిరుమంగై ఆళ్వారు రచించిన ప్రభంధాలను చదువుతూ ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం మంగళ వాయిద్యాల సవ్వడుల మధ్య మాడవీధుల్లో ఉత్సమూర్తులకు గ్రామోత్సవం నిర్వహించారు. ఈ క్యార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శబరిమలైకి తరలివెళ్లిన భక్తులు
రుద్రవరం, డిసెంబర్ 12: మండలంలోని టి.లింగందినె్న, వెలగలపల్లె, రుద్రవరం, కొండమాయపల్లె గ్రామాలలో అయ్యప్ప మాల దీక్ష చేపట్టిన భక్తులు కేరళ రాష్ట్రంలోని శబరిమలైకి తరలివెళ్లారు. 40 రోజుల పాటు అయ్యప్ప మండల దీక్షను చేపట్టి సోమవారం స్థానిక ఆంజనేయస్వామి ఆలయంలో అయ్యప్ప స్వామికి ఇరుముడులు స్వామికి సమర్పించేందుకు తరలివెళ్లారు. ఈసందర్భంగా ప్రత్యేక పూజలు, భజనల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వివాహిత ఆత్మహత్య
కొలిమిగుండ్ల, డిసెంబర్ 12: మండలంలోని కోరుమానుపల్లె గ్రామంలో వివాహిత హసీనా బేగం (19) సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని కోరుమానుపల్లెకు చెందిన హసీనా బేగంను ఏడు నెలల క్రితం కోవెలకుంట్ల మండలం కొప్పెర్ల గ్రామానికి చెందిన నాగవాలికి ఇచ్చి వివాహం చేశారు. మీలాదున్‌నబీ పండుగను పురస్కరించుకొని పుట్టినిల్లు అయిన కోరుమానుపల్లెకు వచ్చి హసీనాబేగం కడుపునొప్పి తాళలేక సోమవారం తెల్లవారుజామున పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు. చికిత్సకోసం కర్నూలుకు తరలించగా, మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

లారీ, ట్రాక్టర్ ఢీ..
డ్రైవర్లకు తీవ్రగాయాలు
ఓర్వకల్లు, డిసెంబర్ 12:ఓర్వకల్లు సమీపంలోని కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారి-18పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న లారీ, ట్రాక్టర్ బలంగా ఢీకొన్నాయి. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ బాలరాజుకు, ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్రగాయాలు కాగా కర్నూ లు ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నుజ్జునుజ్జయింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వివాహిత ఆత్మహత్యాయత్నం
రుద్రవరం, డిసెంబర్ 12: మండలంలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన వివాహిత లూక జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్‌ఐ హనుమంతయ్య తెలిపారు. రెడ్డిపల్లెకు చెందిన శివాంజనేయులుకు మండలంలోని బీరవోలు గ్రామానికి చెందిన జయలక్ష్మితో నాలుగు సంవత్సకాల క్రితం వివాహం అయిందన్నారు. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవలు రావడంతో జయలక్ష్మి తమ సొంత ఊరికి వెళ్లిందని, నాలుగు రోజుల క్రితమే అత్తవారింటికి చేరుకుందన్నారు. అనంతరం భర్తతో గొడవపడి మనస్థాపం చెంది కిరోసిన్ పోసుకొని నిప్పంచుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా 108 వాహనంలో నంద్యాలకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్యం సీసాలు స్వాధీనం
మండలంలోని ఆలమూరు గ్రామంలోని తిప్పవద్ద 43 మద్యం సీసాలను స్వాధీనంచేసుకున్నట్లు ఎస్‌ఐ హనుమంతయ్య తెలిపారు. బాచేపల్లి గ్రామానికి చెందిన చిన్న వౌలాలి అనే వ్యక్తి గ్రామంలో మద్యం విక్రయించేందుకు వెళ్తుండగా అతన్ని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అదనపు కట్నం వేధింపుల కేసు నమోదు
బేతంచెర్ల, డిసెంబర్ 12:అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారని జైనాబీ ఫిర్యాధి మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ రషీద్ తెలిపారు. పట్టణంలోని కోటపేటకు చెందిన జైనాబీకి కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన మాహబూబ్‌బాషాతో వివాహమైంది. అయితే గత 3 నెలలుగా అత్త మామలు మూర్తుజాబీ, మాబాషాతో పాటు భర్త అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
విస్తృతంగా వాహనాల తనిఖీ
చాగలమర్రి, డిసెంబర్ 12: మండలంలోని మద్దూరు మెట్ట వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేశారు. ఇంటర్ సెక్టార్ వాహనం ద్వారా వాహనాల వేగాన్ని పరిశీలించి అతివేగంగా వెళ్తున్న వాహనాలపై జరిమానాలు విధించారు. అలాగే రికార్డులు లేని వాహనాల యజమానులపై కూడా కేసులు రాశారు. ఈకార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పుల్లయ్య, షాకిర్, నాయక్, నజీర్, సిబ్బంది పాల్గొన్నారు.