జాతీయ వార్తలు

మేక్ ఇన్ ఇండియాలో భారీ అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 14: రాజకీయ, సినీ ప్రముఖులు హాజరైన ‘మేక్ ఇన్ ఇండియా’ సాంస్కృతిక కార్యక్రమంలో ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ముంబయిలోని నదీతీరంలో ఉన్న గిర్‌గౌమ్ చౌపాటి వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ముఖ్యమంత్రి ఫడ్నవీస్, సినీ నటులు అమితాబ్, హేమమాలిని, అమీర్ ఖాన్ ప్రభృతులు హాజరయ్యారు. ఓ నృత్య కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగి పెను మంటలు వ్యాపించడంతో వేదిక పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి కొద్ది క్షణాల ముందే అమితాబ్ వేదిక దిగారు. ప్రమాద సమయంలో దాదాపు 500మంది కళాకారులు వేదిక వెనుక భాగంలోనే ఉన్నారు. మొత్తం 5వేల మందికి పైగా ఈ సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైనట్టు అంచనా. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నప్పటికీ..అసలు కారణం ఏమిటన్నది తెలియలేదు. చెక్కలతో నిర్మించిన వేదిక అడుగు భాగం నుంచే మంటలు మొదలయ్యాయని చెబుతున్నారు. నృత్య ప్రదర్శన చేస్తున్న సమయంలోనే అగ్ని ప్రమాదం జరిగిందని, గాలి కూడా తీవ్రంగా ఉండటం వల్ల మంటలు పూర్తిగా వ్యాపించాయని, మొత్తం వేదిక తగులబడి పోయిందని అధికార వర్గాలు తెలిపాయి. తక్షణమే భారీ ఎత్తున అగ్ని మాపక దళాలను రంగంలోకి దింపడం వల్ల మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చాయని, ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ జరుగలేదని వెల్లడించాయి. అగ్ని ప్రమాదం ఒక్కసారిగా పెనుమంటలకు దారితీయడంతో హుటాహుటిన పధ్నాలుగు అగ్నిమాపక దళాలను, పదికిపైగా వాటర్ ట్యాంకులను తెప్పించిన వివరించాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రముఖులను తరలించినప్పటికీ ముఖ్యమంత్రి ఫద్నవీస్ అక్కడే ఉండి సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. ప్రమాద కారణాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ‘అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు’అని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన వారిలో హేమమాలిని, అమీర్ ఖాన్, కత్రీనా కైఫ్, ఉద్ధవ్ థాక్రే తదితరులు ఉన్నారు. భారత దేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో తిరుగులేని తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై చర్చించేందుకు మేక్ ఇన్ ఇండియా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశం నలుమూలల నుంచి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.