హైదరాబాద్

నాలుగు గ్రంథాలను ఆవిష్కరించిన కుర్తాళం పీఠాధిపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: సాహిత్య రచనలను ఒక యజ్ఞంలా తీసుకొని అనేక రచనలు చేసి తన కలం ద్వారా దేశ విదేశాలలో సాహితీ ప్రస్తానం చేసిన కనమలూరు వెంకట శివయ్యను అభినందిస్తూ కుర్తాళం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతీ స్వామి నాలుగు గ్రంథాలను ఆవిష్కరించారు. రసమయి సంస్థ నిర్వహణలో మంగళవారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన కనమలూరు వెంకట శివయ్య అభినందన కార్యక్రమంలో కొరతాళం పీఠాధిపతి మాట్లాడుతూ ప్రభుత్వంలో ఐఎఎస్ అధికారిగా పనిచేస్తూ సాహిత్య రచనలు చేయడం విశేషం అని అన్నారు. శివాలోకం, శివసూక్తం, కళ్యాణ దశకం, సోషల్ మిలీయు ఇన్ ఎపిక్స్ కావ్యాలను ఆవిష్కరించి శివతత్వాన్ని స్వామీజీ తెలిపారు. తొలుత ఎపి శాసనసభ ఉపసభాపతి అధ్యక్షోపన్యాసం చేస్తూ సామాన్య కుటుంబంలో జన్మించిన శివయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని అన్నారు.
బహు భాషా పాండిత్యం భగవంతుని వరం అని, తెలుగు గంగ ప్రాజెక్టుకు ప్రథమ అధికారిగా విశేష సేవలు అందించి విద్యాశాఖ కమీషనర్‌గా, ప్రభుత్వ కార్యదర్శిగా వివిధ హోదాలలో పనిచేస్తూ విద్వత్ కవిరత్న, సాహిత్య వల్లభ తదితర బిరుదులు అందుకొని అభినవ శ్రీకృష్ణ దేవరాయగా కన్యాభిషేకం పొందిన శివయ్య ఇతిహాస వాఙ్మయ మహాధ్యక్షులు అని బుద్ధప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రొ. బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య అద్ధంకి శ్రీనివాస్, ప్రొ. శరజ్యోత్స్నా రాణి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు ఎ.రామలక్ష్మణ్, విశ్రాంతి డిజిపి టిఎస్ రావు, విశ్రాంత ఐఎఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తొలుత రసమయి డా. ఎంకె రాము స్వాగతం పలికారు.

గంగాధరశాస్ర్తీకి ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం ప్రదానం
కాచిగూడ, డిసెంబర్ 8: ప్రముఖ గాయకుడు గంగాధర శాస్ర్తీకి ఘంటసాల జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం అభినందన సాంస్కృతిక సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు పాల్గొని గంగాధర శాస్ర్తీకి ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ఘంటసాల తరువాత భగవద్గీతను అద్భుతంగా పాడిన గొప్పవ్యక్తి గంగాధర శాస్ర్తీ అని కొనియాడారు. ఘంటసాల నేటికి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహానీయుడని పేర్కొన్నారు. ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని చెప్పారు. నందమూరి లక్ష్మీపార్వతి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో శిరోమణి వంశీరామరాజు, సంస్థ గౌరవ అధ్యక్షురావు డా.కెవి కృష్ణకుమారి, స్థాపక అధ్యక్షురాలు డా.ఇ.భవాని, వసుంధరావు, లలితారావు పాల్గొన్నారు.