లోకాభిరామం

ఒడుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒడుపు అనే ఈ మాట ఎంత మందికి గుర్తుందో చెప్పలేను. చేతులకు ఈ ఒడుపు ఉంది కనుకనే మనిషి జాతి మిగతా అన్ని జంతువులకన్నా అందులో మిగతా ప్రైమేట్స్ కన్నా చాలా ప్రగతి సాధించగలిగింది. మనిషికి సాంకేతిక నైపుణ్యం చేతనైంది. పనిముట్లు తయారుచేసుకునే శక్తి అలవడింది. పనిముట్లు తయారు చేయాలంటే, ఎంతో ఊహాశక్తి ఉండాలి. అంతకన్నా ముందు చూపు ఉండాలి. చేతి కదలికలను గుర్తుంచుకుని, అందుకు అనువుగా ఉండి పని చేయగల పరికరాలను తయారుచేసుకోవాలి.
చేతి గురించి ఒకసారి ఆలోచిస్తే, దాని నిర్మాణం ఆశ్చర్యానికి కారణం అవుతుంది. మొట్టమొదట, మిగతా నాలుగు వేళ్లకు ఎదురుగా గల ఒక బొటన వేలు ఉంది. పక్షులకు కూడా వీళ్లలో ఈ ఏర్పాటు ఉంటుంది కానీ, కొమ్మలను పట్టుకుని కూర్చోవడానికి మాత్రమే అవి పనికి వస్తాయి. మనిషికి మాత్రం వస్తువులను పట్టుకుని కళ్లకు దగ్గరగా తీసుకువచ్చి, కావలసిన రకంగా తిప్పుతూ, పరిశీలించే శక్తి చేతుల వల్ల వచ్చింది.
చెయ్యి తిరుగుతూ చేసే పనులను ఊహిస్తే, ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని వృత్తులు, కళలు, కార్యక్రమాలు చేతులకు గల ఈ ఒడుపు మీదే ఆధారపడతాయి. ఓపిక చేసుకుని చేతులు చేయగల రకరకాల పనులకు సంబంధించిన చిత్రాలను ఒక చోట పెడితే అది ఒక బ్రహ్మాండమైన డాక్యుమెంటరీకి మెటీరియల్‌గా పనికి వస్తుంది. నాట్యంతో మొదలుపెట్టి, కుమ్మరి సారెతో సాగి, అందరితో మరింత ముందుకు వెళ్లి.. ఎన్ని అని చెప్పడం.
ఇక పరిశీలనకు వీలు కలిగిన తరువాత వస్తువులన్నీ మనిషికి వశం అయిపోతాయి. వాటిని రకరకాలుగా మార్చుకునే శక్తి కూడా ఆ చేతుల కారణంగానే మనిషికి చేతనవుతుంది. చేతనవుతుంది అన్నమాట ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించండి. నాకు ఫలానా పని చేయటం అవుతుంది అంటే, నా చేతులతో ఆ పనిని చేయగలుగుతాను అని కదా అర్థం. నోటితో చేసే పనులకు కూడా ఆ మాటనే వాడుకుంటున్నాం. చెప్పడం చేతనవుతుంది అంటున్నాం. ఆశ్చర్యం కదూ. అది చేతులకు ఉన్న శక్తి. ఇక మెదడు శక్తి గురించి వేరుగా చెప్పనవసరం లేదు. చేతులకు మెదడు శక్తి కూడా తోడైంది అంటే, మనిషి ఎంత దూరమైనా వెళ్లగలుగుతాడు. కాళ్లతో వెళ్లగలిగే దూరం కాదిది. పనిలో ఎంత లోతుకైనా మళ్లగలుగుతాడు అని ఇక్కడ భావం.
సాంకేతిక శాస్త్రం అన్న మరుక్షణం ముందు శరీరం గుర్తుకు రావాలి. ఈ శరీరానికి కావలసిన విషయాలను చేతులతో చేసుకోవడమే సాంకేతిక శాస్త్రం. అందులో మెదడు ప్రభావం చాలావరకు ఉంటుంది. చెప్పేది మెదడు. చేసేది చేతులు. మర మనుష్యులను తయారుచేసే వాళ్లు, మనిషి చేతులను నకలు చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. మామూలుగా చేతికి ఉండే కదలిక శక్తిని రకరకాల కోణాల నుంచి లెక్క వేస్తున్నారు. చేతులు ఎటువైపు ఎన్ని డిగ్రీలు చేయగలుగుతాయి అన్నది వాళ్లు పరిశీలించే మొదటి ప్రశ్న. మనం చేసే పనులు అన్నింటినీ, చేయగలుగుతామా అన్న ఆలోచన లేకుండా చేసి పడేస్తున్నాము. కానీ ఒక పనిలో మనము పడే కష్టాలు, చేసే విన్యాసాలను గురించి ఆలోచిస్తే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. ఊర కలియబెడుతూ ఉంటే చేతులు తిరిగే తీరును ఒకసారి గమనించండి. చిత్రకారుని కుంచె కదలికలను మరొకసారి గమనించండి. నర్తకులు చూపించే భంగిమలు మళ్లీ గమనించండి. అన్నిటిలోనూ పోలికలు కనిపిస్తాయి. కానీ బయటకు వచ్చే ఫలితాలు మాత్రం వేరు. వంట చేయడంలో కూడా నాట్యం ఉంది. అది మీరు సులభంగా చెప్పవచ్చు. భీమ్‌సేన్ జోషిగారు పాడుతూ చేతులు తిప్పే తీరును చూచి, మేము జోకులు వేసుకునేవాళ్లం. ఆయన పిండి పిసికినట్లు చేస్తున్నాడు అనేవాళ్లం. సభలోనూ, మామూలుగా కాదు మాట్లాడుతున్న వాళ్ల చేతుల కదలికలను గమనించండి. అప్పుడు మా జోకులు గుర్తుకు తెచ్చుకోండి. మీకు మరిన్ని జోకులు తప్పకుండా మనసులోకి వస్తాయి.
ఒకతను విపరీతమైన వేగంగా టైప్ చేస్తూ ఉంటాడు. మరొకతను సంగీత వాయిద్యాన్ని మనోహరంగా పని చేస్తుంటాడు. ఇంకొకరు కేవలం నూనెలోకి బజ్జీలు వేస్తుంటారు. అక్కడ కనిపించే ఒడుపు ఆశ్చర్యకరం అంటే అది అవమానం కింద లెక్క. చంద్రశేఖర్ అని ఒక స్పిన్ బౌలర్ ఉండేవాడు. అతడి మణికట్టులో ఏదో లోపం ఉండేది. కానీ దాన్ని వాడుకుని అసలు బౌలింగ్‌లో తీరు ప్రదర్శించేవాడు. బ్యాటరీలు ఉన్నచోటనే ఒక్కసారిగా తిప్పి బంతిని బౌండరీ దాకా పరిగెత్తించే మేటి బాట్స్‌మన్ ఎందరో ఉన్నారు. బల్లా ఘమాయా అంటాడు కామెంటేటర్ సులభంగా. కానీ బ్యాట్ తిప్పిన మాత్రం ఊహకు అందకుండా ఉంటుంది.
చేతిలో కండరాలు ఉన్నాయి. వేళల్లోనూ కండరాలు ఉంటాయి. మణికట్టులో ఎముకలు ఉన్నాయి. అన్నీ కలిసి విచిత్రాలు చేస్తాయి. విచిత్రాలను చేయించడానికి మెదడు ఉంది. చేసేందుకు చేతులు ఉన్నాయి.
తెలివిగా వాడుకునేందుకు మనిషి పరికరాలు తయారు చేసుకుంటాడు. అయితే రెండవ స్థానమైన మెదడు, పరికరాలు కలిసి పని చేసే పద్ధతి మాత్రం సులభంగా అర్థం కాదు. అవే బ్రష్‌లు, అవే రంగులు ఇచ్చినా అందరూ ఒకే రకం బొమ్మ వేయలేరు. కొందరు అసలు బొమ్మ వేయడం రాదంటారు. ప్రయత్నించినా వారు వేయలేరు. మెదడు పనిముట్లు, తెలివి మధ్యగల సంబంధం గురించి బోలెడన్ని పరిశోధనలు జరిగాయి. పరిశీలనలు జరిగాయి. బ్యూరో సైన్స్ అన్నవి ఈ మధ్యనే వచ్చిన పరిశోధన రంగం. మెదడులో ఉండే కణాలు కొన్ని ఆలోచనకు ఆధారం. మరికొన్ని ఆచరణకు ఆధారం. బహుశా కొన్ని రెండింటికీ ఆధారం అవుతాయి. ఇది మామూలుగా అర్థమయ్యే సంగతి కాదు. మనిషి మెదడు విప్పదీసి, ఆ మనిషి మాట్లాడుతూ ఉంటే పరిశీలించడం వేరే విషయం కాదు. ఈ మధ్యన అలా పరిశీలించి పరిశీలించడానికి పరికరాలు వచ్చాయి. పరికరాలను వాడి పరికరాల వాడకం గురించి పరిశోధనలు చేయాలి. చేస్తున్నారు కూడా. బిహేవియరల్ సైకాలజీ అని ఒక రంగం తయారైంది. ప్రవర్తన వెనుక మనస్తత్వం అది తెలుగులో, కాదంటే సంస్కృతంలో చెప్పుకోవచ్చు. చేతులను కాసేపు వెంటబెట్టుకుని, మనము మెదడులోకి తగ్గుతూ చూడవలసిన సమయం వచ్చింది.
మెదడు పరిమాణం మొట్టమొదటి విషయం. దాని చిక్కదనం రెండవ విషయం. అందులో ఉండే న్యూరాన్ కణాలు మూడవ విషయం. ఇదేదో చాయ్ బ్రాండ్ ప్రకటనలాగా ఈ మూడు కలిస్తే కానీ మెదడు పని జరగదు. మూడూ ముఖ్యమైన విషయాలే. మూడూ సమానంగా ఉండవలసిందే. ఏదో ఒకటి ముందు ఉండి పని జరిపిస్తుంది అనుకుంటే లాభం లేదు. మెదడు ఎంత పెద్దగా ఉంటే అంత గొప్పది అనిపించవచ్చు. మొత్తం శరీరంతో పోలిస్తే మెదడు ఉండే పరిమాణాన్ని లెక్కవేసే పద్ధతులు ఉన్నాయి. పరిణామ క్రమంలో జంతువుల మెదడులో అవసరం కొద్దీ పెరుగుతూ తగ్గుతూ పోయాయి. అందులో ఒక క్రమం మాత్రం కనిపించలేదు. తిమింగలాలకు పెద్ద మెదడు ఉంటుంది. అంటే చిన్న మెదడు కూడా ఉంటుందని కాదు. మెదడు చాలా పెద్దదిగా ఉంటుందని అర్థం. అయిన వాటికి మనిషికి ఉన్న తీరు తెలివి లేదు. అవును మరి, తిమింగలాలకు చేతులు లేవుగా.
మెదడులోకి వచ్చిన కథ మాత్రం చేతులు వెంటనే తిరుగుతున్నది అన్నమాట. చేతులు లేకుంటే మెదడు ఎంత ఉన్నా లాభం లేదు అని వేరుగా చెప్పనవసరం లేదు. మళ్లీ ఒకసారి చేతులు, పనిముట్లు లేదా పరికరాలు, వాటి తయారీ గురించి ఆలోచిస్తే ఇవన్నీ మనిషికి ఎలా వీలయ్యాయి అన్నది ప్రశ్న. అదృష్టం, అన్నది జవాబుగా అంగీకారయోగ్యం అవుతుందా. చుట్టుపక్కల వాతావరణం అనుకూలంగా ఉండేది. పరిణామం కూడా అన్ని విషయాలను గుర్తించింది. పరిణామం అన్నది ఆ పక్కన ఎక్కడో నిలబడి మనిషి ఇక్కడి దాకా తేలేదు. శరీరాలు అవసరం కొద్దీ మారుతూ పోయాయి. దాని పేరే పరిణామం. కూర కలియ బెట్టడం మొదటి రోజుల నుండి జరిగి ఉంటుంది. క్రికెట్‌లో గూగ్లీ వేయడం మాత్రం నిన్న మొన్న మొదలైంది. ఈ రెంటి వెనుక చేతుల నైపుణ్యం నిలబడి ఉంది. ఇందులో న్యాచురల్ సెలెక్షన్ అన్న పద్ధతి అమలైంది. క్రికెట్ గురించి హిందీలో ఒక సినిమా వచ్చింది. అందులో ఈ రకమైన అంశాన్ని చాలా బాగా చూపిస్తారు. క్రికెట్ అంటే ఏమిటో కూడా తెలియని ఒక అబ్బాయి బంతి విసురుతాడు. అతను విసిరిన తీరు క్రికెటర్లు అందరూ ఆశించే రకంగా ఉంటుంది. అ అబ్బాయిని కూడా ఆడిస్తారు. చేతుల తీరు ఆ రకంగా ఉంటుంది. ఇక అవసరం కొద్దీ చేతికి ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఆ అవసరానికి అనుగుణంగా చేతులు మారాయి. అంటే అభివృద్ధి చెందాయి. చేతులు మారడం అన్న మాటకు ఈ మధ్యన మరొక అర్థం వస్తుంది. ఇక్కడ ఆ ప్రసక్తి లేదు. పరిణామం చేతులు మారలేదు. చేతులను మార్చింది. చాలా జంతువులు పక్షులు కూడా పరికరాలను వాడుకుంటాయి.
జేన్ గుడాల్ ఆఫ్రికా అడవుల్లో తిరిగి తిరిగి చింపాంజీలు పరికరాలను వాడే పద్ధతులను గమనించింది. ఎలుగుబంటి కర్రపుల్లలు బుట్టలో దూర్చి చీమలు తింటుంది అని గమనించారు. అయితే వాటిలో మనిషి చేతికి ఉన్న రకం ఒడుపు మాఅతం లేదు. వాటి విషయంలో పరికరాలు వాడటం చాలా మామూలుగా జరిగింది. మనిషి విషయంలో మాత్రం ఒడుపు ఏర్పడింది. మెదడు, చేతులు సమాంతరంగా మారుతూ వచ్చాయి. ఒక దానికి అనుగుణంగా ఒకటి మారుతూ వచ్చాయి. మొత్తానికి మనిషికి సౌకర్యం దొరికింది. ఒడుపు దొరికింది. మొదట్లో కేవలం కర్రలు బరిసెలు వాడుకున్నారు. తరువాత రాళ్లను పగలగొట్టి కావలసిన పరికరాలు, ఆయుధాలు తయారుచేసుకున్నారు. ఇప్పుడు రాళ్లను పరికరాల కోసం కాకుండా విగ్రహాల కోసం మలుస్తున్నారు. మహా నిర్మాణాల కోసం మలుస్తున్నారు. ఆశ్చర్యం కలిగించే ఎత్తులకు నదుల మీద ఆనకట్టలు కడుతున్నారు. నీళ్లను నిలబెడుతున్నారు. పంటలు పండిస్తున్నారు. అంతా సాంకేతిక శాస్త్రం. అంతా చేతి లాఘవం.

-కె.బి.గోపాలం