జాతీయ వార్తలు

ఢిల్లీపై లష్కరే కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మాహుతి దాడులకు కుట్ర?
మిలిటెంట్లకోసం పోలీసుల వేట

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: దేశ రాజధాని ఢిల్లీలో ప్రముఖ వ్యక్తులను టార్గెట్‌గా చేసుకుని ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నిన ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదుల కోసం ఢిల్లీ పోలీసులు ఇప్పుడు పెద్దఎత్తున గాలిస్తున్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ గుండా జమ్మూ, కాశ్మీర్‌లోకి చొరబడిన డుజానా, ఉకాషాలుగా గుర్తించిన ఇద్దరు లష్కరే తోయిబా మిలిటెంట్లకు సంబంధించిన ఇంటెలిజన్స్ నివేదికలు ఢిల్లీ పోలీసులకు అందడంతో కుట్ర వెలుగు చూసిందని, దీంతో ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. లోధీ కాలనీలోని పోలీసు ప్రత్యేక విభాగం కార్యాలయంలో భారత శిక్షాస్మృతి 120బి (నేరపూరిత కుట్ర), చట్ట వ్యతిరేక కార్యకకలాపాల నిరోధక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఈనెల 1న నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో అనుమానితుల పేర్లు ఏవీ పేర్కొనలేదు. ఈ ఎఫ్‌ఐఆర్‌ను సంబంధిత యాంటీ టెర్రర్ కోర్టుకు సమర్పించడం జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోను, దేశంలోని ఇతర ప్రాంతాల్లోను ఉగ్రదాడులు జరపడానికి లష్కరే తోయిబా కుట్ర పన్నుతోందని, ఈ దాడులకోసం జమ్మూ, కాశ్మీర్‌లోని అధీన రేఖ, ఇతర అంతర్జాతీయ సరిహద్దుల గుండా కొంతమంది మిలిటెంట్లు భారత్‌లోకి చొరబడ్డారని ఆ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారిలో డుజానా, ఉకాషాలుగా గుర్తించిన ఇద్దరు చాలాకాలంగా కాశ్మీర్ లోయలో స్థావరం ఏర్పాటు చేసుకుని తాముగానీ, తమ కేడర్ ద్వారాగానీ ఫిదారుూ( ఆత్మాహుతి దాడులు), లేదా గ్రెనేడ్ దాడుల జరపడం ద్వారా ఢిల్లీలోని ప్రముఖ వ్యక్తులను టార్గెట్ చేసుకోవడానికి కుట్ర పన్నుతున్నారని పోలీసువర్గాలు తెలిపాయి. ముఖ్యంగా నగరంలో రద్దీగావుండే ప్రాంతాలను టార్గెట్ చేసుకోవాలని కూడా వారు అనుకుంటున్నట్టుగా అనుమానిస్తున్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత లష్కరే తోయిబా సానుభూతిపరులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించాలని, సాంకేతిక నిఘాను పెంచాలని, వీలైనంత త్వరగా కుట్రను భగ్నం చేయడానికి చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు స్పెషల్ సెల్‌ను ఆదేశించింది.