మహబూబ్‌నగర్

విత్తన కంపెనీ సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూత్పూర్, జూన్ 7: మండలంలోని విత్తన ఉత్పత్తి కంపెనీల్లో వ్యవసాయాధికారులు తనిఖీ నిర్వహించారు. మండలంలోని అమిస్తాపూర్ ఉన్న వసంతా సీడ్స్,డాక్టర్ సీడ్, భూత్పూర్‌లోని గోపీకృష్ణ, సికాప్ సీడ్స్ కంపెనీల్లో మంగళవారం తనీఖీ నిర్వహించారు. గోపికృష్ణ సీడ్స్ విత్తన ఉత్పత్తి కంపెనీలో ఏప్రీల్ 22న స్ధానిక వ్యవసాధికారి భ్యూలా తనిఖీ నిర్వహించగా సూపర్‌సీడ్స్ పేరుతో విత్తనాలు ప్రాసెసింగ్ చేస్తున్నట్లు గుర్తించగా, సరైన డాక్యుమెంట్లు చూపించకపోవడంతో 230 క్వింటాళ్ల విత్తనాలను డాక్యుమెంట్లు చూపించే వరకు తరలించరాదని ఆదేశించారు. కాగా ఈనెల 3న గోపికృష్ణ సీడ్స్ కంపెనీలో తిరిగి తనిఖీ చేయగా 92 క్వింటాళ్ల విత్తనాలే ఉండగా,138 క్వింటాళ్ల విత్తనాలు మాయం చేశారు. దీంతో ఏఓ భ్యూలా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం గోపికృష్ణ సీడ్స్ కంపెనీ సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఏఓ,స్ధానిక ఆరై సమక్షంలో కంపెనీని సీజ్ చేసారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమీషనర్ కార్యాలయం ఏడీఏ వి.మదన్‌మోహన్, ఏవో నాగరాజు, జిల్లా జేడీఏ కార్యాలయం ఏఓ మురళీకృష్ణ, దేవరకద్ర ఎడిఎ ఇందిర, స్ధానిక ఏఓ భ్యూలా, ఆర్‌ఐ గురురాజారావు పాల్గొన్నారు.