మహబూబ్‌నగర్

కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమనగల్లు, జూన్ 9: జిల్లాల విభజన ప్రక్రియలో భాగంగా కల్వకుర్తి నియోజకవర్గంలో రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని ఆమనగల్లు జడ్పిటిసి హరిప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఆమనగల్లు ఎంపిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రాష్ట్రంలో జిల్లాల విభజన ప్రక్రియ వేగవంతం చేయడంతో ప్రజలు హర్షిస్తున్న పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు చేరువ అయ్యే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నిజమైయ్యే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని అఖిలపక్ష సమావేశంలో తమ అభిప్రాయాన్ని చెబుతామని అన్నారు. ఈ నెల 10న నల్గొండ జిల్లా సూర్యపేటలో జరిగే వికాస్ పర్వ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ బహిరంగసభకు జిల్లా నుండి కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు. ఈ భారి బహిరంగసభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు పలువురు ప్రముఖులు హజరు అవుతున్నారని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర టెలికాం అడ్వైజర్ మెంబర్ నరసింహ, మాజీ సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, మండల పరిషత్ ఉపాద్యక్షులు నరయ్యలు పాల్గొన్నారు.