జాతీయ వార్తలు

మణిపూర్ మహిళపై వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:దక్షిణ కొరియా రాజధాని సియోల్ జరిగే సదస్సుకు హాజరయ్యేందుకు బయలుదేరిన తనను దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు జాతివివక్ష చూపించారని, అమర్యాదగా ప్రవర్తించారని మణిపూర్‌కు చెందిన మహిళ మోనికా ఆరోపించారు. తను ఎదుర్కొన్న పరిస్తితులను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తాను భారతీయురాలినేనా అని, రాష్ట్ర సరిహద్దులు చెప్పమని ప్రశ్నించారని, విమానం బయలుదేరిపోతుందని, సమయం లేదని చెబితే నువ్వెళ్లేదాకా విమానం బయలుదేరదని ఎగతాళిగా మాట్లాడారని ఆమె వాపోయింది. కాగా సామాజిక మాధ్యమంలో ఆమెకు నెటిజన్లు మద్దతు తెలిపారు. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ జరిగిన దానిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ శాఖ తన పరిథిలోకి రాదని, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దృష్టికి ఈ విషయం తీసుకువెడతానని ఆమె హామీ ఇచ్చారు.