జాతీయ వార్తలు

మన్మోహన్‌కు ఎస్పీజీ భద్రత తగ్గింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఇచ్చే ప్రత్యేక భద్రతా బృందం (ఎస్పీజీ) భద్రతను కేంద్రం తగ్గించింది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేసిన అనంతరం ఆయనకు జడ్+ భద్రతను కొనసాగించనున్నట్లు హోంశాఖ వెల్లడించింది. భద్రత ముప్పు ఆధారంగానూ, సెక్యూరిటీ ఏజెన్సీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోంశాఖ పేర్కొంది. కాగా మన్మోహన్ కుమార్తెలు, భార్య కూడా తమకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని గతంలో వారు స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేసిన విషయం విదితమే.