జాతీయ వార్తలు
అరెస్టు చేసినా డబ్బులు రాలవు: మాల్యా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 29 April 2016
లండన్: తనను అప్రతిష్టపాలు చేసేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, తనను అరెస్టు చేసి స్వదేశానికి తీసుకువెళ్లినా తన నుంచి డబ్బులు మాత్రం రాబట్టలేరని లండన్‌లో ఉంటున్న కింగ్‌ఫిషర్ యజమాని విజయ్ మాల్యా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మాల్యాను తమకు అప్పగించాలని లండన్‌లోని భారత రాయబారి కార్యాలయం ద్వారా బ్రిటన్ సర్కారుకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో మాల్యా తన నిర్ణయాన్ని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తన పాస్‌పోర్టును రద్దు చేసినా, అరెస్టు చేసినా తాను డబ్బులు చెల్లించడం అసాధ్యమన్నారు. తనకు దేశభక్తి ఉన్నా, ఇపుడు మాత్రం భారత్‌కు రాలేనన్నారు. 11 బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రూపాయల రుణాలను ఆయన ఎగవేసిన సంగతి తెలిసిందే.