హైదరాబాద్

ఎల్బీనగర్‌లో ఎగిరిన టిఆర్‌ఎస్ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హయత్‌నగర్, పిబ్రవరి 5: ఎల్బీనగర్ నియోజకవర్గంలో టిఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని తన సత్తా చాటుకుంది. నియోజకవర్గంలోని 11స్థానాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్ డివిజన్‌లో తెరాసను కైసవసం చేసుకుంది. ఆర్కెపురం డివిజన్‌లో బిజెపి అభ్యర్థి రాధధీరజ్‌రెడ్డి తన సత్తాను చాటుకుంది. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం ఆ పార్టీ వర్గాల సంబరాలు మిన్నంటాయి. భారీ బైక్‌ర్యాలీలు నిర్వహించి అధికార పార్టీకి అనుకూలంగా నినాదాలు చేశారు.
అంబరాన్నింటిన సంబరాలు
రాజేంద్రనగర్, ఫిబ్రవరి 5: గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో టీ ఆర్ ఎస్ పార్టీ అంచనాలకు మించిన విజయాలు సాధిస్తుండడంతో టీ ఆర్ ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి బాణాసంచాలు, టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రేటర్‌లో కారు ఎవ్వరు అందుకోలేనంత స్పీడుతో దూసుకుపోతుండడంతో ఆ పార్టీ శ్రేణులకు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. టీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన గెలుపొందిన అభ్యర్థులు తన అనుచరవర్గంతో ఓపెన్ టాప్ జీపులలో ఊరేగిస్తూ సంబరాలను చేసుకున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహిస్తూ బ్యాండ్ బజంత్రీల మధ్య టపాసులు పేలుస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో వేలాదిమంది టీ ఆర్ ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చి గులాబీ రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
కూకట్‌పల్లి పరిధిలో అత్యధిక స్థానాలు టిఆర్‌ఎస్ కైవసం
ఒక్క సీటుకు పరిమితమైన టిడిపి
కెపిహెచ్‌బికాలనీ, ఫిబ్రవరి 5: గ్రేటర్ హైదరాబాద్ శివారులో సెటిలర్స్ అధికంగా ఉన్న కూకట్‌పల్లి ప్రాంతంలో మునుపెన్నడూ లేనివిధంగా గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. టిడిపికి కంచుకోటగా పిలవబడే కూకట్‌పల్లి ప్రాంతంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఒక సీటుకు పరిమితమైంది. కూకట్‌పల్లి సర్కిల్-ఎ పరిధిలోని బాలాజీనగర్, మూసాపేట, అల్లాపూర్, ఫతేనగర్, ఓల్డ్‌బోయిన్‌పల్లిలతోపాటు సర్కిల్-బి పరిధిలోని వివేకానందనగర్, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్‌కాలనీ డివిజన్‌లలో టిఆర్‌ఎస్ అభ్యర్ధులు విజయం సాధించగా కెపిహెచ్‌బికాలనీ డివిజన్‌లో మాత్రం టిడిపి అభ్యర్ధి మందాడి శ్రీనివాస్‌రావు 2735 ఓట్ల మెజారిటితో టిఆర్‌ఎస్ అభ్యర్ధి అడుసుమిల్లి వెంకటేశ్వర్‌రావుపై విజయం సాధించారు.
బాలాజీనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ మహిళా అభ్యర్ధి పన్నాల కావ్యాహరీష్‌రెడ్డి సమీప టిడిపి అభ్యర్ధి గోనె రూపశ్రీనివాస్‌రావుపై 5349 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మూసాపేట డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి తూము శ్రావణ్‌కుమార్ సమీప టిడిపి అభ్యర్ధి పి.బాబురావుపై 4050 ఓట్ల తేడాతో, అల్లాపూర్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి సబీమాబేగం ఎమ్‌ఐఎమ్ పార్టీ అభ్యర్ధిపై 4772 ఓట్ల మెజారిటితో, ఫతేనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి పండాల సతీష్‌గౌడ్ సమీప బిజెపి అభ్యర్ధి కంచి మహేందర్‌పై 5406 ఓట్ల తేడాతో, హైదర్‌నగర్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి జానకి రామరాజు సమీప టిడిపి అభ్యర్ధి 428 ఓట్ల తేడాతో, కూకట్‌పల్లి టిఆర్‌ఎస్ అభ్యర్ధి జూపల్లి సత్యనారాయణ సమీప బిజెపి అభ్యర్ధి అద్వానీ సూర్యారావుపై 6810 ఓట్ల మెజారిటీతో, బాలానగర్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి కాండూరి నరేంద్రాచార్య సమీప టిడిపి అభ్యర్ధి హరిచంద్‌పై 4418 మెజారిటితో, ఆల్విన్‌కాలనీ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి దొడ్ల వెంకటేష్‌గౌడ్ సమీప టిడిపి అభ్యర్ధి భానుప్రసాద్‌పై 4281 ఓట్ల మెజారిటీతో, వివేకానందనగర్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్ధి ఎం.లక్ష్మీబాయి సమీప టిడిపి అభ్యర్ధి మాధవరం రోజాదేవిపై 1492 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కెపిహెచ్‌బికాలనీ డివిజన్ టిడిపి అభ్యర్ధి మందాడి శ్రీనివాస్‌రావు సమీప టిఆర్‌ఎస్ అభ్యర్ధి అడుసుమిల్లి వెంకటేశ్వర్‌రావుపై 2735 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.