మహబూబ్‌నగర్

రైతు సమస్యలపై ప్రత్యేక శ్రద్ద్ధ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెబ్బేరు, జూన్ 9: రైతుల సమస్యలుపరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద్ధ వహిస్తుందని భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ వనజా దేవి అన్నారు. గురువారం తిప్పాయిపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులు భూసమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, గతంలో ఎన్నడూ లేని విధంగా సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలో భూములకు సంబంధించిన 26దరఖాస్తులను రైతులు ఆమెకు వినిపించారు. 13దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించి, 13 ఇంకా పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్, తహశీల్దార్ దత్తాద్రి, ఆర్‌ఐ గీత, విఆర్వో, గ్రామస్తులు పాల్గొన్నారు.