జాతీయ వార్తలు

ప్రముఖ రచయిత్రి మహాశ్వేతాదేవి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత : ప్రముఖ రచయిత్రి పద్మ విభూషణ్ మహాశ్వేతాదేవి(90) కోల్‌కతలో గురువారం కన్నుమూశారు. 1926లో ఢాకాలో పుట్టిన మహాశ్వేతాదేవి కోల్‌కతలో రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన విశ్వభారతి యూనివర్సిటీలో బిఏ చదివారు. కోల్‌కత యూనివర్సిటీలో ఎంఏ చదివారు. 1964లో బిజోయ్‌గఢ్ కాలేజిలో బోధన ప్రారంభించారు. విద్యాభ్యాసం తర్వాత మహాశ్వేతాదేవి ప్రముఖ నాటక రచయిత, నటుడు బిజోన్ భట్టాచార్యను వివాహమాడారు. సామాజిక కార్యకర్తగా బీహార్, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనుల్లో చైతన్యం కోసం ఆమె ఉద్యమించారు. కేంద్ర ప్రభుత్వం మహాశ్వేతా దేవిని పద్మ విభూషణ్ అవార్డుతో2006లో సత్కరించింది. మహాశ్వేతా దేవి రచనల ఆధారంగా బాలీవుడ్‌లో రుడాలి, హజార్ చౌరాసీ కీ మా, మాటీ మాయ్, గంగోర్ వంటి సినిమాలు వచ్చాయి.