మహబూబ్‌నగర్

ప్రైవేట్ పాఠశాల వద్దు... ప్రభుత్వ పాఠశాలే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, జూన్ 7: మక్తల్ మండల పరిధిలోని పంచలింగాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.్భంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామంలోని ఇంటింటికి వెళ్లి బడిఈడు కలిగిన పిల్లలందరినీ బడిలో చేర్పించాలనీ సంబంధిత తల్లిదండ్రులను కోరారు. ప్రైవేట్ పాఠశాల వద్దు... ప్రభుత్వ పాఠశాలలే ముద్దు, పిల్లలు బడికి.. పెద్దలు పనికి, సర్కారి చదువు... చక్కని చదువు నినాదాలతో ఉపాధ్యాయులు, పాఠశాల కమిటి సభ్యులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలసి ర్యాలీగా వెళ్లి ఇంటింటికి తిరిగారు. తమ పిల్లలను మన గ్రామంలోని పాఠశాలలో చేర్పించాలని కోరారు. పలక బలపం చేతబట్టి బడికెళ్ళే వయస్సులో పలుగుపార పట్టించి వారి జీవితాలను బుగ్గిపాలు చేయకండని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి రుసుము లేకుండా స్కూల్ డ్రస్సు, భోజనం పెడుతూ చక్కగా చదివిస్తారని అన్నారు. గుణాత్మకమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లక్ష్మికాంత్‌రెడ్డి, అంగన్‌వాడీ కార్యకర్తలు లక్ష్మీ, ఉమాదేవి, గ్రామస్థులు గురునాథ్‌రెడ్డి, హన్మంతు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు 10 మంది బడిఈడు కలిగిన చిన్నారులను బడిలో చేర్చుకోవడం జరిగింది.