హైదరాబాద్

లంగర్‌హౌస్‌లో టిఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, జనవరి 22: లంగర్‌హౌస్‌లో టిఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం అన్నారు. శుక్రవారం లంగర్‌హౌస్‌లోని ప్రశాంత్‌నగర్, బాపూఘాట్, గాంధీనగర్‌లలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ నగరంలో టిఆర్‌ఎస్ వంద సీట్లను కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కొన్ని పార్టీలు ఆడ్రస్ లేకుండా పోతాయని తెలిపారు. అనంతరం లంగర్‌హౌస్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి బి.్భగ్యలక్ష్మీ భూపతిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సహకారంతో ఘనవిజయం సాధించడం ఖాయమని అన్నారు. లంగర్‌హౌస్ ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలతోనే తాను భారీ మెజార్టీతో గెలుపొందుతానని అన్నారు. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లతో మురికివాడలు లేకుండా చేస్తానని తెలిపారు. లంగర్‌హౌస్ అభివృద్ధి చెందాలంటే టిఆర్‌ఎస్‌కు ఓటువేయాలని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గోవింద్‌రాజ్, పల్లవి, పుష్పలత, సనువెల్లి సత్యంరెడ్డి, వినోద్, జగదీశ్ యాదవ్, కృష్ణాయాదవ్, మల్లేష్, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కార్వాన్‌లో టిఆర్‌ఎస్‌ను గెలిపించండి
కార్వాన్ డివిజన్‌లో భారీ మెజార్టీతో గెలువడం ఖాయం అని టిఆర్‌ఎస్ అభ్యర్ధి చెన్న నరేందర్‌దేవ్ అన్నారు. శుక్రవారం డివిజన్‌లో పలు బస్తీలలో ఇంటింటా ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్వాన్ డివిజన్‌లో స్థానిక ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఇదికేవలం గత పాలకుల పుణ్యమేనని ఆరోపించారు. డివిజన్ ప్రజలు కారుగుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే డివిజన్‌లో సమస్యలు లేకుండా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరూ టిఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని అన్నారు. గత 65 సంవత్సరాలుగా చేసిన అభివృద్ధిని, తాను కేవలం ఐదు సంవత్సరాలలోనే చూసి చూపెడతానని పేర్కొన్నారు.
ఈ ప్రచారంలో కార్మిక సంఘం నాయకుడు రామారావు, కె.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.