కర్నూల్

మారని ప్రైవేట్ కళాశాలల తీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 19:కళాశాలలో ర్యాగింగ్, చదువు పేరుతో ఒత్తిడి చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలేవీ విద్యార్థుల ఆత్మహత్యలను నివారించలేకపోతున్నాయి. కార్పొరేట్ కళాశాలల్లో ర్యాగింగ్ లేకపోయినా ర్యాంకుల కోసం విద్యార్థుల మనసుపై దాడి చేస్తూ వారిని ఒత్తిడికి గురి చేయడం వల్లే దిక్కుతోచని స్థితిలో తమను తాము బలి చేసుకుంటున్నారు. దీనికితోడు ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, మెడికల్‌తో పాటు పలు విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతం ఇంకా పడగవిప్పుతోంది. దీనిపై ప్రభుత్వం, పోలీసులు కేవలం హెచ్చరికలకే పరిమితం కావడం, మెతక వైఖరి అవలంబించడం వల్ల దారుణాలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో మానసిక ఒత్తిడి తాళలేక నగరంలోని రెండు కళాశాలల్లో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఎస్పీ ఆకే రవికృష్ణ జిల్లాలోని అన్ని కళాశాలల యాజమాన్యంతో సమావేశం నిర్వహించి ఎట్టి పరిస్థితుల్లో ఒత్తిడి పెంచవద్దని, సెలవు రోజుల్లో కళాశాలల నిర్వహణ, రోజువారీ సమయం ముగిసాక అదనపు తరగతులు నిర్వహించం వంటి చర్యలకు పాల్పడవద్దని హెచ్చరించారు. అంతేగాక సెలవు రోజుల్లో పోలీసులు ఆయా కళాశాలల వైపు ప్రత్యేకంగా గస్తీ తిరుగుతూ ఆదేశాల అమలును పర్యవేక్షిస్తున్నారు. డేస్కాలర్ విద్యార్థుల వరకూ ఈ విధానం బాగానే ఉన్నా హాస్టల్‌లో ఉంటూ విద్యనభ్యసించే వారి విషయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు పేర్కొంటున్న మేరకు హాస్టళ్లు నిర్వహిస్తున్న కళాశాలల్లో తెల్లవారుజామున 4.30కే నిద్ర లేచి రాత్రి 10.30 గంటల వరకూ తరగతులు, అదనపు తరగతులు, స్టడీ హవర్స్ పేరుతో తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సెలవు రోజుల్లో కూడా ఇదే విధానం కొనసాగుతుందని వారంటున్నారు. నెలలో రెండు ఆదివారాలు తల్లిదండ్రులు రావడానికి వారితో బయటకు వెళ్లడానికి అంగీకరిస్తారని మిగతా రోజుల్లో ఒత్తిడి భరించాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఇక తల్లిదండ్రులు సైతం వేల రూపాయల ఫీజులు చెల్లించామన్న కారణంతో కళాశాలల యాజమాన్యం వైఖరిని ప్రశ్నించకుండా తమ చిన్నారులకే సర్ది చెప్తుండటంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. పోలీసులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి అవసరమైతే ఆయా కళాశాలల్లో విధులు నిర్వహించే వారిపైనే కాకుండా యాజమాన్యంపై కూడా కేసులు నమోదు చేసి శిక్షించేలా చర్యలు ఉంటే ఒత్తిడి తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నారు. ఇంటర్ విద్యలో ఒత్తిడి అనుభవించిన విద్యార్థులు ఆ తరువాత దశలో సీనియర్లు ర్యాగింగ్ పేరుతో ఆడే వికృత క్రీడ కారణంగా మానసికంగా కుంగిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో లోకం విడిచి వెళ్లడానికి సిద్ధపడుతున్నారని పేర్కొంటున్నారు. ఈ కళాశాలల్లో కూడా డేస్కాలర్స్ కంటే హాస్టల్ విద్యార్థులే ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై దాడి చేస్తున్నారని మండిపడుతున్నారు. కొంత కాలం భరించినా ఆగడాలు మితిమీరడం, కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో దారుణమైన నిర్ణయానికి వస్తున్నారని మండిపడుతున్నారు. కర్నూలు, నంద్యాలలోని కళాశాలల్లో ఇలాగే జరిగిందని బోధకులు, యాజమాన్యం ఒత్తిడి, నిర్లక్ష్యం ఆత్మహత్యలకు కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యలకు అంతేలేకుండా పోతుందని వారు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ వైఖరిలో మార్పురాకపోతే ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై హైకోర్టును ఆశ్రయిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
ఇందిరమ్మ పాలనలో
ఇంటింటా సౌభాగ్యం
* పార్లమెంటు ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే
కర్నూలు సిటీ, నవంబర్ 19:బిజెపి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇందిరమ్మ పాలనలో ఇంటింటా సౌభాగ్యం విరాజిల్లిందని పార్లమెంటు ప్రతిపక్ష నేత మల్లికార్జునఖర్గే పేర్కొన్నారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ శత జయంతి సందర్భంగా శనివారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణ త్యాగం చేసిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని కొనియాడారు. దేశానికి వెనె్నముక రైతు అని, రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని భావించి వారి సంక్షేమం కోసం ఎన్నో సంస్కరణలు చేసిందన్నారు. వ్యవసాయం దండగ కారాదు, పండుగ కావాలని త్రికరణశుద్ధిగా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎన్నో విప్లవాత్మక పథకాలు, చట్టాలను అమలు చేసిందని గుర్తుచేశారు. అయితే 2014లో కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టిడిపి అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల పట్ల చిన్న చూపుచూస్తున్నాయని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసి ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపి కెవిపి రామచంద్రరావు, కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మి, కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి, కిల్లి కృపారాణి, ఏఐసిసి రాష్ట్ర పరిశీలకులు కుంతియా, పిసిసి చీఫ్ రఘువీరారెడ్డి, ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అహమ్మద్ అలీఖాన్, డిసిసి అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, సర్దార్ బుచ్చిబాబు, ఆకెపోగు వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
బహిరంగ మలవిసర్జన రహిత
పట్టణంగా నంద్యాల
నంద్యాల, నవంబర్ 19: నంద్యాలకు బహిరంగ మలవిసర్జన లేని పట్టణంగా కేంద్రం గుర్తింపునిచ్చింది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన స్వచ్ఛ్భారత్ మిషన్‌లో భాగంగా బహిరంగ మలవిసర్జన లేని పట్టణాలను గుర్తించి పట్టణాల అభివృద్ధికి నిధులను పెంచే కార్యక్రమంలో భాగంగా శనివారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో స్వచ్ఛ్భారత్ మిషన్ అవార్డును నంద్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన, కమిషనర్ భాస్కర్‌నాయుడు అందుకున్నారు. గతవారం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని స్వచ్ఛ భారత్ మిషన్ అధికారులు నంద్యాల పట్టణమంతా సర్వే నిర్వహించి ఎక్కడా బహిరంగ మలవిసర్జన జరగలేదని, పంపిన నివేదిక ఆధారంగా ఈ అవార్డును అందుకున్నారు. దీంతో నంద్యాల పురపాలక సంఘానికి స్వచ్ఛ్భారత్ కార్యక్రమాలకు మరిన్ని నిధులు అందే అవకాశం ఉంది.
పెద్దాసుపత్రిలో మరింత
మెరుగైన సేవలు
* రూ. 5.5 కోట్లతో అత్యవసర వైద్య పరికరాల కొనుగోలు
* గుండె ఆపరేషన్ మందులకు రూ. 5 లక్షలు
* అభివృద్ధి కమిటీ చైర్మన్, కలెక్టర్ విజయమోహన్
కర్నూలు, నవంబర్ 19:రాయలసీమకే తలమానికంగా నిలిచిన కర్నూలు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో ఇకపై మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, కలెక్టర్ విజయమోహన్ తెలపారు. అందులో భాగంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు రూ. 5.5 కోట్ల వ్యయంతో అత్యవసర వైద్య పరికరాలు కొనుగోలు చేసి ఏర్పాటు చేసేందుకు అనుమతించామని తెలపారు. ఆసుపత్రిలోని సూపర్ స్పెషాలిటీ మార్టన్ హాలులో శనివారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులు చేపట్టి నెల రోజుల్లో రూపురేఖలు మార్చేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. చిన్నపిల్లల సర్జన్‌కు రూ. 53 లక్షలు, ఆపరేషన్ థియేటర్‌కు రూ. 70 లక్షలు, నెఫ్రాలజీ విభాగానికి రూ. 36.5 లక్షలు, పీడియాట్రిక్, ఎన్‌ఐసి విభాగానికి రూ. 2.4 కోట్లు, ఎంఆర్‌ఐ స్కానింగ్ విభాగానికి రూ. 50 లక్షలు ఇతర సదుపాయాలకు కలిపి మొత్తం రూ. 5.5 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. కొరతగా ఉన్న స్ట్రెచర్ బాయ్‌లను ఔట్‌సోర్సింగ్‌పై తీసుకునేందుకు 2 రోజుల్లో టెండర్ పిలవాల ని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ఆసుపత్రి సేవల వైఫల్యంపై ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పా టు చేయాలని సూచించారు. గుండె ఆపరేషన్‌కు మందుల కోసం రూ. 5లక్షలు కార్పస్ ఫండ్‌గా ఇవ్వాలని కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఏఎంసి వార్డులో 10 వెంటిలేటర్ మిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన రోగులకు వచ్చిన క్లయిమ్ మొత్తంలో 10 శాతం రీయింబర్స్ చేయడానికి అవకాశం కల్పించామన్నారు. ఆసుపత్రిలోపల భాగంలో యు షేప్‌లో చిల్లర దుకాణాలకు త్రిసభ్య కమిటీని వేశామన్నారు. అందులో భాగంగ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్‌డిఓ, నగర కమిషనర్ కలిసి పర్యవేక్షించి నిర్ధారించిన నినేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఇక ఆసుపత్రిలో పందులు, కుక్కల బెడద లేకుండా 2 వారాల్లో చర్యలు తీసుకోవాలని ఆర్‌డిఓను ఆదేశించారు. ఆసుపత్రిలో గార్డెనింగ్, గ్రీనరీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూ. 50లక్షలు కేటాయించామన్నారు. రాబోయే 3 నెలల్లో అభివృద్ధి చేయాలని నిర్ణయించామని ఇందుకు సంబంధించి 2 రోజుల్లో రూ. 25లక్షలను నగరపాలక సంస్థ కమిషనర్‌కు అందజేసి తక్షణమే గార్డెన్ అభివృద్ధికి చర్యలు తీసుకోమని ఆదేశించామన్నారు. గత సమావేశంలో 17 నిర్ణయాలు తీసుకుని 10 పూర్తి చేశామని, మిగిలినవి ప్రభుత్వ పరిధిలో వున్నాయని వివరించారు. ఇకపై ప్రతి రెండు నెలలకోసారి హెచ్‌డిసి సమావేశం నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వాసుపత్రి నిర్వహణ, ప్రతికూల వార్తలపై తీసుక్ను నిర్ణయాలు, తదితర అంశాలపై ప్రతి నెల రెండవ మంగళవారం విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి వివరించడంతో పాటు మీడియా ఫీడ్‌బ్యాక్‌ను కూడా సేకరిస్తామన్నారు. సమావేశంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా రాంప్రసాద్, సూపరింటెండెంట్ డా వీరస్వామి, నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
* విద్యార్థిని ఆత్మహత్యపై ఆర్‌జిఎం కళాశాలలో కలెక్టర్ విచారణ
నంద్యాల, నవంబర్ 19: ఒక విద్యార్థిని బలవన్మరణానికి కారణమైన ర్యాగింగ్ చేసిన వారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. శనివారం పాణ్యం మండలంలోని ఆర్‌జిఎం ఇంజినీరింగ్ కళాశాలలో ర్యాగింగ్ పట్ల విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఉషారాణి సంఘటనపై ఆయన విచారణ నిర్వహించారు. పాణ్యం పోలీసు అధికారులు, తహశీల్దార్, కళాశాల చైర్మన్ శాంతిరాముడుతో చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్‌జిఎం కళాశాల పరిస్థితులపై క్షున్నంగా పరిశీలించామని, చౌడేశ్వరి హాస్టల్ బ్లాక్‌లోని 117వ రూమును పరిశీలించి అందులో ఉన్న విద్యార్థినులు వైష్ణవి, కవిత, రజనిలను ఉషారాణి ఆత్మహత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కళాశాల యాజమాన్యంతో, పోలీసు, రెవెన్యూ అధికారులతో చర్చించారు. ఆర్‌జిఎం కళాశాలలో విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీడియా ద్వారా తెలుసుకొని స్వయాన పరిశీలించేందుకు వచ్చానన్నారు. ర్యాగింగ్ చేసే వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ విషయంపై విచారణకు ప్రత్యేక మహిళా అధికారిని నియమిస్తామని వారు పరిపాలన విభాగం, పోలీసు విభాగం ద్వారా క్షున్నంగా అన్ని కోణాల నుండి విచారించి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ విషయంపై పోలీసు అధికారులు కూడా తమ కోణంలో విచారణ జరుపుతున్నారన్నారు. ఏవైన సమస్యలు ఎదురైనప్పుడు విద్యార్థిని విద్యార్థులు, రైతు లు, మహిళలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయంలోని కమాండింగ్ కంట్రోల్ రూముకు ఫోన్ చేయాలని, అలా చేస్తే వారికి కౌనె్సలింగ్ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యా సంస్థ యాజమాన్యం ర్యాగింగ్‌లు జరుగకుండ అన్ని విధాలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో విద్యా సంస్థల అధినేత శాంతిరాముడు, కళాశాల ప్రిన్సిపాల్ డా.జయచంద్ర ప్రసాద్, హాస్టల్ వార్డెన్ రేవతి, నంద్యాల ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, పాణ్యం తహశీల్దార్ చంద్రావతి, నంద్యాల డిఎస్పీ హరినాథ్‌రెడ్డి, పాణ్యం సిఐ పార్థసారధిరెడ్డి పాల్గొన్నారు.
యాజమాన్యం బాధ్యత వహించాలి..
కడప జిల్లా బద్వేలు మండలానికి చెందిన ఉషారాణి పాణ్యం మండలం ఆర్‌జిఎం కళాశాలలో మొదటి సంవత్సరం బిటెక్ ఐటి చేస్తూ గురువారం ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించి బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేలు ఎంపిపి ప్రతాపరెడ్డి, మండల టిడిపి కన్వీనర్ అమరనాథ్‌రెడ్డి, బద్వేలు నాయకులు రామచంద్రారెడ్డి తదితరులు పది వాహనాలలో బద్వేలు నుండి ఆర్‌జిఎం కళాశాలకు శనివారం మధ్యాహ్నం చేరుకొని కళాశాల చైర్మన్ శాంతిరాముడుతో చర్చించారు. అలాగే నంద్యాల డిఎస్పీ హరినాథ్‌రెడ్డిని కళాశాల ప్రాంగణంలోనే కలుసుకొని ఉషారాణి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, ర్యాగింగ్, అధ్యాపకుడి వేధింపులు తదితర విషయాలపై నిస్పక్షపాతంగా విచారించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. కళాశాలలో జరిగిన ర్యాగింగ్ వేధింపుల కారణంగానే ఉషారాణి ఆత్మహత్య చేసుకుందని, ఈ విషయం విచారణలో బయటకు వస్తే కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు కళాశాలను మూసి వేయాలని వారు డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పథకాలపై
జగన్ విమర్శలు హాస్యాస్పదం
* అటవీ శాఖ మంత్రి బొజ్జల
ఎమ్మిగనూరు, నవంబర్ 19: వైఎస్ జగన్ అనునిత్యం టిడిపిని విమర్శచడం తగదని, టిడిపి పథకాల గురిం చి తెలియని ఆయన టిడిపిని విమర్శస్తే పుట్టగతులు వుండవని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజల గోపాలకృష్ణా రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఎమ్మిగనూరులో స్థానిక ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో మంత్రి మాట్లాడుతూ సిఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేపోతున్నారన్నారు. టిడిపి సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల వద్దకే తీసుకెళ్లడమే సిఎం ధ్యేయమన్నారు. సిఎం రాయలసీమలోని అనేక కార్యక్రమాలు చేపట్టారని, అన్ని వర్గాల వారి సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా లో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీతోనే ఉపమోగపడుతుందని, దీన్ని ప్రతిపక్షాలు విమర్శంచడం సరికాదన్నారు. పులికనుమ, పోలవరం ప్రాజెక్టులకు అటవీ శాఖ క్లియరెన్స్ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు వస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం, పేద జిల్లాల్లో వెలుగు నింపడం కోసం ప్రతి కుటుంబానిలో నెలకు 10నుండి 20వేల వరకు సంపాదన తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత టిడిపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. నూతన రాజధానికి 45వేల ఎకరాలు పొలాల ను రైతులు ఉచితంగా ఇచ్చారని, రాజధాని నిర్మాణం గురించి ప్రతి ఒక్కరితో చర్చించి అవరావతిగా రాజధానిగా ప్రకటించారని, దీన్ని జగన్ రాజకీయం చేస్తున్నాడని, జగన్‌కు రాజకీయం పరిజ్ఞానం లేదని, రాయలసీమ ప్రజల లక్ష కోట్ల సొమ్మును దిగమింగాడని మంత్రి పేర్కొన్నారు. జనచైతన్య యాత్రల వల్ల బడుగు వర్గాల ప్రజలు సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. సమావేశంలో పట్టణ టిడిపి అధ్యక్షడు అజ్మతుల్లా, మున్సిపల్ వైస్ చైర్మన్ కొండయ్య చౌదరి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.