మెదక్

ముగిసిన ఉపసంహరణల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జనవరి 21: హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ పాలక మండలి ఎన్నికల ప్రచారం నేటి నుంచి జోరందుకోనుంది. మెదక్ జిల్లాలోని పటన్‌చెరు, రామచంద్రాపూర్, భారతీనగర్ వార్డులు జిహెచ్‌ఎంసిలో అంతర్భాగం కావడంతో ఈ మూడు వార్డుల్లో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్, టిడిపి, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐ, బిఎస్‌పి పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు రంగంలోకి దిగి తమ రాజకీయ భవిషత్తును పరీక్షించుకోవడానికి ఓటర్ల ముందుకు వెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్న పటన్‌చెరు వార్డులో పోటీ రసవత్తరంగా మారనుందని రాజకీయ విశే్లషకులు పేర్కొంటున్నారు. టిడిపి, బిజెపిల మద్య పొత్తు ఉన్నప్పటికీ పటన్‌చెరు, భారతీనగర్ వార్డుల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో రెండు పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. వచ్చే నెల 2వ తేదీన జరగనున్న ఎన్నికలో ఓటర్లు ఎవరికి మద్దతు పలుకుతారన్న ఉత్కంఠ ప్రధాన పార్టీల అభ్యర్థులను వెంటాడుతుండగా స్వతంత్రంగా బరిలోకి దిగిన అభ్యర్థులు ఎవరి ఓట్లను కొల్లగొడుతారోనన్న మరో భవం వెంటాడుతుంది. మూడు వార్డుల్లో స్థానికేతరుల ఓట్లు అధికంగా ఉండటంతో వారి మద్దతు ఎవరికి లభిస్తుందో రాజకీయ విశే్లషకులు సైతం అంచనా వేయలేకపోతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జనరల్ మహిళ స్థానమైన 111 భారతీనగర్ వార్డుకు ఏకంగా తొమ్మిది మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలువడంతో పాటు ఎంఐఎం కూడా అభ్యర్థిని పోటీకి దింపడంతో ప్రచారం రసకందాయకంగా కొనసాగనుంది. టిడిపి పార్టీకి చెందిన ఇద్దరు మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండటంతో బిజెపి అభ్యర్థిని సంకట పరిస్థితుల్లోకి నెడుతోంది. ఇంటింటి ప్రచారంతో అభ్యర్థులు లేచిందే తడువుగా ఓటర్ల ముందుకు వెళ్లి ప్రసన్నం చేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల బాధ్యతలను తన భుజస్కందాలపై వేసుకున్న పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించడానికి రానున్నారు. మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ ఎం.్భపాల్‌రెడ్డి స్థానిక నాయకుడు కావడం, అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలు పుష్కళంగా ఉన్న టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులకు రెబల్స్ బెడద లేకపోవడంతో తలనొప్పి లేకుండా ప్రచారం కొనసాగించుకునే అవకాశం లభిస్తోంది. పటన్‌చెరు వార్డుపై గంపెడు ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి బిజెపి అభ్యర్థి దేవేందర్ రాజు రంగంలోకి దిగడంతో ఇబ్బందికరంగా మారుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు వార్డులకు కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో మిగులగా పాలక మండలికి ఎన్నికయ్యేది ముగ్గురే కావడంతో ఓడిపోయే 25 మంది ఎవరో ఫిబ్రవరి 5వ తేదీన తేలిపోనుంది.
అయనప్పటికీ గెలుస్తామనే ధీమాతో ఎవరికి వారే ప్రచారం నిర్వహించుకుంటూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అదృష్ట లక్ష్మి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. 22వ తేదీ నుంచి ప్రచారం ఊపందుకోనున్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు రోజుకో రకంగా ప్రచారాన్ని నిర్వహించనున్నారు.