జాతీయ వార్తలు

భారత్‌కు తిరిగి రావడానికి.. ఇది సరైన సమయం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే నేరస్థుడనే ముద్ర వేశారు
నా వాదన వినిపించే నిష్పాక్షిక అవకాశం
దొరుకుతుందని భావించడం లేదు
అందుకే రావాలంటే భయమేస్తోంది
ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో విజయ్ మాల్యా

న్యూఢిల్లీ/లండన్, మార్చి 13: బ్యాంకులు అన్ని అంశాలను మదింపు వేసుకున్న తరువాతే తనకు రుణాలు ఇచ్చాయని లిక్కర్ డాన్ విజయ్ మాల్యా వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి భారీగా తీసుకున్న రుణాలను ఎగవేయడంతోపాటు మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న మాల్యాను అదుపులోకి తీసుకోవడానికి భారత్‌లో దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న మాల్యా ఆదివారం ‘సండే గార్డియన్’కు ఇచ్చిన ఒక ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో తాను దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం లేదని, అయితే వ్యక్తిగత పనుల మీద దేశం వదలి బయటకు వచ్చానని తెలిపారు. భారత్‌లో ఇప్పటికే తనపై నేరస్థుడిగా ముద్ర వేశారని, అందువల్ల తిరిగి రావడానికి ఇది సరయిన సమయం కాదని తాను భావిస్తున్నానని ఆయన వెల్లడించారు. ‘గత సంవత్సరం నాకు వ్యతిరేకంగా లుక్‌ఔట్ నోటీసు జారీ అయింది. అయినా నేను తప్పించుకోలేదు. ఇప్పుడెందుకు నాపై నేరస్థుడనే ముద్ర వేశారు. రుణాలను సకాలంలో చెల్లించకపోవడం అనేది వ్యాపారానికి సంబంధించిన అంశం. బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందే ఆ రుణాలు తిరిగి రాకపోయే ప్రమాదం ఉందనే విషయం వాటికి తెలుసు. మేము తిరిగి చెల్లించకపోయే అవకాశం ఉందని తెలిసీ వారు రుణాలు ఇవ్వడానికి నిర్ణయించారు. అప్పుడు మా వ్యాపారం బాగా వృద్ధి చెందసాగింది. అకస్మాత్తుగా దిగజారింది. అందువల్ల నన్ను విలన్‌ను చేయొద్దు. నాకు సదుద్దేశమే ఉంది. నా వ్యాఖ్యలు వక్రీకరణకు గురవుతాయని మాట్లాడకుండా ఉన్నాను’ అని మాల్యా అన్నారు. తానూ బాధితుడినే అయ్యానని వ్యాఖ్యానించిన మాల్యా కొంతమందిని తనకు వ్యతిరేకంగా ఎగదోస్తున్న పెద్ద అజెండా సాగుతోందని ఆరోపించారు. భారత్‌కు తిరిగి రావాలని అనుకున్నానని, అయితే తనపై ఇదివరకే నేరస్థుడిగా ముద్ర పడినందున, తన వాదనను వినిపించేందుకు తనకు నిష్పాక్షికమైన అవకాశం దొరకదనే భయం వేసిందని కూడా మాల్యా ఈ-మెయిల్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్కడ నివసిస్తున్నారో చెప్పాలని కోరగా, ఎక్కడ ఉన్నాననే విషయం వెల్లడించడం అంత తెలివిగల పని అనిపించుకోదని, సురక్షితంగా ఉండాలని తాను భావిస్తున్నానని ఆయన బదులిచ్చారు.
అంతకుముందు మాల్యా బ్రిటన్‌లో తనకోసం మీడియా వేటాడుతోందని సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయినా మీడియా తనను కనుగొనలేకపోయిందని చెప్పారు. తాను మీడియాతో మాట్లాడదలచుకోలేదని, అందువల్ల తనకోసం ఎంత వెతికినా ప్రయోజనం లేదని, అనవసరంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని ఆయన మీడియాకు హితవు పలికారు. మార్చి 2న భారత్ వీడిన మాల్యా అప్పటినుంచి మీడియా కంటపడలేదు. కేవలం ట్విట్టర్‌లో వివిధ అంశాలపై స్పందిస్తున్నారు.
సుప్రీంకోర్టులో కేసు?
మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఉద్యోగులు కంపెనీ నుంచి తమకు రావలసిన బకాయిల కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి రంగం సిద్ధం అయింది. ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాసిన ఉద్యోగులు సీనియర్ న్యాయవాది ఎం.వి.కినితో సంప్రదింపులు జరుపుతున్నారు. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సుప్రీంకోర్టులో తమ కేసును ఉచితంగా వాదిస్తానని కిని హామీ ఇచ్చారని ఉద్యోగులు తెలిపారు.