మహబూబ్‌నగర్

హరితహారంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినేపల్లి, జూన్ 7: హరిత హారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని పంచాయతీ రాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని పాలెంలో ఉపాధి హామీ పథకంలో పెంచిన నర్సరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాలు లేని కారణంగా హరితహారంలో ఆశించిన ఫలితాలు సాధించలేదని, ఈ సారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నదని ఈ సారి హరితహారం ఆశాజనకంగా ఉంటుందని అన్నారు. జిల్లాలో ఐదుకోట్ల మొక్కలు నాటే విధంగా ప్రణాళికలు సిద్దం చేశామని ఎవరికి ఏ రకమైన మొక్కలు కావాల్సిస్తే అన్ని మొక్కలు అన్ని రకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే 15లక్షల ఈతచెట్లు నాటడం జరుగుతుందని తెలిపారు. ఈసందర్భంగా నర్సరీ నిర్వాహకులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలపై ఎండ వేడిమి కోసం వేసిన గడ్డి తీయకపోవడంతో మొక్కలు కుళ్ళిపోవడం గమనించిన మంత్రి ఉపాధి హామీ పథకం అధికారులపై మండిపడ్డారు. మంత్రి వెంట పిడి మోహన్‌రెడ్డి, హర్టికల్చర్ పిడి ప్రవీణ్‌కుమార్, ఎంపిపి ఎద్దుల రాములు, ఎంపిటిసి జంగం సరస్వతీ, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు శివకుమార్, టి ఆర్ ఎస్ నాయకులు గంగనమోని కుర్మయ్య, పుప్పాల శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాసులు, మహమూద్‌ఖాన్ ఉన్నారు.