జాతీయ వార్తలు
ఆహ్వాన పత్రమే అదుర్స్! అదిరిని ఎల్ఇడి శుభలేఖ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బెంగళూరు, అక్టోబర్ 19: కర్నాటక మాజీ మంత్రి, మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహ శుభలేఖ హాట్‌టాపిక్ అయింది. బెంగళూరులో జరిగే కూతురు వివాహానికి ఆహ్వానిస్తూ అదిరిపోయే పెళ్లికార్డు వేయించారు. అది అలాంటి ఇలాంటి వివాహ ఆహ్వానపత్రిక మాత్రం కాదు. బ్రహ్మణి వివాహం నవంబర్ 16 రాజీవ్‌రెడ్డితో జరుగబోతున్నదంటూ ప్రచురించిన శుభలేఖను ఒక బాక్స్‌లో ఉంచారు. బాక్స్ తెరవగానే పైభాగంలో అమర్చిన ఎల్సిడి స్క్రీన్‌పై గాలి వారి పెళ్లి పాట మొదలవుతుంది. నిముషం నిడివిగల ఆ వీడియోలో ‘అతిథి దేవోభవ’అంటూ జనార్దన్‌రెడ్డి, ఆయన భార్య, కుమారుడుతో పాటు వధూవరులు కనిపిస్తారు. పెళ్లి అదిరిపోయేలా జరిపించాలని భావించిన మైనింగ్ కింగ్ గాలి శుభలేఖ దగ్గర నుంచి అన్నీ స్వయంగా చూసుకుంటున్నారు.