కర్నూల్

చదువుకు పేదరికం ఆటంకం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం, డిసెంబర్ 27: పేదరికం చదువు నేర్చుకోవడానికి అడ్డం కాదని, అలాగే మంచి అలవాట్లు, సత్ప్రవర్తనతో అభివృద్ధి సాధ్యమని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఇందిరానగర్ చెంచు కాలనీలో చెంచు యువజనులు, పాఠశాల విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన క్రీడామైదానంలో బాస్కెట్‌బాల్, టెన్నికాయిట్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టులను ప్రారంభించారు. ఈ సందర్భం గా ఎస్పీ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు ఉన్నాయని, వాటిని వినియోగించుకొని అభివృద్ధిలోకి రావాలన్నారు. చెం చు కాలనీ వాసులు గంతంలో కంటే ఎంతో అభివృద్ధి చెందినట్లు అధికారు లు, ప్రజలు తెలియజేస్తున్నారని సం తోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. పాఠశాలలకు పంపని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు స్థానిక నాయకులు, విద్యావంతులు ప్రతి ఇంటికి తిరిగి తమపిల్లలను బడికి పంపడానికి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. చెంచుకాలనీ నుండి పలువురు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నట్లు తెలుస్తున్నదని తెలిపారు. గతంలో చా లా మంది ఉన్నతాధికారులు చెంచుల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. జడ్పీటీసీ నారాయణమ్మ విద్యావంతురాలు కావడం వల్లనే జడ్పీటీసీ పదవిని ఆమె అలంకరించిందని తెలుపుతూ ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అందుకు చక్కని వాతావరణం ఏర్పడిందని, అందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. అనంతరం ఆయన తమ్మరాజుపల్లె సమీపంలో రాజస్తాన్ డాబావద్ద నిర్మిస్తున్న పవర్‌పాండే చిత్ర షూటింగ్‌ను సందర్శించి ఆడపిల్ల అనే క్యాసెట్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ హరినాథరెడ్డి, సిఐ పార్థసారదిరెడ్డి, ఎస్ ఐమురళీమోహన్‌రావు, రామాంజనేయరెడ్డి, మాజీ సంర్పచ్ సుబ్బరాయుడు, బిజెపి నేత కరుణాకర్‌రెడ్డి, కాలనీవాసులు, ప్రజలు పాల్గొన్నారు.
నంద్యాలలో తమిళ సినీనటుడు
ధనుష్ సినిమా షూటింగ్
* ఎస్పీ ఆలపించిన ‘సేవ్ గర్ల్ చైల్డ్’ సిడి ఆవిష్కరణ
కర్నూలు, డిసెంబర్ 27 : నంద్యాలలో మంగళవారం తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు, సినీనటుడు ధనుష్ సినిమా షూటింగ్ జరిగింది. అందులో భాగంగా ఎస్పీ ఆకే రవికృష్ణ నంద్యాలలో ధనుష్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ రవికృష్ణ మాట్లాడుతూ సినిమా షూటింగ్‌కు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చిత్రం బృందంకు పోలీసులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. జిల్లాలో భవిష్యత్తులో మరిన్ని చిత్రాలు షూటింగ్ జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎస్పీ రవికృష్ణ స్వయంగా పాడిన ‘సేవ్ గర్ల్ చైల్డ్’ పాట ఆల్బమ్ సిడిని ధనుష్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తినిచ్చే పాటలను ఎస్పీ స్వయంగా పాడడం అభినందనీయమన్నారు. అలాగే తమ చిత్ర యూనిట్‌కు పోలీసు శాఖ సహకరిస్తున్నందుకు ఎస్పీకి కృత్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో తమిళ సీనియర్ నటుడు రాజ్‌కుమార్, నంద్యాల డీఎస్పీ హరినాథ్‌రెడ్డి, పాణ్యం సిఐ పార్థసారధిరెడ్డి, ఎస్‌ఐ మురళీధర్, సేవ్ గర్ల్ చైల్డ్ పాట డైరెక్టర్ డిఎన్.శశిధర్‌రెడ్డి, కలీంషేక్, తదితరులు పాల్గొన్నారు.