లోకాభిరామం

సమోసాల మతలబు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనలను మనం మాటలతో మోసం చేసుకోగూడదు
- పెర్సివాల్ లోవెల్
చెహరా అనే మాట ఈమధ్యన ఎక్కువగా వినిపించడంలేదు. ఉర్దూలో ఈమాటకు ముఖం అని అర్థం. తెలిసినముఖం అనడానికి జానా పహచానా చెహరా అనడం ఈ భాషలో అలవాటు. తెలుగులోమాత్రం అదే మాటకు మరేదో అర్థం ఉన్నట్లు అనుమానం. ఆచూకీ అంటే ఏమిటోనాకు తెలిదయు. ఈ మాటకు పతా, లేదా చిరునామా, లేదా ఉనికి లేదా ఎక్కడ ఉన్న సంగతి అని అర్థం అనుకుంటున్నాను. అది తెలుసుకోవాలంటే చెహరా ప్రసక్తిలోకి వస్తుంది. చెహరాలు దొరకడంలేదు అంటే ఉనికి గురించి సూచనలు, ఆధారాలు దొరకడంలేదు అనే అర్థం వచ్చే వాక్యాలు ఒకప్పుడు కనిపించేవి.
అన్నిటికన్నా ఆసక్తికరమైన మరొక మాట కచ్చేరి. కచహరి అంటే ఆఫీసు అని అర్థం. దీనికి తెలుగులో మాట లేదు. వెంటనే ఉంది, కార్యాలయం అంటారు. అది సంస్కృతం. పనిచేసే చోటు అంటే మనవాళ్లకు అందంగా కనిపించదు. పోలీసులను రక్షణ భటులు అంటే బాగుంటుంది. కావలివాళ్లు అంటే బాగుండదు. తమిళ్‌లో మాత్రం కావల్ అనే అంటారు. అదే పద్ధతిలో ఈ కచేరీ తెలుగు మాటగా చెలామణి అవుతున్నది. కోర్టు చేరి అంటే వ్యాజ్యాలు, వ్యవహారం అని అర్థం ఇంట్లో అయినా సరే బయటివాళ్ళు వచ్చి కూర్చుని సంప్రదింపులు చేసే గదిని కచేరి అనడం మనవాళ్ళకు అలవాటు. ఆసక్తికరం అని ఎందుకు అన్నారు అంటే, సంగీత సభ జరుగుతుంది,దాన్ని పట్టుకుని అక్కడ ఏదో వ్యవహారం జరిగినట్టు కచేరీ జరిగింది అని మనవాళ్ళు చెప్పుకుంటారు. సంగీతం సరదాగా, మానసిక ఆనందం కొరకు జరిగే ఒక కార్యక్రమం. అది వ్యాజ్యంగా, వ్యవహారంగా ఎందుకు మారిందో తెలియదు. కంచి ఆచార్యులు శంకర విజయేంద్రులకు సంగీతంలో నాకుగల ఆసక్తి గురించి తెలుసు. నేను చేసే కార్కలాపాలు కూడా తెలుసు. ఆయన దూరం నుంచి నన్ను చూసి, పేరు గుర్తుచేసుకోలేక, సంగీతం, కచేరీ అన్నారు. ఆ తరువాత హైదరాబాద్ అయ్యంగార్ అన్నారు.
మాటల వెనుక అర్థాలు వేరు. సినిమా పాట ప్రకారం ఆడవారి మాటలకు అర్థాలు వేరు. నా మాటప్రకారం చాలా మాటల వెనుక దాగివుండే అర్థాలు వేరు. వెతికి వాటిని అర్థం చేసుకుంటే మతలబు తెలుస్తుంది. మెంటల్ అంటారని తంటాలు పడకుండా, కొంటెతనానికి పోకుండా ఉంటే కొంత మంచి జరుగుతుంది.
ఉత్తరం రాస్తారు. ఇప్పుడా అలవాటు లేదు గానీ, మొన్నమొన్నటివరకూ కార్డు, ఇన్లాండ్ కవర్ లాంటివి ఉండేవి. అంతా రాసిన తురవాత చటుక్కున ఏదో ముఖ్యమైన విషయం గుర్తుకు వస్తుంది. అప్పుడు చివర మళ్లీ ఒక ముక్క చేరుస్తారు. ఇంగ్లీషులో ఇటువంటి ముక్క ముందు ఎన్‌బి అని పొడి అక్షరాలు ఉంటాయి. నిజం చెబుతున్నాను. ఆ మాలను ఎలా విస్తరించాలో నాకు తెలియదు. తెలిసినవాళ్ళు చెప్పి పుణ్యం కట్టుకోండి. ఒకప్పుడు తెలుగులో ఇటువంటి మాటకు ముందు తాజాకలం అన్నమాటను చేర్చేవారు. తాజా అగంటే తెలుగుమాట అని అందరూ ఒప్పుకుంటారు. నేను మాత్రం ఒప్పుకోను. తాజా అన్నది అసలుసిసలైన ఉర్దూమాట. దానికి అప్పుడే సిద్ధమైనది, అంటే ఫ్రెః అని అర్థం. ప్రతిరోజూ మధ్యాహ్నం మా ఇంటి ముందుగా సైకిల్‌మీద ఒక అతను సమోసాలు అమ్ముతూ తిరుగుతాడు. ఆయన అమ్మే సమోసాలు ఎప్పుడు తయారైనది తెలియదు. ఎంతసేపుగా అతను ఊరుమీదపడి వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నది కూడా తెలియదు. అతను మాత్రం సాయంత్రందాకా గరంగరం సమోసే, తాజా సమోసే అంటూనే ఉంటాడు. నాకు అక్కడ వ్యాకరణం ఒప్పుకోని ఒక సమాసం తోస్తుంది. మోసముతోకూడినది సమోసము లేదా సమోసా అనిపిస్తుంది. కానీ అది తప్పు, తప్పున్నర. చెప్పింది బాగుంది కానీ తప్పున్నర తరువాత తప్పున్నొకటి కూడా ఉంటుందా? కన్యాశుల్కం నాటకంలో గిరీశం శిష్యుడు వెంకటేశంతో బాటు వాళ్ల ఊరు వెళ్తాడు. అక్కడ ఒక పెద్దాయన గిరీశాన్ని చూచి ఈ తురక ఎవడోయ్ అని అడుగుతాడు. అంటే అతను బహఉశ లాగు, లడాయి వేసుకుని గానీ ఉన్నాడేమో. లాగు అంటే బాగానే ఉంది. కేవలం ప్రాస కలిసింది కదా అని లడాయి అన్నారు తప్పితే లాగుకూ లడాయకీ సంబంధం ఎక్కడిది. లడాయి అంటే తంపులాట, కొట్లాట అని కదా అర్థం. మన దేశంలో కలకాలంగా ఇస్లాము మతానికి చెందిన ముస్లిములు చాలామంది ఉన్నారు. ముసల్మాన్ అనే మాట ఇంగ్లీషులోకి వచ్చి ముస్లుం అయింది. ముసల్మానులలో వేరువేరు దేశాలవారు ఉంటారు. అరేబియా దేశాలకు చెందిన వారు అరబ్బులు, మరికొంతమందిపఠాలు. అదేరకంగా తుర్కిస్తాన్ అని టర్కీకి చెందినవారు తుర్క్‌లు. వారే తురకలు. అంతేగాని అదేదో అవమానకరమైన మాట ఏ మాత్రంకాదు. ఒకప్పుడు నేను మృగనయని అనే టీవీ సీరియల్‌ను తెలుగులోకి మార్చే ప్రయత్నంగా పైలెట్ స్క్రిప్ట్‌ను అనువదించారు. అందులో తుర్క్ దేశంవారు దాడి చేశారు అని అర్థంవచ్చే మాట ఉంది. దాన్నినేను తురకలు దాడిచేశారు అని అనువదించాను. అధికారులకు అది నచ్చలేదు. ముస్లింలలు దాడి చేశారు అని రాయించారు. తురకలు ముస్లింలే కానీ ముసల్మానులు అందరూ తురకలు కాదు అని మనవాళ్ళకు తెలియదు. కన్యాశుల్కం పద్ధతిలో ఆ మాట అదేదో అనకూడనిది అని అందరికీ ఒక అభిప్రాయం.
ఇంతవరకు తురకల భాష ప్రభావం గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నట్లు అనుమానం కలిగింది. మొదట్లో ఇంగ్లీషు మాటలు కూడా కొన్ని అనుకున్నాము. అదేమీ లేకుండా మన తెలుగులోనే మనవాళ్ళకి అర్థం కాని మాటలు కావలసినన్ని ఉన్నాయి, అన్నది అందరూ ఎరిగిన సత్యం. ఒకప్పుడు ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఇంకా ఆంధ్రప్రభ వార పత్రిక ఉండేది. అందులో ఆయన రాసిన కథ ఒకటి వచ్చింది. అది అసలుసిసలైన కళింగాంధ్ర భాషలో వుంది. నేను దాన్ని యాస అనడంలేదన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. మొత్తం కలిపి ఒకే భాష కాదు. ఈమాట ఇలా అంటున్నందుకు నన్ను అందరూ క్షమించండి. ప్రతి ఇరవై కిలోమీటర్లకు తెలుగు నాః అర్థంకాని స్థాయికి మారిపోతుంది. ప్రసాద్‌గారి కథ చాలా ఓపికగా చదివాను. ఇంతకుముందే గణేష్ పాత్రో, రంధి సోమరాజు, రావిశాస్ర్తీ లాంటి మహామహుల రచనలను ఎంతో ఓపికగా చిదివాను. ఆ మాటల మీద వల్లమాలిన అభిమానం పుట్టింది. కనుక విశాఖ వెళ్ళే అవకాశం వచ్చినపుడల్లా అక్కడి వారి మాటలను చాలా జాగ్రత్తగా విన్నాను. హాస్టల్‌లో ఒకసారి ఆ ప్రభావంతో నేను వేసిన ఒక డైలాగ్ విని నా మిత్రుడు ఒకడు నీవు తప్పకుండా కళింగాంధ్ర వాడివి అని నాతో వాదం వేసుకున్నాడు. భాషలోని భేదాలపట్ల నాకున్న ఆసక్తిని చెప్పడానికి మాత్రమే ఈ సంగతులన్నీ ప్రస్తావిస్తాను. మొత్తం ప్రసాద్‌గారితో నేను ఒక ప్రస్తావన చేశాను. ఆయన కథను నేను తెలంగాణ భాషలో రాస్తాను, అన్నాను. అప్పుడది ఇక్కడి వారికి కూడా అర్థం అవుతుంది అన్నాను. హాయిగా నవ్వుకున్నాము తప్పిస్తే ఆ పని మాత్రం జరుగలేదు. దేవరాజు మహారాజు, నందిని సిద్ధారెడ్డి లాంటివాళ్ళు అప్పట్లో తెలంగాణ భాషలో కవితలు, కథలు రాస్తే చాలామందికి అర్థం కాలేదు. నేను ఒక అంతర్జాతీయ బహుమతి పొందిన యూరోపియన్ కథను గ్రామీణ వాతవారణం ప్రతిబింబించాలని కోరికతో తెలంగాణ భాషలో అనువదించి పంపితే ఒకానొక ప్రసిద్ధ పత్రికవాళ్ళు అర్థం కాలేదు అన్నారు. భాష పరిస్థితి ఇలా ఉంటుంది. కిటికీ అన్నమాట యూదులనుండి మనకు వచ్చింది, అనినేను ఇవాళ చెబితే అందరూ ముక్కున వేలు వేసుకుంటరా. మనకు తెలిసింది గవాక్షం. వెనకట మేము తనబ్బీ అనే వాళ్లం. అది అప్పుడు తురకలకు కూడా తెలియదేమో. గవాక్షం అంటే అది సంస్కృతం అసలు తెలుగు మాట ఏమిటి? నాకు తెలియదు.
సాలెపిల్లు శెత్తిరి గుడుమలు అంటే ఏమిటి? ఎవరైనా చెపితే సంతోషిస్తాను. ఎవరైనా చెప్పగలిగితే వాళ్లు తప్పకుండా పాలమూరి వాండ్లే అయ్యుండాలి. సాలె అంటే శాల. అంటే పాఠశాల. అంటే బడి. సాలెకువొయ్యే ఈడొచ్చింది, లేకుంటె యాలయింది అనుడు మాకు అలవాటే. అర్తమవుతది గూడ. గుడ్కంగ అంటే కూడా అనే మాటకు మరొక రూపం ఎర్కేనా, శెత్తిరి అనేది చతురులు నుంచి వచ్చిందేమో అని నా అనుమానం. అంటే తుంటరివారలని భావము. ఇక గుడుమలు అనే మాట నేను మా ఊర్ల ద్ప ఇంక యాడ ఇనలేదు. ఆ మాటకు గూడ తుంటరులనే అర్తము కాదంటే అర్థము. ఇపుడు మ ఊరి వాండ్లకు సుత అంటే కూడా ఈ మాట తెలియకపోవచ్చు.
నేను ఈ తీరున ఎన్ని ముచ్చెట్లయిన చెప్పగలుగుత. చెప్పాలనే నా బాధ గూడ. ఏదో ఒకరకంగా మాటలు కాయింతెం మానికి ఎక్కాలె. అచ్చుతప్పు కానే కాదు. కాయింతెం అంటే కమ్మ. కాగజ్. అపుడు ఆ మాటలు ఎవరికన్న కనవడుతయి. లేదంటె మనుసులల్ల మనుషులల్ల మాయమయిపోతయి. మారు గూడ మాకు దెలిసిన మాటలు చెప్పండి. అందరికి దెలిసెటట్టు వాటి మతలబు ఈడ రాతము. అవి తెలంగన లేకుంటె తెలంగాణ మాటలే కావాలని లేదు. తెలుగులో ఎంత వైవిధ్యం ఉన్నది చెప్పేందుకు ఇదొక ప్రయాస... అంతే.

-కె.బి.గోపాలం