మహబూబ్‌నగర్

పథకాలు పేదలకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్వకుర్తి, జూన్ 7: ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో పేదలకు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. మంగళవారం రఘుపతిపేట గ్రామంలో నిర్వహించిన పల్లె వికాసం కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా రఘుపతిపేట గ్రామంలో పలు వీధులు తిరిగి గ్రామ సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా మండల పరిధిలోని రఘుపతిపేట గ్రామంలోని రేషన్‌షాపును ఎమ్మెల్యే అకస్మీకంగా తనిఖీ చేశారు. అలాగే ఎంపిడిఓ విశ్వనాధం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికే పల్లె వికాసం కార్యక్రమాన్ని దేశాభివృద్దికి గ్రామాలే పట్టు కొమ్మలని, గ్రామ సమస్యలను పరిష్కరించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె వికాసం కార్యక్రమం చేపట్టిందని,గ్రామ సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంగారెడ్డి, ఆర్‌ఐ నజీర్, విఆర్‌ఓ ,గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.