జాతీయ వార్తలు

లోకసభ కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: లోకసభలో పలువురు సభ్యులు మాట్లాడారు. వాటి వివరాలు. బీజేపీ ఎంపీ హేమమాలిని మాట్లాడుతూ ప్రధాని మోదీ వల్లనే మహిళా సాధికారిత సాధ్యం అని అన్నారు. మహిళల సాధికారిత కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అన్నారు. బిజేపీని గెలిపించిన ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పరిశ్రమలోనూ మహిళలు ఉన్నారని, బ్యాంకులను సైతం మహిళలు నడుపుతున్నారని అన్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వక పోవటం వల్ల ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ తుడుచుకుపెట్టుకుపోయిందని అన్నారు. హోదా సాధించలేక పోవటం వల్ల ప్రజలు టీడీపీని తిరస్కరించారని, హోదా సాధించాల్సిన బాధ్యత వైకాపాపై ఉందని అన్నారు. మంగళగిరలో ఎయిమ్స్ నిర్మాణం 2020 సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. వైకాపా సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి 1615 కోట్ల రూపాయలు మంజూరు చేయటం జరిగిందని, ఇప్పటి వరకు 385.54 కోట్లు ఖర్చు చేయటం జరిగిందని, అంచనాలు పెంచే అవకాశం లేదని, పనులు సక్రమంగా జరుగుతున్నాయని తెలిపారు.