ఖమ్మం

మండలి ఎన్నికలు అందరికీ ప్రతిష్ఠాత్మకమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐక్యంగా పోటీకి ప్రతిపక్షాల వ్యూహం
* ఇతర పార్టీల వారిని తమవైపు తిప్పుకునేందుకు టిఆర్‌ఎస్ యత్నం
ఖమ్మం, నవంబర్ 27: స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఖమ్మం జిల్లాలో మాత్రమే ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీలేకపోవటంతో ఎవరికి వారే గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మొత్తం ఓటర్లలో ఎక్కువ భాగం అధికార టిఆర్‌ఎస్‌కు ఉన్నప్పటికీ మిగిలిన రాజకీయ పార్టీలన్ని ఏకమయ్యే దిశగా పని చేస్తుండటంతో టిఆర్‌ఎస్ నాయకులు కూడా ఇతర పార్టీల ఎంపిటిసిలను, వార్డు మెంబర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు విస్తృత ప్రయత్నం చేస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఎన్నికలు జరిగినప్పుడు తమ పార్టీ మద్దతుతో గెలిచిన వారందరిని ప్రత్యక్షంగా కలిసి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామ నాగేశ్వరరావు నియోజకవర్గాల వారీగా పర్యటించి ఎంపిటిసిలను, జడ్పీటిసిలను కలుస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. మరో వైపు టిఆర్‌ఎస్ నేతలు మండలాల వారీగా బాధ్యులను నియమించి ఎంపిటిసిలను తమ వైపు రాబట్టుకోవటంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక వామపక్ష పార్టీల అభ్యర్థులు తమ ఓటర్లకు పరిస్థితిని తెలియచేస్తూనే ఇతర పార్టీల మద్దతును కూడకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం అటు వామక్ష పార్టీల నేతలు, ఇటు తెలుగుదేశం పార్టీల నేతలు టిఆర్‌ఎస్‌ను ఓడించటమే లక్ష్యమని వేర్వేరుగా ప్రకటనలు చేయటం గమనార్హం. ఈ ప్రకటనల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా టిడిపి, వామపక్షాలు, వైఎస్‌ఆర్‌సిపిలు ఏకమైతే ఇబ్బందులు తలెత్తుతాయని ముందస్తుగా తమకు మద్దతునిచ్చే ఎంపిటిసిలు, జడ్పీటిసిలను నియోజకవర్గాల వారిగా క్యాంపులకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు ఎవరనే విషయం బహిర్గతం కానప్పటికీ శుక్రవారం ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన వార్తకు ఆయా పార్టీలకు మద్దతునిచ్చే ఓటర్ల సంఖ్యను ఆధారం చేసుకొని అన్ని పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటి వరకు టిఆర్‌ఎస్ నేతలు తమకు పూర్తిస్థాయి బలం ఉందని చెప్పుకుంటుండగా తమకు బలం లేదని తేలటంతో మిగిలిన అన్ని పార్టీలు ఐక్యమయ్యే వ్యూహారచన చేస్తున్నారు. అయితే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పక్షాలు అనుసరించాల్సిన వ్యూహాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని పార్టీలతో జరిగిన చర్చల్లో కార్పొరేషన్ ఎన్నికలపై కూడా చర్చించినట్లు సమాచారం.