ఉత్తరాయణం

ఎక్కడుంది నిష్పాక్షికత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జవహర్‌లాల్ యూనివర్శిటీ, హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ, శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో ఇటీవల చోటు చేసుకున్న సంఘటనలను అనుసంధానిస్తున్న అంశం ఏమై ఉంటుంది? రాజ్యాంగంపై వల్లమాలిన ప్రేమతో కాకుండా సరైన దృక్కోణంలోంచి చూసిన వారికి అదేమిటో ఇట్టే బోధపడుతుంది. నిరసన తెలియజేసే హక్కు, విభేదించే హక్కుల ముసుగులో ఈ విశ్వవిద్యాలయాలు జాతి వ్యతిరేక శక్తులకు నిలయాలుగా మారుతున్నాయి. ఈ వర్శిటీల్లో జరిగిన సంఘటనలకు కొద్దిమంది విద్యార్థులే కారణం కావచ్చు. కానీ ఈ సంఘటనలు మాత్రం మీడియాను, ప్రజాభిప్రాయాన్నీ శాసిస్తున్నాయి. ఇప్పుడు ఏదైనా ఆటలో భారత్ ఓడిపోతే సంతోషంతో కేరింతలు కొట్టడం, వందలాది భారతీయుల జీవితాలను బలిగొన్న ముష్కర ఉగ్రవాదులకు నివాళులు అర్పించడం కూడా హక్కులుగా మారిపోయాయి. యాకూబ్ మెమన్, అఫ్జల్ గురు, మక్బూల్ భట్ వంటివారిని అమరవీరులుగా కీర్తించే పరిస్థితి ఏర్పడింది. ఐపిఎల్ టి-20మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోవడం...శ్రీనగర్ నిట్ విద్యార్థులు పండుగ చేసుకునేందుకు కారణమైంది! ఇలాంటి ఉదంతాలు ఎలాంటి సందేశాన్ని అందిస్తున్నాయి? భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్న స్లీపర్ సెల్స్, భారత్‌ను ముక్కలు చెక్కలు చేసేందుకు కాపు కాసిన దుష్ట పన్నగాలు...అవకాశం వస్తే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయని!
అయితే మిగిలిన వాటితో పోల్చినప్పుడు శ్రీనగర్ నిట్ సంఘటనకు ఒక పెద్ద తేడా కనిపిస్తోంది. ఇక్కడ జాతీయ వాద విద్యార్థులు, జాతివ్యతిరేక శక్తులను నిరసిస్తూ తమ గళాన్ని వినిపించారు! త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ ‘‘్భరత్ మాతాకీ జై’’ అంటూ నినదించారు! అదే మిగిలిన విశ్వవిద్యాలయాల్లో జాతి వ్యతిరేక కార్యకలాపాలు చోటుచేసుకున్నపుడు వాటికి వ్యతిరేకంగా నోరు మెదిపిన వారు లేరు. అంటే అక్కడంతా ‘వన్ వే ట్రాఫిక్’ మాత్రమే! జరుగుతున్న వాటిని వ్యతిరేకించే సంఘటనలపై సమాచారం బయటకు వచ్చే అవకాశమే లేదు. హిందూ సమాజాన్ని కులాల పరంగా ముక్కలు చేయాలని, దళితులను మెజారిటి సమాజం నుంచి వేరు చేయాలన్న నిగూఢమైన అజెండాతో ‘‘ప్రజా మేధావులు’’ చెప్పే మాటలకు మీడియా కళ్లుమూసుకొని ప్రచారం కల్పిస్తున్నది.
మరో పెద్ద తేడా ఏమంటే, ఏ రాజకీయ పార్టీకి చెందిన నేతలెవరూ సంఘీభావం ప్రకటించడానికి ఉరుకులు పరుగుల మీద శ్రీనగర్‌కు వెళ్లలేదు. మరి వారెందుకు ఈ పని చేయలేదు? ఎందుకంటే ఇది దళితులు, దళిత వ్యతిరేకుల మధ్య కొనసాగుతున్న సమస్య కాదు, అశాంతిని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి! అది ముస్లిం, ముస్లిమేతరుల మధ్య సంఘర్షణ. మరి దీనికి మీడియా మతం రంగు పులమలేదు. ‘‘ఒక వర్గం వారు’’ ‘‘మరొక వర్గం వారిపై’’ అంటూ అతి మామూలుగా ప్రసారం చేయడం నిజంగా నయవంచన! ఇక్కడ కాశ్మీరేతర విద్యార్థులకు (హిందువులకు) మద్దతునివ్వడం ‘సెక్యులర్’ కాజాలదు. ఇదే సమయంలో కాశ్మీర్ విద్యార్థులకు (ముస్లింలకు) మద్దతివ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే వేర్పాటువాదులకు మద్దతిస్తున్నదన్న అపప్రధ మూటకట్టుకోవాల్సి వస్తుంది. పోనీ విపరీత ప్రాచుర్యం కల్పించడానికి కన్హయ్యకుమార్ వంటి వారు లేరు! ఈ సందిగ్ధమే మీడియా, వారం రోజులుగా శ్రీనగర్‌లో రగులుతున్న అసంతృప్తికి ప్రాధాన్యతనివ్వడంలో విఫలం కావడానికి ప్రధాన కారణం.
జెఎన్‌యు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లలో సంఘర్షణలు చోటు చేసుకున్న తక్షణమే వివిధ పార్టీల రాజకీయ నాయకులు అక్కడకు క్యూలు కట్టిన సంగతి పాఠకులకు గుర్తుండే ఉంటుంది. ముంబైలోని ‘డంపింగ్ గ్రౌండ్స్’కు లేదా హైదరాబాద్‌కు రెండుసార్లు లేదా వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి టూర్లు వేయడానికి రాహుల్ బాబుకు తీరుబడి చిక్కింది కాని, శ్రీనగర్‌ను సందర్శించడం ప్రస్తుతం అత్యవసరమన్న ఆలోచనే రాలేదు!
వాస్తవానికి శ్రీనగర్‌లో జరిగిందేమిటో ఇప్పుడు ఒక్కసారి పరిశీలిద్దాం. దీన్ని ప్రధాన స్రవంతి మీడియా పట్టించుకోలేదు. ఎందుకంటే తాము ప్రసారం చేసే కథనాలకు శ్రీనగర్ సంఘటన ఏమాత్రం అనువైంది కాదు. అయితే కొన్ని మీడియా పోర్టల్స్ మాత్రం శ్రీనగర్ క్యాంపస్‌కు వెళ్లి ప్రత్యక్ష సాక్షుల ద్వారా ప్రసారం చేసిన కథనాలు అక్కడి ఘోర పరిస్థితిని కళ్లకు కట్టాయి. అవేంటో చూద్దాం.
మార్చి 31న నిట్‌కు చెందిన ముస్లిం విద్యార్థులు ఒక ఊరేగింపు జరిపారు. మరి ఈ సంబరాలు జరుపుకోవడానికి కారణం, వెస్టిండీస్ చేతిలో భారత్ పరాజయం పాలుకావడం! మరి వారు కేవలం ‘సంబరాలు’ జరుపుకోవడానికే పరిమితమయ్యారా? జెఎన్‌యు స్ఫూర్తితో ‘‘్భరత్‌ను ముక్కలు చేస్తాం, ఇషా అల్లా, ఇషా అల్లా’’ అని మాత్రమే కాకుండా ‘‘జీయే జీయే పాకిస్తాన్, పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్’’ వంటి నినాదాలు కూడా ఇచ్చారు. ఇది కాశ్మీరేతర విద్యార్థులతో వీరికి తీవ్రస్థాయి వాగ్వివాదానికి దారితీసింది. ఈ వాగ్వివాదాలు జరిగిన కొద్ది గంటల్లోనే, బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి చొరబడి ఇండస్ హాస్టల్‌పై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. ఈ హాస్టళ్లు కేవలం కాశ్మీరేతర విద్యార్థులు ఉండేవి. రాళ్ల దెబ్బలకు చాలామంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. కాశ్మీరీ విద్యార్థులు అల్లరి మూకలకు ఉప్పందించడంతోనే ఈ ‘‘పత్తర్‌బాజీ’ మొదలైందని అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1న, రాళ్లదాడికి గురైన విద్యార్థులు, రాత్రి జరిగిన సంఘటనలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. ఆవిధంగా విద్యార్థులు గుమికూడిన కొద్ది సేపటికే బయటనుంచి పెద్ద సంఖ్యలో మూకలు క్యాంపస్‌లోకి చొరబడి తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడ్డాయి. ‘‘్భరతీయులకు బుద్ధి చెప్పండి’’ అంటూ ఆ గుంపులోనినాదాలు వినిపించాయి.
ఈ భౌతిక దాడికి కాశ్మీరేతర విద్యార్థులు భయపడలేదు. వారు వెంటనే జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించారు. తర్వాత వారు డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేశారు. అక్కడ వారికి జమ్మూకశ్మీర్ పోలీసులతో పాటు కొందరు స్థానిక విద్యార్థులు, స్థానికులు పాకిస్తాన్ పతాకాన్ని పట్టుకొని , పాక్ అనుకూల నినాదాలు చేస్తూ కనిపించారు. దీనికి ప్రతిగా కాశ్మీరేతర విద్యార్థులు ‘‘్భరత్ మాతా కీ జై’’ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో జమ్మూకశ్మీర్ పోలీసులు ఒక్కసారిగా లాఠీచార్జ్ చేసి, భాష్పవాయు ప్రయోగం జరిపారు. పూర్తి అశాంతితో నిండిన వాతావరణంలో డైరెక్టర్, బోధనా సిబ్బంది కేవలం వౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. కాని ఇదే సమయంలో కొందరు స్థానిక టీచర్లు కాశ్మీరేతర విద్యార్థులను బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ‘‘ఈవిధంగా చేస్తే మీరు పరీక్షల్లో పాస్ కారు’’ అంటూ వారు విద్యార్థులను బెదిరించారు. ‘‘మేం మీ ఫోటోలు, వీడియోలు చూశాం, అందులో ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరు’’, ఇవీ కొందరు టీచర్లు చేసిన హెచ్చరికలు. నిజానికి ఒక బాధిత విద్యార్థి చెప్పినదాన్నిబట్టి చూస్తే, రాళ్లు విసిరిన వారిలో ఒక టీచర్ కూడా ఉన్నాడు. ఇంతకంటె దౌర్భాగ్యం మరోటి ఉంటుందా?‘‘మీలో ఎవరినైనా రేప్ చేస్తే మిగతావాళ్లు నోరుమూసుకుంటారు’’, ఇదీ ఒక కాశ్మీరీ విద్యార్థి, స్థానికేతర నిట్ విద్యార్థినిని బెదిరించిన తీరు!
రోతపుట్టించే ఈ ఎపిసోడ్‌పై భాజపా స్పందన ఏమిటి? అనుపమ్ ఖేర్ తప్ప మిగిలిన నాయకులెవ్వరూ స్థానికేతర విద్యార్థులను పరామర్శించిన పాపాన పోలేదు. మాటిమాటికి ఆగ్రహంతో ఊగిపోయే మానవ వనరుల శాఖ మంత్రిణి స్మృతి ఇరానీ, నిట్ చాయలకు వెళ్లలేదు. పిడిపితో కలిసి జమ్మూ కశ్మీర్‌లో అధికారాన్ని పంచుకోవడం వల్ల భాజపా నేతలు నోరు కట్టేసుకుని కూర్చున్నారు. ఇక జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ‘‘ఒకపక్క దయ్యం మరొపక్క సముద్రం’’ అన్న రీతిలో చిక్కుబడిపోయారు. సైద్ధాంతిక ముసుగులో యాంకర్లు ఈ సందిగ్ధ పరిస్థితిని దుర్బుద్ధితో వీక్షించడం మొదలుపెట్టారు. కేవలం సోషల్ మీడియాలో గగ్గోలు పుట్టిన తర్వాత మాత్రమే ఎంఎస్‌ఎం, శ్రీనగర్ నిట్‌లో చోటు చేసుకున్న అశాంతిని గుర్తించడం గమనార్హం.
ఇది మన ప్రధాన స్రవంతి మీడియాకు కొత్త కాదు. మెజారిటీలను ‘బాద’డానికి వీల్లేనప్పుడు, ముస్లింల ప్రయోజనాలంటూ, సెక్యులరిజంను భుజాలపై మోయడానికి వీలుకానప్పుడు ప్రధాన స్రవంతి మీడియా వ్యవహారశైలి ఈవిధంగానే ఉంటుంది. ఇదీ దాని పనితీరు! వికాసపురికి చెందిన ఒక డెంటిస్టును ముస్లింలు దారుణంగా హతమార్చారు. ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న వ్యక్తికి క్రికెట్ బాల్ తగలడం ఆయన హత్యకు దారితీసింది. నిజానికి అది చాలా చిన్న గొడవ! అయితే ఈ హత్యకేసులో మీడియా, పోలీసులు వ్యవహరించిన తీరు విచిత్రం! డాక్టర్‌పై దాడి చేసినవారిలో కేవలం ముస్లింలు మాత్రమే లేరట! హిందువులు కూడా ఉన్నారట! ఇంతకన్నా ఘోరమైన అబద్ధం మరొకటి లేదు. దీన్ని చూసిన తర్వాత నిష్పాక్షికంగా ఆలోచించే చాలామంది దాద్రిలో ఒక ముస్లిం హత్యకు గురైనప్పుడు జరిగిన గందరగోళాన్ని ఒక్కసారి గుర్తు చేసుకొని ఉంటారు. మరి హత్యకు గురైన డెంటిస్టు ముస్లిం అయి ఉండినట్లయితే దాద్రి సంఘటన కంటే మరింత తీవ్రస్థాయిలో మీడియా విరుచుకుపడి ఉండేది. అందువల్ల జాతీయ టెలివిజన్ ఛానళ్లలో నిష్పాక్షికత వ్యక్తమవుతుందని భావించడం నిరర్ధకం.